అన్వేషించండి

బుధుడి సంచారం, మకర రాశి సహా 4 రాశుల వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

ఏప్రిల్ 30న బుధ గ్రహం మేషరాశిలోకి ప్రవేశించింది. బుద్ధ పౌర్ణమికి ముందు, బుధుడు తన అత్యల్ప రాశిలోకి ప్రవేశించడం కొన్ని రాశుల వారికి హెచ్చరిక సంకేతంగా ఉంటుంది. మీ రాశి ఉందా ఇందులో...

బుధ గ్రహ సంచారం 2026
 
2026 ఏప్రిల్ 30న ఉదయం 6:55 గంటలకు  బుధుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ఇది బుధుడికి సంబంధించిన అత్యంత నిమ్న రాశి. కన్య, మకర, వృషభ, కుంభ రాశుల వారు మే 15 వరకు జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి

బుధ గ్రహ సంచారం మీ పన్నెండవ ఇంటిని ప్రభావితం చేస్తుంది, ఇది ఖర్చులు పెరగడాన్ని సూచిస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త . వివేకవంతమైన ఖర్చు చాలా అవసరం. మీరు పనిలో మరింత కష్టపడాల్సి ఉంటుంది . మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు, వాటిని తెలివిగా పరిష్కరించుకోవడం ఉత్తమం.

శని దృష్టి నుంచి ఇలాంటి ఉద్యోగులు తప్పించుకోలేరా! ప్రమోషన్ , ఇంక్రిమెంట్ కి ఈ ఫలితాలే ఆధారమా?

కన్యా రాశి
 
బుధుడు మీ ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. పనిలో మీకు ఒక సవాలుతో కూడిన ప్రాజెక్ట్ లేదా అదనపు బాధ్యత పెరుగుతుంది.  ఇది మొదట్లో కష్టంగా అనిపించవచ్చు. ఈ సమయంలో పరిస్థితులకు అనుగుణంగా మారడం చాలా కీలకం. తొందరపాటు నిర్ణయాలు హానికరం కావచ్చు. మానసిక ఒత్తిడి ,  చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు.

మకర రాశి

బుధుడు మీ నాలుగో ఇంట్లో సంచరిస్తున్నాడు, దీనివల్ల మీ ఇల్లు , కుటుంబ వాతావరణం ప్రభావితం కావచ్చు. మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి మీ ఆందోళనను పెంచుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఓర్పు వహించండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.

కుంభ రాశి

మీ మూడవ ఇంట్లో బుధ గ్రహ సంచారం వలన మీ దినచర్య మరింత హడావిడిగా, తీరిక లేకుండా ఉండవచ్చు. తోబుట్టువులు లేదా సన్నిహిత మిత్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి, లేకపోతే మీరు నష్టాలను ఎదుర్కోవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించండి.
 
మేషరాశిలో బుధ సంచారం అశుభంగా ఉన్నవారు ఈ సమయంలో గోవులకు మేత పెట్టడం, బుధ మంత్రాలను జపించడం, తులసి మొక్కకు దీపం వెలిగించడం వంటివి చేయాలి. ఈ చర్యలు బుధుని  అశుభ ప్రభావాలను తగ్గించడానికి సహాయపడతాయి.

మీ ఇంటి షోకేస్‌లో ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను ఏ దిశలో పెట్టాలో తెలుసా?

బుధుడు వేద జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన గ్రహం, దీనిని గ్రహాల రాకుమారుడు అంటారు. బుధ గ్రహం బుద్ధికి సంకేతం. మేథస్సు, బుద్ధి, వాక్కు, తర్కం, తెలివితేటలకు, కమ్యూనికేషన్, అభ్యాసం, వ్యాపారం, వాణిజ్యానికి సంకేతం. జాతకంలో బుధ గ్రహం బలంగా ఉంటే వాక్చాతుర్యం, త్వరగా నేర్చుకోవడం, వ్యాపారంలో విజయం ఉంటుంది. బుధుడు బలహీనంగా ఉంటే..మాటల్లో తడబాటు, నిర్ణయాల్లో ఆలస్యం, చదువులో ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.  

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget