Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే చేసిన పాపం పోతుందా - పాపులను దేవుడు వెంటనే ఎందుకు శిక్షించడు!
Pawan Kalyan 11 Days Deeksha: దేవుడున్నాడా? ఉంటే పాపం చేసిన వాళ్లని ఎందుకు వదిలేస్తున్నాడు? ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పోతుందా? అసలు ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ప్రాయశ్చిత్త దీక్ష వల్ల ఉపయోగం ఏంటి!
Pawan Kalyan 11 Days Deeksha over Tirumala Laddu: చేసిన పాపాలు ఊరికేపోతాయా? శిక్ష అనుభవించాలి కదా? సాధారణంగా గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో శిక్ష అనుభవిస్తారని చెబుతారు. అదే కర్మఫలం...కానీ ఇది కలియుగం..ఎప్పటి పాపాలకు అప్పుడే శిక్ష పడుతుందని కూడా చెబుతారు. మరి చేసిన పాపానికి శిక్ష పడకూడదు అంటే ఏం చేయాలి?
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ విషయంలో జరిగిన అపచారానికి ప్రక్షాళనగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు.
- అసలు ప్రాయశ్చిత్తం అంటే ఏంటి?
- దీనివల్ల ఏం ఫలితం పొందుతారు?
- పురాణాల్లో ప్రాయశ్చిత్త దీక్షల గురించి ఏముంది?
మీరు చేసిన పాపం బయటపడినా పడకపోయినా.. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా.. చివరకు మీరు కూడా అంగీకరించకపోయినా.. భగవంతుడి కళ్లుమూసేయలేరు.. మిమ్మల్ని అనుక్షణం గమనించే పంచభూతాల నుంచి తప్పించుకోలేరు..ఇవన్నీ భగవంతుడు చిట్టారాసి పెడతాడు.
పాపాలను మొత్తం లిస్ట్ రాసే భగవంతుడు..వెంటనే శిక్షలు వేయకుండా..ఎప్పుడో వేయడం ఏంటి అనే సందేహం వచ్చిందా?
ఓసారి పరీక్షలో తప్పితే వాళ్లకి చదువు కొనసాగించే అర్హత లేదని కాదు..మరోసారి కష్టపడి చదివి పాసయ్యేందుకు అవకాశం తల్లిదండ్రులు , గురువులు ఇస్తారు. అలానే చేసిన తప్పును గుర్తించి దానికి పాపపరిహారం చేసుకునేందుకు ప్రాయశ్చిత్త దీక్ష. బిడ్డకు మరోసారి పరీక్ష రాసి పాసయ్యే అవకాశం తల్లిదండ్రులు ఇచ్చినట్టే.. చేసిన తప్పు తెలుసుకుని మరోసారి చేయకుండా ఉండేందుకు భగవంతుడు ఇచ్చే అవకాశం ప్రాయశ్చిత్త దీక్ష. ఇలాంటి ప్రాయశ్చిత్తాలు శాస్త్రంలో 10 రకాలున్నాయి...
Also Read: తిరుమల లడ్డూ 3 రకాలు.. ఏ సందర్భంలో ఏమిస్తారు - మీరు తీసుకున్న ప్రసాదం ఏ రకం!
శాస్త్రంలో 10 రకాల ప్రయాశ్చిత్తాలున్నాయి...
మోసం చేసేవారికి
ఎవరిపట్ల పాపం చేశారో అక్కడే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మిమ్మల్ని నమ్మి అప్పగించే ఆస్తులను తిరిగి ఇవ్వకపోవడం, బాధ్యతలను విస్మరించి అక్రమాలకు పాల్పడడం చేస్తే అది మహాపాపం..దానికి ప్రాయశ్చిత్తంగా ఎవరినైతే మోసం చేశారో వారికి తిరిగి న్యాయం చేయడం..జీవితంలో మరోసారి ఆ తప్పు చేయకపోవడమే ప్రాయశ్చిత్తం.
సరిదిద్దుకోలేని పాపం
ఎవరిపట్ల పాపం చేశారో వారి వద్దకే తీసుకోలేని అవకాశం రాలేదనుకోండి..దానికి ప్రత్యామ్నాయంగా చేసే సేవద్వారా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. తల్లిదండ్రులపై నిర్లక్ష్యంగా వ్యవహరించి వారు చనిపోయాక బుద్ధి వస్తే ఏం లాభం...ఇలాంటి వారు వృధ్దాశ్రమాల్లో సేవ చేయాలి.. అదే ప్రాయశ్చిత్తం..
ప్రాణులను చంపితే
చిన్న చిన్న ప్రాణులు, పక్షులను తెలికుండా చంపేస్తుంటారు..ఆ తర్వాత అది తెలిసి అయ్యో అని బాధపడతారు. ఆ బాధలోనే సగం ప్రక్షాళన అవుతుంది. ఆ తర్వాత పక్షులు, పశువులకు ఆహారం అందించడం ద్వారా ప్రక్షాళన జరుగినట్టే.
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
తెలియక పాపం చేస్తే
తెలిసో, తెలియకో పాపాలు చేస్తే అందుకు ప్రాయశ్చిత్తంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో భారీగా అన్నదానం చేయాలి. నియమనిష్టలతో గాయత్రి జపం చేయాలి.
పాపం అని తెలిసి కూడా చేస్తే..
పాపం తెలిసి కూడా పాపాలు చేసేవారు..చాంద్రాయణ వ్రతం ఆచరించాలి. అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు ప్రదోష వేళ వరకూ ఉపవాస నియమాలు పాటించి ఓ ముద్ద తింటారు. అప్పటి నుంచి పౌర్ణమి వరకూ చంద్రుడు పెరుగుతున్నట్టే రోజుకో ముద్ద చొప్పున ఆహారం పెంచుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత అమావాస్య వరకూ ఓ ముద్ద తగ్గిస్తూ తినాలి..ఇలా నెల రోజులు చేసేదే చాంద్రాయణ వ్రతం. అయితే పాపాలు చేసి ఈ వ్రతం ఆచరించేయడం కాదు..ఓసారి వ్రతం ఆచిరించిన తర్వాత పాపం చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు..
Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
గోహత్య చేస్తే
పంచమహాపాతకాల్లో ఒకటైన గోహత్య చేసినవారికి ప్రయాశ్చిత్తం అంటే గోవును దత్తత తీసుకుని దాని పోషణ బాధ్యతలు భరించడమే.
భ్రూణహత్య చేస్తే
పంచ మహాపాతకాల్లో ఒకటైన భ్రూణహత్య చేసినవారు.. రామేశ్వరం వెళ్లి ధనుష్కోడి దగ్గర నియమ నిష్టలతో గాయత్రి జపం చేయాలి.
హత్య చేస్తే
హత్యలు చేసి ప్రాయశ్చిత్తం కోరుకోవడమే మాహా పాపం. నిజంగా మీలో పరివర్తన , పాపభీతి ఉంటే..కోటి గాయత్రి చేయాలి. రోజుకి వెయ్యి గాయత్రి అన్నమాట.. అప్పుడు మీలో నిజంగానే ఊహించని మార్పు వచ్చేస్తుంది.
మందు తాగేవారికి
పంచమహాపాతకాల్లో మద్యపానం కూడా ఒకటి. ఈ పాపం నుంచి బయటపడాలంటే కాశీలో 9 రోజులు నిద్రచేసి నిత్యం గంగాస్నానం ఆచరించి సహస్ర గాయత్రి చేయాలి.
పాపులతో కలసి తిరిగినా పాపమే
పాపమే చేయాల్సిన అవసరం లేదు..అలాంటోళ్లతో కలసి తిరిగినా పాపమే. ఇలాంటి వారు ఆ దోషం నుంచి ప్రాయశ్చిత్తం కోసం పావమాన సూక్తం, పురుష సూక్తం, త్రిషుపర్ణ మంత్రం నిత్యం చదువుకోవాలి.
ఈ ప్రాయశ్చిత్తాలు అన్నీ శాస్త్రంలో స్పష్టంగా చెప్పినవే...చేసిన పాపానికి ఈ జన్మలోనే పరిహారం చేసుకునేందుకు భగవంతుడు ఇచ్చిన అద్భుత అవకాశమే ప్రాయశ్చిత్తం..దానిని ఉపయోగించుకుని ప్రక్షాళన చేసుకుంటారో..కర్మ ఫలాన్ని జన్మజన్మలకు అనుభవిస్తారో మీ ఆలోచనపై ఆధారపడిం ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు, తిరుమల అప్ డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....