అన్వేషించండి

Pawan Kalyan: మంచి ప్రభుత్వమే కానీ మెతక కాదు - మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం - పవన్ కల్యాణ్ హెచ్చరిక

Janasena: కూటమి ఐక్యత కొనసాగుతుందని మరో పదిహేను,ఇరవై ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan :  కూటమి  ఐక్యత చెడకొట్టే పరిస్థితి లో నేను లేను.. 15 నుంచి 20 ఏళ్ళు ఉండే కూటమి ఇది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కూటమి పాలన ఏడాది అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు విధ్వంస పాలన సాగిందని గుర్తు చేశారు. 2014 నుంచి అభివృద్ధి కోరుకుంటున్నామన్నారు.  కష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని  ఏడాది కాలంలో బ్రాండ్‌ ఏపీ పునరుద్ధరణ జరిగిందని డిప్యుటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో 20 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు జరిగాయన్నారు.

వైసీపీ హయాంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని ..ఆ ప్రభుత్వం వస్తే ఏంటి అని కొంత మంది అనుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మరో పదిహేను..ఇరవై ఏళ్లు ఉంటుందని..ఈ ఐక్యతను తాను చెడగొట్టే పరిస్థితుల్లో లేననని స్పష్టం చేశారు. అసాంఘిక చర్యలను ఏమాత్రం సహించమని హెచ్చరించారు.  గొంతులు కోస్తాం అనే నినాదాలకు భయపడేవారెవరూ లేరని హెచ్చరించారు.   పనికిమాలిన బెదిరింపులు చేయకండి.. సంస్కారం ఉంది కాబట్టే పద్ధతిగా మాట్లాడుతున్నామని  ... అధికారంలో లేకున్నా గత పాలకుల నియంత పోకడలు మారలేదు.. పోలీసులను వెంటాడుతాం అనే స్టేట్‌మెంట్లు ఇబ్బందిగా ఉన్నాయని..గొంతులు కోస్తాం.. కుత్తుకలు కోస్తాం అంటే ఊరుకునేది లేదన్నారు. 

2019 నుంచి 2024 వరకు YSRCP పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని, శాంతిభద్రతలు క్షీణించాయని పవన్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి శూన్యమైందని, ఐదేళ్లలో రాష్ట్రానికి అభివృద్ధి అనవసరంగా దూరమైందని తెలిపారు.  YSRCP పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ వెలుగు వస్తుందా అని అనుమానించినట్లు, కానీ కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందని పేర్కొన్నారు   తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నానని, దీని వల్ల ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారుల్లో కూడా నమ్మకం పెరిగిందని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, శాస్త్ర, అటవీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నివేదిక రూపంలో ప్రజలకు అందించామని తెలిపారు.   

వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు, రావట్లేదు.గొంతులు కొసేస్తాం అని పిచ్చి బెదిరింపులు చేస్తే మక్కెలు విరగ్గొట్టి కింద కూర్చోబెడతాం.అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నేను కూడా సినిమాల్లో నుండి వచ్చిన వాడినేనని గుర్తు చేశారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు ఇక్కడ సరదాగా ఎవరూ లేరన్నారు. చాలా దెబ్బలు తిని ఇక్కడికి వచ్చాం.. రాజ్యాంగబద్ధంగా ఉన్నాం.. ఉంటామన్నారు.కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం.. మెతక ప్రభుత్వం కాదు.. పిచ్చి వేషాలు వేస్తే నార తీస్తాం.. గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.

 

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget