YSRCP Politics: ఇప్పుడు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలు! భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు: బొత్స, సజ్జల క్లారిటీ
YSRCP News: అందరికీ సముచిత స్దానం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
YSRCP new incharges for 11 Assembly constituencies: తాడేపల్లి: అందరికీ సముచిత స్దానం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందులో భాగంగానే 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తలను నియామించారని తెలిపారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాజాగా నియమతులైన సమన్వయకర్తలు మంగళవారం నుంచి పార్టీ వ్యవహరాలను పర్యవేక్షించనున్నారు. పార్టీ ఏ ఒక్కరినీ వదులుకోదని.. అందరి సేవలు వినియోగించుకుంటుంది. 175 కి 175 స్థానాల్లో పార్టీ అభ్యర్దులు విజయం సాధించాలని సీఎం జగన్ కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అన్ని వర్గాలవారికి జగన్ ధైర్యాన్నిచ్చారు. అందులో భాగంగానే మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్వయంగా గంజి చిరంజీవిని తీసుకొచ్చి జాయిన్ చేశారు. మంగళగిరి అభ్యర్దిగా చిరంజీవిని నిర్ణయించారు. ఆర్కేకి ఏ రకంగా సముచిత స్థానం ఇవ్వాలో అలానే చేస్తామన్నారు.
ప్రస్తుతం 11 నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించామని, మెరుగైన ఫలితాల కోసం భవిష్యత్తులో మరిన్ని మార్పులు ఉంటాయని బొత్స స్పష్టం చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేక మైన స్థానం ఇవ్వాలని లక్ష్యంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. అందరికి అన్ని అవకాశాలు కల్పిస్తాం.. వీలైనంతవరకు సముచిత స్థానం ఇవ్వాలనేది జగన్ లక్ష్యం. ఈ మార్పులతో కొందరికి బాధ ఉండొచ్చు కానీ.. అందరూ పార్టీకి సహకరిస్తారని ఆకాంక్షించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు:
ప్రత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్
కొండెపి - ఆదిమూలపు సురేష్
వేమూరు - వరికూటి అశోక్ బాబు
తాడికొండ - మేకతోటి సుచరిత
సంతనూతలపాడు - మేరుగు నాగార్జున
చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు
గుంటూరు పశ్చిమ - విడదల రజనీ
అద్దంకి - పాణెం హనిమిరెడ్డి
మంగళగిరి - గంజి చిరంజీవి
రేపల్లె - ఈవూరు గణేష్
గాజువాక - వరికూటి రామచంద్రరావు
పార్టీని స్థాపించినప్పటి నుంచీ ఈ 12 ఏళ్లలో వైయస్ జగన్ వైసీపీని ప్రజలకు జవాబుదారీగా ఉంచారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేకి జగన్ ఎంత విలువిస్తారో, క్యాడర్ కు, కార్యకర్తకూ అంతే విలువ ఉంటుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవ అందించడానికి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ 11 నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేశామన్నారు. భవిష్యత్తులోనూ మార్పులు ఉండవచ్చు అని, దీన్ని వేరేరకంగా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతామని.. ఎందుకు ఇలా చేశామనేది వారికి వివరిస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం మంచి మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావాలని, ప్రజలకు మరింత సేవ చేయాలనే జగన్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఒక సెన్సేషనల్ కోసం సీఎం జగన్ ఏదీ చేయడం లేదన్నారు. ప్రతిపక్షాలు గాలిలో మాటలు చెప్పి... ప్రజలను కన్ఫ్యుజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని.. పొత్తులకు ఒక దారీ తెన్నూ లేదని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం కోసం సాధ్యమైనంతగా ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు పెద్ద పీట వేయాలనే అధిక సీట్లు వారికి కేటాయిస్తామని తెలిపారు.
Also Read: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాజీనామా! అసలు విషయం చెప్పిన వైసీపీ నేత