Monthly Horoscope February 2025: ఫిబ్రవరిలో ఈ రాశులవారికి గ్రహాల అనుకూల సంచారం..పట్టిందల్లా బంగారం!
February Monthly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఫిభ్రవరి నెలలో ఈ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి.

Monthly Horoscope February 2025
మేష రాశి
మేష రాశివారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ఫైనాన్స్ , బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఈ నెల చాలా మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. మీరు మతపరమైన పర్యటనలను ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు కుటుంబ సభ్యుల సమ్మతిని తీసుకోవడం మర్చిపోవద్దు. వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. మీ లక్ష్యాలపై విధేయత చూపండి. సామాజిక సమావేశాల్లో ఏకపక్ష అభిప్రాయాలు తీసుకోవద్దు. ప్రయాణంలో అపరిచితులను నమ్మవద్దు. ఉన్నత విద్యకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. నెలలో రెండో వారం, నాలుగో వారంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
వృషభ రాశి
ఈ నెలలో మీకు గ్రహాల అనుకూల సంచారం వల్ల మీకు తిరుగులేదు. వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ సామర్థ్యం మరియు తెలివితేటలు ప్రశంసలు అందుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చాలా పనులను ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఒంటరి వ్యక్తులు ప్రేమలో పడతారు. విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నెలాఖరున ఆరోగ్యం జాగ్రత్త.
Also Read: ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఈ 3 రాశులవారికి శని యోగాన్నిస్తాడు..ఈ 3 నెలలు వెయిట్ చేయాల్సిందే!
మిథున రాశి
ఈ నెల గ్రహసంచారం మీరు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో మీదే పైచేయి అవుతుంది. కార్యాలయ పనులకు సమయం కేటాయిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య కోసం బయటకు వెళ్లాలనుకునే వారికి ఈ నెల ప్రయోజనకరంగా ఉంటుంది. ఫిబ్రవరి మూడు, నాలుగు వారాల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు వస్తాయి. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలు. ఉన్నతాధికారులతో వివాద సూచనలున్నాయి. కంటికి సంబంధించిన అనారోగ్యం ఉన్నవారు జాగ్రత్త.
తులా రాశి
ఈ నెలంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. గ్రహ సంచారం అనుకూలంగా ఉండడంతో అన్ని రంగాలవారు లాభపడతారు. ఆరోగ్యం బావుంటుంది. కుటంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. కొత్త బట్టలు , ఆభరణాల కోసం షాపింగ్ చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. మొదటివారం కన్నా రెండో వారం ప్రత్యర్థులతో ఇబ్బందులుంటాయి. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ మాటలో సున్నితత్వం ఉండాలి. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించవద్దు.
Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!
వృశ్చిక రాశి
ఫిబ్రవరి నెలలో అన్ని రంగాలవారికి ఆర్థికంగా బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది.. మూడో వారంలో స్టాక్ మార్కెట్ నుంచి ప్రయోజనం పొందుతారు. ఈ నెలలో కెరీర్ బావుంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. సబార్డినేట్ ఉద్యోగులతో మంచి సంబంధాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ నెల రెండోవారంలో తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. ఉద్యోగులకు ఇది అనుకూలమైన సమయం. ఆస్తి గురించి ఒప్పందాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మకర రాశి
ఈ నెలలో మకర రాశివారికి అన్నీ శుభ ఫలితాలే ఉన్నాయి. ముఖ్యమైన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఈ నెల రెండోవారంలో కెరీర్, వ్యాపారానికి సంబంధించి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. నెల మధ్యలో ఉద్యోగులు పనిలో బాధ్యత పెరుగుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో లాభపడతారు.గత కొంతకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: రథ సప్తమి, వసంత పంచమి, మహా శివరాత్రి సహా ఫిబ్రవరిలో ( మాఘ మాసంలో) వచ్చే పండుగలివే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

