Daily Horoscope September 25th :ఈ రోజు ఈ 5 రాశులవారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, సెప్టెంబరు 25 రాశిఫలాలు
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Astrological prediction for September 25th, 2023
మేష రాశి
ఈ రాశివారు ఈ రోజు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల నుంచి సహాయం పొందుతారు. మీ వ్యక్తిత్వానికి సమాజంలో ప్రశంసలు లభిస్తాయి. ప్రేమ సంబంధాలు బావుంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.
వృషభ రాశి
మీరు ఈరోజు ఏదో ఒక పని బిజీగా ఉంటారు. రోజంతా టెన్షన్ ఉంటుంది. మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. స్త్రీలకు గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రావచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఈరోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు-మీరు తీసుకోవద్దు. నూతన గృహం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం.
మిథున రాశి
మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కొన్ని ముఖ్యమైన పనులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. ఎవ్వరి నుంచీ అతిగా ఆశించకూడదు. మీరు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి.
Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం
కర్కాటక రాశి
మీరు చేయాలనుకున్న పనిని సకాలంలో పూర్తిచేస్తారు. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అనవసర రిస్క్ తీసుకోవద్దు. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. అప్పులు తీర్చగలుగుతారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు కొనసాగించవద్దు. ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి.
సింహ రాశి
ఈ రాశివారికి ఓ పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. మీలో ఉండే స్వార్థం కారణంగా మీకు అందరూ దూరమవుతారు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహణలకు ప్లాన్ చేస్తారు. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అప్పులు ఇవ్వాల్సి ఉంటుంది.
కన్యా రాశి
ఈ రాశి దంపతుల మధ్య బంధం దృఢంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీ కోపాన్ని, ప్రవర్తనను నియంత్రణలో ఉంచుకోవాలి. మీరు ప్రారంభించే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. కోపాన్ని తగ్గించుకోవాలి. తెలివిగా పని చేయండి.
25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు
తులా రాశి
ఈ రాశివారు కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కార్యాలయంలో సంతోష వాతావరణం ఉంటుంది. కొత్తి తప్పుడు చర్యల వైపు మొగ్గు చూపుతారు. రాజకీయ వ్యక్తులకు గౌరవం పెరుగుతుంది. ఆదాయం మెరుగుదల ఉంటుంది.
వృశ్చిక రాశి
మీ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. మీ అభిరుచికి తగినట్లు పనిని పొందడం ద్వారా మీరు సంతృప్తి చెందుతారు. మీ మనసులో ఏ కోరిక అయినా నెరవేరుతుంది. రోజు ప్రారంభంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు
ధనుస్సు రాశి
అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తారు. ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలున్నాయి. మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. సవాళ్లను స్వీకరించేందుకు ఉత్సాహంగా ఉంటారు. ఎవరితోనైనా వివాదాలు తలెత్తవచ్చు.
మకర రాశి
మీ జీవన శైలిలో మార్పు ఉంటుంది. వస్తు వనరులను సేకరిస్తారు. విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పొందుతారు. ప్రారంభించిన పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీరు సామాజిక వ్యక్తుల నుంచి మద్దతు పొందవచ్చు.
Also Read: ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!
కుంభ రాశి
మీ పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మంచి ప్రవర్తన కొనసాగించండి. కోపంతో కూడిన ప్రవర్తన కారణంగా మీకు మీ సన్నిహితులు దూరమవుతారు. మీరు కొత్త మూలాల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. మీరు రుణ సంబంధిత పనిని పూర్తి చేయగలుగుతారు.
మీన రాశి
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మోసపూరిత వ్యక్తులకు దూరంగా ఉండాలి. స్నేహితులతో కాలక్షేపం చేయడం వల్ల సమయం వృథా అవుతుంది. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.