Astrology: ఈ రాశులవారు రహస్యాన్ని రహస్యంగా ఉంచలేరు!
Zodiac signs: రహస్యం అంటేనే ఎవ్వరికీ చెప్పొద్దని అర్థం. కానీ సీక్రెట్స్ ని సీక్రెట్ గా ఉంచడం అంత సులభం కాదు. ముఖ్యంగా కొన్ని రాశులవారు అస్సలు సీక్రెట్స్ మెంటైన్ చేయలేరట. అది వారి రాశి లక్షణం...
Zodiac signs who cannot keep a secrets: మనసులో ఉండే సంతోషం, బాధ, కష్టం ఏదైనా కానీ ఎవరో ఒకరితో పంచుకుంటే మనసు తేలికపడుతుంది. కొన్ని సలహాలు తీసుకోవడం వల్ల ఏదైనా పరిష్కార మార్గం కూడా దొరుకుంది. కేవలం ఆత్మీయులతో మాత్రమే ఇవన్నీ చెప్పగలం...అలా చెప్పేముందు ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని చెబుదాం. అయినా కానీ కొందరు మాత్రం సీక్రెట్ మెంటైన్ చేయలేరు. చెప్పేయాలని చెప్పేయరు కానీ వాళ్లకి తెలియకుండానే అలా జరిగిపోతుందంతే...ముఖ్యంగా ఈ ఐదు రాశులవారు ఈ కోవకే చెందుతారు...
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మేషరాశిపై అంగారకుడి ప్రభావం ఉంటుంది. అందుకే ఈ రాశివారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఒక్కోసారి అత్యుత్సాహం కూడా ఎక్కువే. అందుకే ఎవ్వరికీ చెప్పొద్దనే మాట వీళ్లకి అస్సలు నచ్చదు. పైగా ఎవ్వరికీ చెప్పొద్దంటే..తనకు మాత్రమే తెలుసనే ఆలోచనతో ఈజీగా చెప్పేస్తారు. వీళ్లకి రహస్యాలంటే పెద్దగా గిట్టవు...తనకు తెలిసిన ఏ విషయం అయినా వెంటనే ఇతరులతో పంచేసుకుంటారు. అందుకే ఈ రాశివారికి ముఖ్యమైన విషయాలు చెప్పేటప్పుడు జాగ్రత్త వహించాలి.
Also Read: గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
మిథున రాశివారు మహా మాటకారులు. ఎంచక్కా మాట్లాడుతూ కొత్తవారితో కూడా ఇట్టే కలసిపోతారు. వీళ్లకి కూడా అస్సలు సీక్రెట్స్ మెంటైన్ చేయడం రాదు. ఏదైనా విషయం తెలిసిందంటే మాత్రం తమ ప్రియమైనవారు అడగకపోయినా చెప్పేస్తారు. చెప్పడం వల్ల చాలాసార్లు నష్టపోయినా వీరు తీరు మారదు. అందుకే మిథున రాశివారితో సీక్రెట్స్ షేర్ చేసుకోపోవడమే మంచిది.
కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
కర్కాటక రాశివారిది చంచల స్వభావం. ఎప్పుడెలా ఉంటారో తెలియదు. మనసులో ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పేస్తారు. ఈ విషయం చెప్పొచ్చు చెప్పకూడదు అని ఆలోచించరు. అంతా జరిగాక మాత్రం తలుచుకుని ఒంటరిగా కూర్చుని బాధపడతారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.అందుకే కర్కాటక రాశివారితో ముఖ్యమైన విషయాలు చెప్పకపోవడమే మంచిది
Also Read: ఈ 4 రాశులవారు మొండి ఘటాలు, వీళ్లతో అస్సలు వాదించలేం!
తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
తులారాశివారు లెక్చర్లు ఇవ్వడంలో ముందుంటారు. వీరితో చర్చల్లో పాల్గొనే వారు ఎన్నో విషయాలు తెలుకుంటారు. వీరి స్వభావరీత్యా చిన్న చిన్న విషయాలను కూడా మూడో వ్యక్తికి చెబుతారు. అలా చెప్పేవరకూ మనశ్సాంతి ఉండదు. అందుకే ఈ రాశివారికి కూడా అన్ని విషయాలు చెప్పకుండా ఉండడం మంచిది.
ధనుస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ధనస్సు రాశివారు ఎవ్వరినైనా తొందరగా అట్రాక్ట్ చేస్తారు. మాటల్లో పడితే అన్నీ మరిచిపోతారు. ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నారో కూడా మరిచిపోయి...అవసరమైనవి..అవసరం లేనివి....రహస్యంగా ఉంచాల్సినవి కూడా చెప్పేస్తారు. అందుకే ఈ రాశివారితో మంచి స్నేహం ఉన్నప్పటికీ సీక్రెట్స్ చెప్పకపోవడమే మంచిది.
Also Read: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!
గమనిక: రాశిఫలాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…