Tirumala News: గిరిజన తండాల్లో గోవింద నామస్మరణ: 5000 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన TTD!
TTD: గిరిజన ప్రాంతాలు గోవిందనామస్మరణతో మారుమోగనున్నాయి. ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో 5 వేల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మించేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది

Tirumala : శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గిరిజన ప్రాంతాల్లో 5 వేల శ్రీ వేంకటేశ్వర స్వాని ఆలయాలు నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులు అరికట్టడంతో పాటూ హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మవ్యాప్తి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆలయ నిర్మణాలకు శ్రీకారం చుట్టారు. తిరుమల తిరుపతి దేవస్థాన పర్యవేక్షణలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనులు సాగనున్నాయి. ఈ మేరకు నిధుల కొరత లేకుండా శ్రీవాణి ట్రస్ట్ నుంచి రూ.175 కోట్లు దేవాదాయ శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించారు.
గిరిజన ప్రాంతాల్లో జనాభా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఇందుకోసం 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నారు. వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు దారిమళ్లాయన్న విమర్శలొచ్చాయ్. ఈ మేరకు పర్యవేక్షణకు వీలుగా దేవాదాయశాఖ ప్రత్యేక పోర్టల్ ను రూపొందించాలని నిర్ణయించింది. ఆలయాల నిర్మాణం ప్రారంభించిన తర్వాత వివిధ దశల్లో ఫొటోస్ అప్లోడ్ చేసేలా పోర్టల్ నిబంధనలు రూపొందించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం కోసం ఒక్కో ఆలయానికి 5 లక్షలు మాత్రమే కేటాయించింది. కూటమి ప్రభుత్వం అక్కడి జనాభా ఆధారంగా నిధులు పెంచింది.
శాశ్వత క్యూలైన్లు నిర్మాణం ( TTD Build Permanent Que lines And Sheds)
మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా క్యూ లైన్లలో భక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించే దిశగా అడుగులువేస్తోంది. సర్వదర్శనం క్యూలైన్లలో రద్దీని తగ్గించేందుకు తిరుమల ఎంబీసీ ప్రాంతంలో SSD టోకెన్ల ప్రవేశమార్గాన్ని విస్తరించడంతో పాటు, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కొత్త షెడ్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో రోజుకి దాదాపు 12 వేల నుంచి 16 వేల SSD టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ టోకెన్లు తీసుకున్న తర్వాత భక్తులు తిరుమల చేరుకుంటారు. ఏటీజీహెచ్ గెస్ట్‌హౌస్ దగ్గర ప్రవేశమార్గం నుంచి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లోకి ప్రవేశించాల్సి వస్తోంది. ఇది చాలా ఇరుగ్గా ఉండడంతో..భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కరించేందుకు ఈ ప్రాంతాన్ని విస్తరించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 4 వేలమంది భక్తులు కూర్చునేలా కొత్తగా ఒక షెడ్ నిర్మిస్తారు..క్యూలైన్ల మార్గాన్ని కూడా విస్తరిస్తారు. అప్పుడు ఎండ, వానకు ఇబ్బందిలేకుండా సేదతీరుతూ భక్తులు ముందుకు వెళ్లొచ్చు. ఇక సర్వదర్శనం శాశ్వత క్యూలైన్లు రింగురోడ్డులో కృష్ణతేజ నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు ఉన్నాయి. వీకెండ్ లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. అందుకే బాటగంగమ్మ ఆలయం నుంచి గోగర్భం జలాశయం కూడలి వరకు 12 కోట్ల వ్యయంతో శాశ్వత క్యూలైన్లు నిర్మించాలని TTD నిర్ణయం తీసుకుంది.
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం























