అన్వేషించండి

సెప్టెంబరు 24 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈరోజు ఆదాయం, గౌరవం పెరుగుతుంది!

Horoscope Prediction 24 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 24 September 2024

మేష రాశి 

ఏదో విషయం గురించి ఆందోళన పెరగొచ్చు. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. కఠినమైన విషయాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. తప్పుడు ఆలోచనలు పెట్టుకోవద్దు. 

వృషభ రాశి

ఈ రాశి ఉద్యోగులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తారు. నూతన ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ లోపాలు మీ బలహీనతను పెంచుతాయి.. ఆలోచించి అడుగువేయండి. అనవసర వాదనలు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. 

మిథున రాశి

పిల్లలకు సమయం కేటాయిస్తారు. కెరీర్లో మంచి మార్పులు రావచ్చు. మీ దినచర్య మెరుగుపడుతుంది. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. మతపరమైన విషయాలను చాలా సున్నితంగా డీల్ చేయండి. అనుకోని ఖర్చులుంటాయి 

Also Read: ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే చేసిన పాపం పోతుందా - పాపులను దేవుడు వెంటనే ఎందుకు శిక్షించడు!

కర్కాటక రాశి

వ్యాపారంలో పురోగతి ఉంటుంది. నిద్రలేమితో , రక్తపోటు సమస్యలు ఉండొచ్చు. నూతన వ్యక్తులను త్వరగా నమ్మేయవద్దు. ఉన్నతాధికారులు మీపై ఆగ్రహంగా ఉంటారు. ప్రేమ సంబంధాల విషయంలో కొంత అసహనానికి గురవుతారు. మీ భావాలు మీ భాగస్వామికి తెలియకుండా సమస్యలు పరిష్కరించుకోండి. 

సింహ రాశి

ఈ రోజు పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మీరు చేయాలనుకున్న పనిని మాత్రమే చేయండి. చేపట్టిన పనిని అసంపూర్తిగా వదిలేయవద్దు. జీవిత భాగస్వామి నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. మీ ప్రవర్తనలో మార్పును మీరు గమనిస్తారు.

కన్యా రాశి 

ఈ రోజు మీ పని తీరు మంచి ఫలితాలను అందిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. అవివాహితులు వివాహం చేసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. మీ ప్రవర్తన కుటుంబ సభ్యులకు కోపం తెప్పిస్తుంది. 

తులా రాశి

ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు ముఖ్యమైన విషయంపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ మాటను అదుపులో ఉంచుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. 

వృశ్చిక రాశి

మీ ప్రణాళికల గురించి ఇతరులతో చర్చించవద్దు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి.  మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తనను చక్కగా ఉంచండి.  పరిశోధన పనిలో ఆసక్తి కలిగి  ఉంటారు. స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

Also Read: తిథి తెలియకపోతే పితృదేవతలకు శ్రాద్ధం ఎప్పుడు పెట్టాలి - పితృపక్షం మిస్సైతే మరో ఆప్షన్ ఇదే!

ధనుస్సు రాశి
 
వైవాహిక జీవితం,ప్రేమలో ఉండే వివాదాలు సమసిపోతాయి.  మీ దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.   వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం పూజలు చేస్తారు. ఉద్యోగులకు మంచి రోజులు మొదలవుతున్నాయి. 

మకర రాశి

ఈ రోజు మీకు తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. వ్యాపారంలో క్షీణత గురించి  ఆందోళన చెందుతారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి.  ఒత్తిడి చేసిన తర్వాత పెండింగ్ డబ్బు పొందుతారు. వాహన సౌఖ్యం ఉంది. 

కుంభ రాశి

అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగం బాగానే సాగుతుంది.  మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 

మీన రాశి 

ఆదాయం, గౌరవం పెరుగుతాయి. ఇంట్లో పరిస్థితులతో మీరు అసౌకర్యానికి గురవుతారు. ప్రత్యర్థులపట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని అసహనానికి గురిచేస్తాయి. ఆరోగ్యం బావుంటుంది.  

Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Kia Syros: కియా సైరోస్ లాంచ్ అయ్యేది ఆరోజే - సోనెట్‌ను మించిన కారు!
కియా సైరోస్ లాంచ్ అయ్యేది ఆరోజే - సోనెట్‌ను మించిన కారు!
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Kia Syros: కియా సైరోస్ లాంచ్ అయ్యేది ఆరోజే - సోనెట్‌ను మించిన కారు!
కియా సైరోస్ లాంచ్ అయ్యేది ఆరోజే - సోనెట్‌ను మించిన కారు!
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Raj Kundra News: చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త- రాజ్‌కుంద్రా ఇల్లు ఆపీస్‌పై ఈడీ దాడులు
చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త- రాజ్‌కుంద్రా ఇల్లు ఆపీస్‌పై ఈడీ దాడులు
Mokshagnya Teja New Look: స్టైలిష్, ఛరిష్మాటిక్, హ్యాండ్సమ్ మోక్షజ్ఞ... బాలయ్య తనయుడి న్యూ లుక్ అదుర్స్ కదూ
స్టైలిష్, ఛరిష్మాటిక్, హ్యాండ్సమ్ మోక్షజ్ఞ... బాలయ్య తనయుడి న్యూ లుక్ అదుర్స్ కదూ
Pune News In Telugu: పూణెలో దారుణం- క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆడుతూ 35 ఏళ్ల క్రికెటర్ మృతి
పూణెలో దారుణం- క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆడుతూ 35 ఏళ్ల క్రికెటర్ మృతి
Kiara Advani: కియారా అద్వానీ ఏముందిరా... కుర్రాళ్ళ గుండెల్లో నానా హైరానా
కియారా అద్వానీ ఏముందిరా... కుర్రాళ్ళ గుండెల్లో నానా హైరానా
Embed widget