అన్వేషించండి

YSRCP: యువతపోరుకు ప్రభుత్వ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లిన వైసీపీ నేతలు - ప్రమాదంలో గాయాలు - లోకేష్ తీవ్ర ఆగ్రహం

Nara Lokesh: రాజకీయ నిరసనలో పాల్గొనేందుకు ఎంపీపీ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లాడు ఓ వైసీపీ నేత. వారికి అక్కడ యాక్సిడెంట్ అయింది. ఈ ఘటనపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh:  వాళ్లంతా చిన్న పిల్లలు, రాజకీయం అంటే ఏమిటో తెలియదు. కానీ వారందర్నీ స్కూల్ నుంచి తీసుకెళ్లారు వైసీపీ నేతలు. తమ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారిని తీసుకెళ్లారు. కానీ అక్కడ వారికి ప్రమాదం జరిగింది. ఏడుగురు పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటనపై నారా లోకష్ కు ట్విట్టర్ లో ఫిర్యాదు అందింది. 

పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం,బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని MPP స్కూల్‌ కు చెందిన పిల్లలను రాజకీయ కార్యక్రమానికి వైసీపీ నేతలు తీసుకెళ్లారు.  స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ MLA జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు.   MEO , యు HM ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు.తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. 

వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది.MEO , HM బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధమని శ్యామ్ అనే నెటిజన్ విద్యా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.  ఈ సంఘటనను వెంటనే విచారణ జరిపి బాధ్యులైన MEO మరియు HMపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రతతో రాజీ పడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించలేము.త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాననని ట్వీట్ చేశాడు. ఫోటోలు వీడియోలు అన్నీ షేర్ చేశారు. 

నారా లోకేష్ ఈ ఘటనపై వెంటనే స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉన్నతాధికారుల్ని నివేదిక అడిగారు.  పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు- అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని  స్పష్టం చేశారు.  

వైసీపీ నేతల తీరు రాష్ట్రంలో వివాదాస్పదమవుతున్న సమయంలో యువత పోరు అంటూ.. స్కూల్ పిల్లల్ని ఊరేగింపుగా తీసుకెళ్లడం  దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యేపైకేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.                          

టాప్ హెడ్ లైన్స్

Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
AP Mega DSC Politics: డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget