Varahi Navaratri Significance : ఆషాఢ గుప్త నవరాత్రులు - వారాహీ దేవిని ఎవరు పూజించాలి..ఎవరు పూజించకూడదు!
Varahi Navaratri 2024:శరన్నవరాత్రుల గురించి తెలుసు..ఈ వారాహీ నరవాత్రులు ఏంటి? వారాహీ అమ్మవారిని అందరూ పూజించవచ్చా? అసలు వారాహీ దేవి ఎవరు? ఈమె గురించి పురాణాల్లో ఉందా?...ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం
Ashadha Gupta Navratri - Varahi Navaratri 2024: ఆషాడ మాసం ఆరంభంలో మొదటి తొమ్మిది రోజులను వారాహీ నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారిని పూజించినట్టే ఆషాఢగుప్త నవరాత్రుల్లోనూ తొమ్మిది రోజుల పాటూ వారాహి అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ నవరాత్రులు అందరూ చేయొచ్చా? వారాహీ అమ్మవారి గురించి పురాణాల్లో ఏముంది?
పురాణాల్లో వారాహి అమ్మవారిగురించి ఉందా అంటే.. బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, మత్స్యపురాణం...ఈ మూడింటింలో వారాహీ దేవి మహిమల గురించి ఉంది.
Also Read: వారాహీ నవరాత్రులు ఇవాల్టి నుంచి ప్రారంభం - విశిష్టత, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి !
బ్రహ్మాండ పురాణం ప్రకారం...
బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితోపాఖ్యానం ప్రకారం.. అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుడిని సంహించేందుకు ఆవిర్భవించింది. అమ్మలందరకీ మూలపుట్టమ్మ లలితాదేవి. దేవతలంతా ఆమెకు సహకరిస్తాం అంటే వద్దని వారించిన అమ్మవారు.. తనలోపల నుంచే సృష్టి ప్రారంభించింది. అలా లలితాదేవి హృదయంలోంచి బాలాత్రిపుర సుందరి, బుద్ధి శక్తిలోంచి శ్యామలాదేవి , అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. లలితాదేవికి వారాహీదేవి సన్యాధ్యక్షురాలిగా నియమించగా...అప్పుడు ఆమె విషంగుడు అనే రాక్షసుడు సంహరించింది.
మార్కండేయ పురాణం ప్రకారం
మార్కండేయ పురాణం ప్రకారం దేవి మహత్యంలో వరాహస్వామి నుంచి బయటకు వచ్చిన శక్తి వారాహి శక్తి అంటారు. చండీసప్తశతి లో అమ్మవారిగురించి ఉంది.
యజ్ఞవారాహ మతులం రూపం యా బీట్రతో హరేః ।
శక్తిఃసాప్యాయయౌ తత్ర వారాహీం భిభ్రతీ తనుం।।
రాక్షససంహారం కోసం లలితాదేవికి...దేవతలంతా వారి వారి శక్తులను ఇచ్చారు. బ్రహ్మదేవుడు సరస్వతిని బ్రాహ్మీరూపంలో, శివుడు పార్వతీదేవిని మాహేశ్వరి, కుమారస్వామి కౌమారీ, విష్ణువు వైష్ణవి, నారసింహుడు ప్రత్యంగిరీ దేవి రూపంలో శక్తులను ఇచ్చారు. వీరినే సప్తమాతృకలు అంటారు.
అమ్మవార ఖడ్గమాలలో ఈ పేర్లన్నీ వరుసగా ఉంటాయి
బ్రాహ్మీ మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా । వారాహీ చ తథేన్ద్రాణీ చాముణ్డా సప్తమాతరః ॥
హిరణ్యకశిపుడు సోదరుడు హిరణ్యాక్షుడు అమ్మవారిని ప్రార్థించి మృత్యువులేని వరం ఇమ్మన్నాడు. నువ్వు తప్ప దేవతలు, మనుషులు నన్ను చంపకూడదని కోరి వెనువెంటనే నువ్వు కూడా చంపకూడదు అన్నాడు. అప్పుడు వరాహస్వామి రూపంలో ఉన్న స్వామివారిలో కొలువైన వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడిని సంహరించింది..
Also Read: ఎనిమిది ఘట్టాలతో కూడిన ‘బోనాలు’ పండుగ..మొదలెక్కడ ముగింపేంటి!
మత్స్యపురాణం ప్రకారం
అంధకాసురుడిని సంహరించేందుకు పరమేశ్వరుడు వెళుతున్నప్పుడు కొన్ని శక్తులు ఆయనకు సహాయం చేశాయి. వాటిలో ఒకటి వారాహీ అమ్మవారు. ఇలా పురాణాల్లో వారాహీ అమ్మవారి గురించి చాలా గ్రంధాల్లో ఉంది.
వారాహి అమ్మవారిని ఎవరు పూజించాలి - ఎవరు పూజించకూడదన్నది ఈ శ్లోకంలో వివరించారు మహర్షులు
ఆర్తానాం శుభధాత్రి, ధూర్తానాం అతి దూరా వార్తా శేషావలగ్న।
కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ, వార్తాళీ భవతు వాంఛితార్థయా।।
ఆర్తులకు శుభాన్నిస్తుంది..అహంకారం, అసూయ, ఈర్ష్య,ద్వేషంతో ఉండే ధూర్తులను దూరంగా పెడుతుంది. అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం...లేదంటే ఆ ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వదు. అంటే.. తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెబుతుంది. కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే అమ్మవారిని పూజించాలి. వామాచార పద్ధతుల జోలికి వెళ్లకూడదు. బ్రహ్మవిద్యా స్వరూపిణిగా ఎవ్వరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు. అమ్మవారి కృత మనపై ఉండేలా ఆరాధిస్తే తప్పనిసరిగా మీకు అన్నీ శుభాలే జరుగుతాయి.
Also Read: వందల ఏళ్లుగా జరుగుతున్న సంబురం.. ప్రకృతికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే బోనం!