అన్వేషించండి

YS Jagan: వైఎస్ జగన్‌, వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన కేసులు - పిలిచినప్పుడు విచారణకు రావాలని నోటీసులు

Guntur Police: వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. పిలిచినప్పుడు విచారణకు రావాలని 41ఏ నోటీసులు పోలీసులు ఇచ్చారు.

Election code violation case On Jagan:  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.  ఫిబ్రవరి 19, 2025న గుంటూరు మిర్చియార్డులో జగన్ పర్యటించారు. అయితే ఆ పర్యటనకు అనుమతి తీసుకోలేదు. అప్పట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినప్పటికీ ఈ పర్యటనకు అనుమతి తీసుకోకుండా.. పర్యటించారు. దీంతో  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలపై నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ పర్యటనలో అనుమతి లేకుండా వైసీపీ నేతలు హంగామా సృష్టించారని, నిబంధనలకు విరుద్ధంగా పర్యటన జరిగిందని పోలీసులు తెలిపారు.  

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టని వైసీపీ               

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. అయినప్పటికీ  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో జగన్ మిర్చి రైతులను పరామర్శించేందుకు యార్డుకు వచ్చారని, అనుమతి లేకుండా ఈ పర్యటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.  జగన్‌తో పాటు వైసీపీ నేతలు కావటి మనోహర్, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వెంకటరమణ, కొడాలి నాని, అంబటి రాంబాబు, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై కేసు నమోదైంది. నల్లపాడు పోలీసులు పై నేతలందరికీ నోటీసులు జారీ చేశారు. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని సూచించారు.

వైసీపీ ఎన్నికల్లో పాల్గొనకపోయినా, మైక్‌లు వాడకపోయినా కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు అప్పట్లో ఆరోపించారు. ఎన్నికల్లో పోటీతో సంబంధం లేకుండా.. రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తే అనుమతి తీసుకోవాల్సి ఉంటుదని పోలీసులు చెబుతున్నారు.   

అభ్యర్థిని నిలబెట్టలేదు కాబట్టి కోడ్ వర్తించదని వైసీపీ నేతల వాదన              

జగన్ మిర్చియార్డు పర్యటనకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు.  పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. మిర్చియార్డులో రైతులను పరామర్శించే సమయంలో జగన్ కూడా ఇబ్బంది పడ్డారు.మిర్చికోరు వల్ల మాట్లాడలేకపోయారు. తాను కేవలం రైతుల్ని పరామర్శించానని.. మైక్ తో మాట్లాడలేదని కేవలం వ్యక్తిగత పర్యటనే అని.. దీనికి పోలీసు అనుమతి అవసరం లేదని వైసీపీ నేతలు వాదించారు. కానీ పెద్ద ర్యాలీ నిర్వహించడంతో.. పోలీసులు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని చెప్పి కేసులు పెట్టారు.                  

ఇక నిబంధనలు అతిక్రమించిన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోనున్న పోలీసులు                  

అప్పట్లో కేసులు పెట్టి సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఇటీవలి కాలంలో వైఎస్ జగన్.. పదే పదే  పోలీసులకు ఇచ్చిన అనుమతుల్ని ఉల్లంఘిస్తూ పర్యటనలు చేస్తున్నారు. ఫలితంగా మరణాలుకూడా సంభవిస్తున్నాయి. మళ్లీ ఆయన ప్రభుత్వాన్నే నిందిస్తున్నారు. అందుకే నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. పాత కేసుల విషయంలోనూ అలాగే చర్యలు ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బోడుప్పల్‌లో భూపోరాటానికి సిద్ధమైన TRS చీఫ్ కవిత అరెస్ట్! 
బోడుప్పల్‌లో భూపోరాటానికి సిద్ధమైన TRS చీఫ్ కవిత అరెస్ట్! 
Prasna Ravan Bail and Arrest: అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Gujarat High Court Hindu Marriage: ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Meher Ramesh Daughter Wedding: మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరు, వెంకీ అండ్ పవన్... ఘనంగా వివాహ వేడుక
మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరు, వెంకీ అండ్ పవన్... ఘనంగా వివాహ వేడుక
Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
Embed widget