అన్వేషించండి

Chilukaluripet YSRCP : చిలుకలూరిపేట వైఎస్ఆర్‌సీపీలో ముసలం - తొలగించిన ఇంచార్జ్ అనుచరుల భారీ ఆందోళన

Andhra News : చిలుకలూరిపేట వైఎస్ఆర్‌సీపీ నేత మల్లెల రాజేష్ అనుచరులు ఆందోళనకు దిగారు. టిక్కెట్‌ను స్తానికులకే కేటాయించాలని డిమాండ్ చేశారు.

YSRCP leader Mallela Rajesh in Chilukaluripet started agitation : చిలకలూరిపేట వైసీపీలో దుమారం రేగింది.  అభ్యర్థి రాజేష్ నాయుడు ను  మార్చి కావటి మనోహన్ నాయుడుకి వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం ఇవ్వడంతో రాజేష్ నాయుడు అనుచరులు  చిలకలూరిపేటలో రాలీ చేశారు. ఈ సమయంలో ఉద్రిక్తత  చోటుచేసుకుంది. ర్యాలీని నిలిపివేయాలని కోరుతూ పోలీసులు తెలపడంతో పోలీసులు పోలీసులకు కార్యకర్తలకు తోపులాట జరిగింది.

ఇంచార్జ్‌గా మల్లెల రాజేష్ తొలగింపు                                          

నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పులో భాగంగా చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజనినీ గుంటూరు పశ్చిమకు మార్చారు జగన్. చిలకలూరిపేటలో జరిపిన సర్వేలలో రజనీకి  వ్యతిరేకత వ్యక్తమైందని .. ఆమెను గుంటూరు పశ్చిమ వైసీపీ ఇంఛార్జిగా జగన్ నియమించారు. రజని స్థానంలో మల్లెల రాజేష్ నాయుడును చిలకలూరిపేట ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు ఆయనను కూడా మార్చారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడును ఇంచార్జు గా నియమిస్తూ.. మంగళవారం రాత్రి ప్రకటన చేసారు.  ఈ క్రమంలోనే మల్లెల రాజేష్ నాయుడు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 

మంత్రి రజనీ ఆరున్నర కోట్లు తీసుకుందన్న మల్లెల !                                               

కార్యకర్తలతో జరిగిన  సమావేశంలోనే విడదల రజనీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిందని ఆరోపించారు. " మంత్రి విడదల రజని నా దగ్గర రూ.6.5కోట్లు తీసుకున్నారు. ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే, ఆయన రజనితో రూ.3 కోట్లు మాత్రమే వెనక్కి ఇప్పించారు. మిగతా డబ్బు ఇవ్వకుండా మోసం చేశారు. చిలకలూరిపేట టికెట్ మర్రి రాజశేఖర్‌కు ఇస్తే మరో రూ.20 కోట్లు ఖర్చుపెడతా. బయటవారికి ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రజనికి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేసి గెలవాలి" అని కార్యకర్తల సమావేశంలో మల్లెల రాజేష్ నాయుడు ఛాలెంజ్ చేశారు.

వైసీపీలో పలు చోట్ల పెరుగుతున్న అసంతృప్తులు                         

టికెట్ తమకు రాదనే సంగతి తెలిశాక తమ అసంతృప్తిని పలురకాలుగా వెళ్లగక్కుతున్నారు. కొంతమంది అధిష్ఠానంపై తమ అసంతృప్తిని నేరుగా వెళ్లగక్కుతుండగా.. మరికొందరేమో సైలెంట్‌గా పక్కపార్టీల్లోకి వెళ్లడానికి రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇంకొందరు అయితే పార్టీ మీద, పార్టీ నేతల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తల్ని పదే పదే మారుస్తూండటంతో.. పలు చోట్ల నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. మల్లెల రాజేష్ నాయుడు.. గుంటూరు నుంచే కావటి మనోహర్ నాయుడుకు సహకరించబోనని ప్రకటనలు చేస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!కేటీఆర్ ఇంటి ముందు రాత్రంతా బీఆర్ఎస్ నేతలుపట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Viral Video: 'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Embed widget