అన్వేషించండి

AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌ టెట్ దరఖాస్తుల్లో తప్పులు చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. 'వన్ టైమ్ డిలీట్' ఆప్షన్ ద్వారా తప్పులను సరిదిద్దుకుని, కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీ టెట్ దరఖాస్తులో తప్పుల సవరణకు వన్-టైమ్ డిలీట్ అవకాశం.
  • అభ్యర్థులు పాత దరఖాస్తు తొలగించి, సరైన వివరాలతో తిరిగి సమర్పించవచ్చు.
  • ఈ అవకాశం జూలై 2 నుండి 5 తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • ఆధార్, మొబైల్ మినహా మిగిలిన వివరాలు ఉచితంగా మార్చుకోవచ్చు.

AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక ఊరటనిచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు పొరపాటున నమోదు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం ఒక అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఏవైనా పొరపాటులు గుర్తిస్తే వాటిని సవరించుకోడానికి గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ వన్‌టైమ్ డిలీట్ అనే సరికొత్త ఫీచ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ దరఖాస్తు ఫామ‌లో పేరు, విద్యార్హతలు, లేదా ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసేటప్పుడు కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. ఇటువంటి తప్పులు వల్ల భవిష్యత్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఇప్పటికే సమర్పించిన దరఖాస్తును పూర్తిగా డిలీట్ చేసి, సరైన వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు టెట్ కన్వీనర్‌ వెంకట్‌ కృష్ణారెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

ఈ సవరణ ప్రక్రియ నిరంతరం అందుబాటులో ఉండదు. కేవలం పరిమిత కాలం మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇవాళ్టి (జులై 2) నుంచి ఐదో తేదీ వరకు మాత్రమే అభ్యర్థులు ఈ వన్‌ టైమ్‌ డిలీట్‌ ఆప్షన్‌ు వినియోగించుకోవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. 

అభ్యర్థుల అధికారిక టెట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ లాగిన్ వివరాలతో ప్రవేశించాలి. అక్కడ వన్‌టైమ్ డిలీట్‌ అనే ఐచ్చికాన్ని ఎంచుకోవాలి. దీని వల్ల పాత దరఖాస్తు వ్యవస్థ నుంచి డిలీట్ అవుతుంది. ఆ తర్వాత అభ్యర్థులు తాజా వివరాలతో ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తు తిరిగి సబ్‌మిట్ చేయాలి. 

ఈ సవరణ ప్రక్రియలో కొన్ని పరిమితులు ఉన్నాయి. దరఖాస్తులో ఆధార్‌ నంబర్‌, మొబై్‌ నంబర్ మినహా మిగిలిన అన్ని అంశాలను(పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, జిల్లా) మార్చుకోవడానికి వీలు ఉంటుంది. ఈ వన్ టైమ్ డిలీట్, తిరిగి దరఖాస్తు చేసుకునే ప్రక్రియకు ప్రభుత్వం ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు.అభ్యర్థులు ఉచితంగానే ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు.  

Frequently Asked Questions

టెట్ దరఖాస్తుదారులు పొరపాట్లను సరిదిద్దుకోవడానికి కొత్తగా వచ్చిన అవకాశం ఏమిటి?

దరఖాస్తులో తప్పులు చేసిన అభ్యర్థుల కోసం

ఈ

అభ్యర్థులు జులై 2వ తేదీ నుండి జులై 5వ తేదీ వరకు మాత్రమే ఈ వన్‌టైమ్ డిలీట్ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదు.

వన్‌టైమ్ డిలీట్ ద్వారా దరఖాస్తులో ఏ వివరాలను మార్చుకోవచ్చు?

ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మినహా మిగిలిన అన్ని వివరాలు (పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, జిల్లా) మార్చుకోవడానికి వీలు ఉంటుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేటప్పుడు సరైన వివరాలను నమోదు చేయవచ్చు.

దరఖాస్తు సవరణ ప్రక్రియకు ఏదైనా రుసుము చెల్లించాలా?

లేదు, ఈ వన్‌టైమ్ డిలీట్ మరియు తిరిగి దరఖాస్తు చేసుకునే ప్రక్రియకు ప్రభుత్వం ఎటువంటి ఫీజు వసూలు చేయడం లేదు. అభ్యర్థులు ఉచితంగా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం
అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం
BPCL Refinery Project: ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. లక్ష కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. లక్ష కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
AP CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినీ హీరో, ఆ టీడీపీ నేత పొలిటికల్ హీరో: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
బుర్రిపాలెంలో కృష్ణ సినీ హీరో, ఆ టీడీపీ నేత పొలిటికల్ హీరో: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Somnath Swabhiman Parv Special Train: విజయవాడ నుంచి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ప్రత్యేక రైలు యాత్ర ప్రారంభం, ఏపీ నుంచి 1060 మంది భక్తులు
విజయవాడ నుంచి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ప్రత్యేక రైలు యాత్ర ప్రారంభం, ఏపీ నుంచి 1060 మంది

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget