By: ABP Desam | Updated at : 07 Apr 2023 01:53 PM (IST)
ఏపీ వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ ప్రోగ్రాం ప్రారంభం
YSRCP News : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు అట్టహాసంగా ప్రారంభించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు.. ఎమ్మెల్యేలు, గృహ సారథులు కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. ఈ నెల 20 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న... కార్యక్రమంతో ఎమ్మెల్యే లు... ప్రజాప్రతినిధులు... నియోజక వర్గ నేతలు.. గృహ సారధులతో ప్రజల్లోకి వెళ్ళేందుకు జగన్ ప్లాన్ చేశారు. రెండు వారాల పాటు రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ప్రజల అభిప్రాయం తీసుకుంటారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తారు. ప్రజలకు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా తెలియచేస్తూ ఐదు ప్రశ్నలతో ప్రజాభిప్రాయసేకరణ చేస్తారు.
ప్రతి ఇంటికి వెళ్ళినపుడు వారి అనుమతితో జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ కూడా అందిస్తున్నారు. వారికి నచ్చితే స్టిక్కర్ గోడకు అంటించుకోవచ్చు. అంటించమంటే వాలంటీర్లే అంటిస్తారు. అదే విధంగా సెల్ ఫోన్ పై కూడా అంటించే స్టిక్కర్ ఇస్తున్నారు కోటి 60 లక్షల ఇళ్ల దగ్గరకు వెళ్లి ప్రజల అభిప్రాయం తీసుకుంటారు. ఏప్రిల్ 7 నుంచి ఒక సమూహంగా పీపుల్స్ సర్వే జరుగుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గృహసారధులు కోటి 60 లక్షల మంది ఇళ్లకు వెళ్లి ప్రజలతో మాట్లాడతారని, ఇదొక వినూత్న కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ప్రజల మద్దతు కొరడమే ప్రధాన అజెండాగా కార్యక్రమం జరుగుతుందని వివరించారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుందని, అన్ని ఇళ్లకు వెళ్లి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఆడిగి తెలుసు కుంటారని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఎక్కడా లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సమానత్వం దిశగా అడుగులు వెయ్యడంలో సీఎం జగన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారని సజ్జల అన్నారు.
సంతృప్తి చెందితేనే ఆశీస్సులు ఇవ్వండి అని సీఎం జగన్ అడుగుతున్నారని, మా నమ్మకం, నువ్వే జగన్ అనే నినాదం ప్రజల్లోంచి వచ్చింది. ప్రజలు ఇచ్చిందేనని సజ్జల వెల్లడించారు. ఈ ఏడాది సంక్షేమ క్యాలెండర్ ఇప్పటికే జగన్ ప్రకటించారని, భవిష్యత్ లో కూడా ఇంతకు మంచిన సంక్షేమం ఉండబోతోందని ఆయన వెల్లడించారు. జగనన్నే.. మా భవిష్యత్ కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉండబోతోందని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాన్ని జనం దగ్గరకి తీసుకుని నేతలు వెళతారని, గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా గుర్తించే విధంగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జగన్ పాలన కి సంబంధించి ఐదు ప్రశ్నలు ఉంటాయని, పాలనపై అభిప్రాయం 82960 82960 నంబర్ కు తెలియచేయాలని సూచించారు. ఇంటి యజమాని అనుమతితో ఇంటికి జగన్ స్టిక్కర్ అంటిస్తారని, సెల్ ఫోన్ కు కూడా స్టిక్కర్ వేసుకోవచ్చు. ఇదంతా ప్రజల ఇష్ట ప్రకారం జరుగుతుందన్నారు.
జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం గురించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌లు వివరించారు. దేశ చరిత్రలోనే తొలిసారి పార్టీ కార్యకర్తలతో కోటి 80 లక్షల కుటుంబాలకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళుతున్నామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం జగన్ ఆలోచనలు ఎలా అమలయ్యాయో ప్రజలతో వివరిస్తామన్నారు. పార్టీ కన్వీనర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి.. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి వివరిస్తారన్నారు.
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే
Kodela Shivaram: మరో వివాదంలో కోడెల శివరాం, బాధితుల తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలు!
Amaravati JAC: ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఇది చారిత్రక విజయం - అమరావతి జేఏసీ
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!