అన్వేషించండి

మీ ఇంటి షోకేస్‌లో ట్రోఫీలు, సర్టిఫికేట్‌లను ఏ దిశలో పెట్టాలో తెలుసా?

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ట్రోఫీలు సర్టిఫికెట్లను సరైన దిశలో, సరైన స్థానంలో ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మీ గుర్తింపు, విజయాలు , మీ కష్టానికి ప్రతీకలుగా నిలుస్తాయి.

Vastu Tips in Telugu:  ఇంట్లో ఉంచే ట్రోఫీలు, సర్టిఫికెట్లు కేవలం ప్రదర్శన లేదా అలంకరణ కోసం మాత్రమే కాదు, అవి మీ కష్టానికి, విజయాలకు, గుర్తింపునకు కూడా చిహ్నాలు. కానీ చాలా మంది వాటిని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఉంచుతారు; కొన్నిసార్లు బీరువాలో తాళం వేసి, మరికొన్నిసార్లు ఒక మూలలో దుమ్ము పట్టేలా పడేస్తారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ట్రోఫీలు  సర్టిఫికెట్లను సరైన దిశలో ఉంచితే, అవి మీ సానుకూల శక్తిని పెంచడమే కాకుండా, వృత్తి   విజయానికి కొత్త మార్గాలను కూడా తెరుస్తాయి. 

ట్రోఫీని సరైన దిశలో ఎలా ఉంచాలి?

మీ కష్టానికి మరింత గుర్తింపు, గౌరవం కావాలనుకుంటే, మీ ట్రోఫీలు , సర్టిఫికెట్లను మీ ఇంటి పడమటి దిశలో ఉంచండి. అంతేకాకుండా, దీర్ఘకాలిక విజయం, స్థిరత్వం , శ్రేయస్సు కోసం, ట్రోఫీలను నైరుతి దిశలో ఉంచడం మంచిది

ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా చదువులో పురోగతి సాధించాలనుకునే వారికి, ట్రోఫీలు మరియు సర్టిఫికెట్లను ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదం అని చెబుతారు వాస్తు నిపుణులు
 
ట్రోఫీలను ఏ ప్రదేశాలలో ఉంచకూడదు?

తూర్పు
తూర్పు దిశను ఆధ్యాత్మికతకు,  నూతన ఆరంభాలకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ ట్రోఫీని ఉంచడం వలన మీరు గత విజయాలకే పరిమితమైపోవచ్చు. 

పడకగదిలో ట్రోఫీలను ఉంచడం

పడకగది అనేది విశ్రాంతికి, ప్రశాంతతకు నిలయమైన ప్రదేశం. అక్కడ ట్రోఫీలను ఉంచడం వల్ల మానసిక ఆందోళన పెరగడమే కాకుండా నిద్రకు కూడా ఆటంకం కలుగుతుంది. 

విరిగిన లేదా దుమ్ము పట్టిన ట్రోఫీ

మీ ట్రోఫీ విరిగిపోయినా లేదా మురికితో కప్పి ఉన్నా, అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. దాన్ని బాగుచేయించడం లేదా తీసివేయడం ఉత్తమం. 

ట్రోఫీని భద్రపరచడానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు

ఇంట్లో ట్రోఫీలు మరియు సర్టిఫికేట్‌ల కోసం ఒక స్థలాన్ని కేటాయించండి. వాటిని మీ షోకేస్‌లో క్రమబద్ధంగా అమర్చి ఉంచండి. 

మీ విజయాలు స్పష్టంగా కనిపించేలా, ట్రోఫీలను భద్రపరిచే ప్రదేశంలో మంచి లైటింగ్‌ను ఉపయోగించండి.

మీ విజయాలను దాచవద్దు, వాటిని బహిరంగంగా ప్రదర్శించండి. అలా చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 

వాస్తుతో పాటు, కష్టపడటం కూడా అవసరం

మొత్తమ్మీద, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అనేవి మీ కష్టానికి లభించే గుర్తింపు. వాటిని సరైన దిశలో, సరైన పద్ధతిలో అందిస్తే, అవి మీ మానసిక బలాన్ని పెంచి, ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. అయితే, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేవలం ట్రోఫీ దిశను మార్చినంత మాత్రాన జీవితం మారిపోదు; కష్టపడటం కూడా అంతే ముఖ్యం. 

 మీ విజయాలను, ట్రోఫీలను, సర్టిఫికెట్లను గౌరవించడం నేర్చుకోండి. మీరు వాటికి విలువ ఇచ్చినంత కాలం, జీవితంలో విజయం సాధిస్తూనే ఉంటారు. వీటిని నిర్లక్ష్యం చేయడం ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
Guru Gochar 2026: నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Chandra Grahan 2026: చంద్ర గ్రహణం రోజు రక్షా బంధన్! పూజ చేసేందుకు సమయం, నియమాలు తెలుసుకోండి!
చంద్ర గ్రహణం రోజు రక్షా బంధన్! పూజ చేసేందుకు సమయం, నియమాలు తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget