Horoscope Prediction in Telugu 07 july 2024: ఈ రాశులవారికి ఈ రోజు అనవసర వివాదాలు, అనారోగ్య సమస్యలు - జూలై 07 రాశిఫలాలు
Horoscope Prediction 7th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
జూలై 07 రాశిఫలాలు
మేష రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తిచేస్తారు. సెలవును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. నూతన వ్యక్తులను కలుస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది.
వృషభ రాశి
ఏ పనినీ వాయిదా వేయొద్దు. మీ బాధ్యతలను ఎలాంటి విసుగు లేకుండా పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. సన్నిహితులు, స్నేహితులతో విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కండరాలకు సంబంధించిన ఆనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథున రాశి
ఈ రోజంతా బిజీగా ఉంటారు. కుటుంబ పనులు పూర్తిచేస్తారు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేయాలనే మీ ప్రయత్నం ఫలిస్తుంది. అనవసర వాదనలు పెట్టుకోవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
Also Read: జూలై 9, 16 తేదీల్లో తిరుమల వెళ్లేవాళ్లు ఇది తెలుసుకోకుంటే ఇబ్బంది పడతారు!
కర్కాటక రాశి
ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇంట్లో పెద్దవారితో మాట్లాడుతారు. నూతనంగా ప్రారంభించే పనుల వల్ల ఈ రోజు లాభపడతారు. అడగకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు. పాత స్నేహితులను కలుస్తారు.
సింహ రాశి
ఈ రాశివారు ఈ రోజు బంధువులను కలుస్తారు. వారసత్వ ఆస్తులకు సంబంధించిన వివాదాలపై చర్చలు జరుగుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. మీకు సంబంధించిన రహస్య విషయాలను బయటపెట్టొద్దు. నూతన పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటారు
కన్యా రాశి
ఈ రోజు మీకు అత్యంత సంతోషకరమైన రోజు. ఓ గుడ్ న్యూస్ వింటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది.
Also Read: ఆషాఢ గుప్త నవరాత్రులు - వారాహీ దేవిని ఎవరు పూజించాలి..ఎవరు పూజించకూడదు!
తులా రాశి
మీపై ఉండే ప్రధాన ఒత్తిడి తొలగిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనికిరాని పనులకోసం సమయాన్ని వృధా చేయవద్దు. పాతస్నేహితులను కలిసే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే సమయం వచ్చేసింది.
వృశ్చిక రాశి
నూతన పనులపై విహారయాత్రకు వెళ్లాల్సి రావొచ్చు. అనవసర చర్చలు, సంభాషణలకు దూరంగా ఉండండి. కోరి వివాదాలు కొనితెచ్చుకోవద్దు. ఉద్యోగ, వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. పెద్దలతో మీ ప్రవర్తన మర్యాదగా ఉండాలి.
ధనుస్సు రాశి
ఈ రోజంతా మీకు గందరగోళంగా ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఒకరి మాటల ఆధారంగా పెట్టుబడి పెట్టకండి. మీ జీవిత భాగస్వామితో కలసి భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకోండి. ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం.
Also Read వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్.. పూరీ రథయాత్ర గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలివి!
మకర రాశి
ఈ రోజంతా చాలా విసుగ్గా ఉంటారు. టైంపాస్ చేసేందుకు పుస్తకాలపై శ్రద్ధ వహిస్తారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులు , వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి. అధిక ఒత్తిడి తీసుకోవద్దు.
కుంభ రాశి
ఈ రాశి ఉద్యోగులు శుభవార్త వింటారు. పనిలో మెరుగుదల ఉంటుంది..దానికి తగిన ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారుంలో లాభాలు ఆర్జిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాపై ఆసక్తి ప్రదర్శిస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
మీన రాశి
ఈ రోజు అనవసర వివాదాలు జరుగుతాయి. సంభాషణ సమయంలో మాట తూలొద్దు. ఎవరినీ విమర్శించవద్దు. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.
Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!