News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TDP MP Kanakamedala: ప్రతిపక్షనేతగా చంద్రబాబు సెట్ అవ్వరు - వైసీపీ ఎంపీలకు కనకమేడల చురకలు

TDP MP Kanakamedala: ప్రతిపక్షనేతగా జగనే ఉండాలంటూ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తనదైనశైలిలో తిప్పికొట్టారు.

FOLLOW US: 
Share:

YSRCP leaders Comments are Correcte, YS Jagan should fit for of the Opposition TDP MP Kanakamedala: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉండడం మన దౌర్భాగ్యమంటూ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తనదైనశైలిలో తిప్పికొట్టారు. వైసీపీ నేతలు చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉందని, ఏపీకి ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండడమే ఏపీకి మంచిదని అన్నారు. ఏపీ సీఎంగా జగన్ ఉండటం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని, కానీ అధికార పార్టీ మాత్రం ప్రతిపక్ష టీడీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కనకమేడల ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీతో భేటీపై ప్రశ్నిస్తే తిట్ల పురాణమా? 
వైఎస్ జగన్ రాష్ట్రానికి సీఎం అంటే ప్రతినిధి అని.. అందువల్ల ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి (AP CM YS Jagan Meets PM Modi) ఏం చర్చించారని అడిగే హక్కు రాష్ట్రంలో ఎవరికైనా ఉంటుందన్నారు. కానీ ప్రధానితో భేటీలో ఏం చర్చించారని టీడీపీ నేతలు అడగటంతో చంద్రబాబుపై, తమ పార్టీ శ్రేణులపై వైఎస్సార్ సీపీ నేతలు విషం చిమ్ముతారని చెప్పారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తే తిట్ల పురాణంతో వైఎస్సార్‌సీపీ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ‘కాగ్’ అందించిన నివేదికలో ఉన్న విషయాన్నే టీడీపీ నేతలు ప్రస్తావించారని గుర్తుచేవారు. ఒకవేళ కాగ్ చెప్పింది అబ్ధమయితే పార్లమెంట్ ఉభయసభలలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదో చెప్పాలని ఎంపీ కనకమేడల ప్రశ్నించారు. 

చంద్రబాబుకు ఆల్జీమర్స్: ఎంపీ విజయ సాయిరెడ్డి
విశాఖ మధురవాడ ఐటీ సెజ్ ఎన్‌సీసీ భూముల విషయంలో తనపై అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ, పలువురి టీడీపీ నేతలు మూడు మీడియా సంస్థలపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీఎం పాలెం పోలీసు స్టేషన్ కు వచ్చిన ఆయన స్వయంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ విజయసాయి రెడ్డి... చంద్రబాబు హయాంలోనే NCC భూముల లావాదేవీలు జరిగాయన్నారు. చంద్రబాబు తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు పెట్టి నిజాలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు తీసుకుని  ఎన్.సి.సి కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబే అని విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు ఆల్జీమర్స్ తో బాధపడుతున్నారని అందుకే పాత విషయాలు మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. 
Also Read: Volunteers In Nellore: రాష్ట్రమంతా వాలంటీర్లకు అవార్డులు, ప్రశంసలు - నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్

Also Read: Why Jagan Looses Cool : ఢిల్లీ వెళ్ళాక ఏం జరిగింది ? ముఖ్యమంత్రి మాటల వెనుక మర్మం ఏంటి ?

Published at : 09 Apr 2022 11:54 AM (IST) Tags: YS Jagan YSRCP tdp Chandrababu Kanakamedala Ravindra Kumar

ఇవి కూడా చూడండి

Tirumala Brahmotsavam: తిరుమలలో వైభవంగా చక్రస్నానం - పుష్కరిణిలో భక్తుల పుణ్యస్నానాలు

Tirumala Brahmotsavam: తిరుమలలో వైభవంగా చక్రస్నానం - పుష్కరిణిలో భక్తుల పుణ్యస్నానాలు

Nara Lokesh: నారా లోకేశ్‌కు సీఐడీ షాక్! ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ-14 గా లోకేశ్ పేరు

Nara Lokesh: నారా లోకేశ్‌కు సీఐడీ షాక్! ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ-14 గా లోకేశ్ పేరు

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!

Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!

Ap Assembly Session: నాలుగో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్

Ap Assembly Session: నాలుగో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్

టాప్ స్టోరీస్

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?

Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?