Panchak 2025: అక్టోబర్ 31 నుంచి నవంబర్ 04 వరకూ ఈ 5 రోజులు పొరపాటున కూడా మీరు చేయకూడని 5 పనులు ఇవే!
Panchak 2025: చోర పంచకమ అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం ఇది అశుభం. ఈ సమయంలో చేయకూడని 5 పనులు ఇక్కడ తెలుసుకోండి.

Panchakam Rules in Telugu: హిందూ ధర్మంలో కొత్తగా ఏ పని ప్రారంభించినా శుభసమయం చూసుకుంటారు. శుభ-అశుభ సమయాలు , వర్జ్యం, దుర్ముహూర్తం చూసుకుని ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. ఈ శుభముహూర్తం తెలుసుకునేందుకు పంచ అంగాలతో... అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంతో కూడిన పంచాంగాన్ని చూస్తారు.
పంచాంగం ప్రకారం శుభసమయాలు సరే.. అన్ని పనులకు చాలా అశుభం గా భావించే సమయాలు కూడా ఊంటాయ్. వాటిని పంచకం అంటారు.
పంచకం ఎలా ఏర్పడుతుంది?
చంద్రుడు ధనిష్ట, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర , రేవతి నక్షత్రాలను దాటి వెళ్లినప్పుడు పంచకం ఏర్పడుతుంది. ఈ సమయం దాదాపు ఐదు రోజుల పాటు ఉంటుంది అందుకే పంచకం అంటారు. ఈ సమయంలో ఇల్లు నిర్మించడం, ప్రయాణాలు చేయడం మంచిది కాదని నమ్ముతారు
పంచకంలో రకాలున్నాయి.
రోగ పంచకం
పంచకం కాలం ఆదివారం ప్రారంభమైతే రోగపంచకం ఏర్పడుతుంది. ఈ సమయం ఆరోగ్యానికి హానికరం
మృత్యు పంచకం
శనివారం పంచకం ప్రారంభమైతే అది మృత్యు పంచకం.. జీవితంలో సంక్షోభాన్ని తెస్తుంది.ఈ సమయంలో ఎవరింట్లో అయినా మరణం సంభవిస్తే ఆ కుటుంబంలో మరో వ్యక్తికి ప్రాణగండం ఉంటుందని.. లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని చెబుతారు
నృప పంచకం
సోమవారం వచ్చే పంచకం నృప పంచకం అంటారు..ఇది ప్రభుత్వానికి సంబంధించిన పనులకు శుభప్రదం..వ్యక్తిగత పనులకు అశుభం
అగ్ని పంచకం
మంగళవారం నాడు వచ్చే అగ్ని పంచకం గృహ నిర్మాణం వంటి పనులకు ప్రతికూలంగా పరిగణిస్తారు
చోర పంచకం
ఈ అశుభ ఘడియలు శుక్రవారం ప్రారంభమైతే చోరపంచకం అంటారు...ఈ ఏడాది పంచకం ఘడియలు అక్టోబరు 31 శుక్రవారం ప్రారంభమయ్యాయి. అందుకే 5 రోజుల పాటు చోర పంచకం అంటారు
శుక్రవారం రోజు ఉదయం 06:48 నుంచి చోర పంచకం ప్రారంభమై నవంబర్ 04 మంగళవారం 12:40 వరకు ఉంటుంది
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ధనిష్ట, శతభిషం, పూర్వ భాద్రపద, ఉత్తర భాద్రపద స రేవతి నక్షత్రాలు దాటి వెళితే పంచకం ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 31న ధనిష్ట శతభిష నక్షత్రాలు దాటి వెళ్తుంది.
పంచకం శుక్రవారం నుంచి మొదలు అవుతుంది అందుకే ఇది చోర పంచక్ అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చోర పంచకం నియమాన్ని అనుసరించకపోతే వ్యక్తి చాలా నష్టపోతాడని చెబుతారు. ముఖ్యంగా ఈ సమయంలో చేయకూడని కొన్ని పనులున్నాయి
పంచకంలో చేయకూడని 5 పనులు
1. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చోర పంచక సమయంలో ఏమైనా శుభకార్యం, కెరీర్ కొత్తగా ప్రారంభించడం లాంటివి చేయకూడదు
2. పంచక్ సమయం లో దక్షిణ దిశ కి ప్రయాణం చేయడం అశుభం గా భవిస్తారు. కాదు కూడదని వెళితే ఆ పని పూర్తికాదు..పైగా అనుకోని సమస్యలు ఎదురవుతాయని నమ్మకం
3. పంచక్ సమయంలో ఇంట్లో కొత్తగా ఎలాంటి శుభకార్యాలు కానీ, ఇంటి నిర్మాణ పనులు కానీ చేయకూడదు
4. పంచకంలో ఫర్నిచర్ కొనుగోలుచేయడం, రిపేర్ చేయించడం కూడా అశుభమే అంటారు
5. పంచకంలో కొత్త బట్టలు లేదా సామాన్లు కొనుగోలు చేయడం కూడా అశుభంగా భావిస్తారు
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.





















