అన్వేషించండి

YSRCP Amaravathi: రాజధాని విషయంలో తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ - ఓ విధానం లేకుండా ప్రజలకేం చెబుతారు?

Capital issue: రాజధాని విషయంలో వైఎస్ఆర్‌సీపీకి ఓ పాలసీ లేకుండా పోయింది. అమరావతికి మద్దతు లేదా..తమది మూడు రాజధానుల పాలసీ అనో ఏదో ఒకటి చెప్పాల్సింది .. చెప్పడం లేదు.

YSRCP lacks policy on capital issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ గందరగోళానికి గురవుతోంది. పార్లమెంట్ లో చట్టం చేయబోతున్న దశలో ఆ పార్టీ అనుకూలమో.. వ్యతిరేకమో ఓ ప్రకటన చేయలేకపోతోంది. ఆ పార్టీ రాయలసీమ నేతలు, ఉత్తరాంద్ర నేతలు మాత్రం అమరావతి రాజధాని అంటే తమ ప్రాంతానికి అన్యాయం చేయడమేనని ప్రకటనలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ అమరావతికి వ్యతిరేకం కాదంటారు కానీ.. అనుకూలం అని మాత్రంమ చెప్పరు. ఇది వైసీపీ అధికారిక పాలసీనో కాదో తెలియదు కానీ ఈ అంశంపై ఇలా భిన్నమైన మాటలు మాట్లాడటం మాత్రం ఆ పార్టీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది

అమరావతికి వ్యతిరేకం కాదు..కానీ అనుకూలం కూడా కాదు!  
 
పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల   జగన్ మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదని, కేవలం అక్కడ జరిగిన అవినీతిని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే, ఇదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వైసీపీ నేతలు మాత్రం భిన్నమైన గళం వినిపిస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేయడం తమ ప్రాంతాలకు అన్యాయం చేయడమేనని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా సాగుతున్న ఈ భిన్న స్వరాలు పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతున్నాయా? లేక పార్టీలో నియంత్రణ లోపించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీది అధికారంగా మూడు రాజధానుల పాలసీ - కానీ ఇప్పుడు సైలెంట్ !

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ  మూడు రాజధానుల  మంత్రాన్ని జపించి, అభివృద్ధిని గాలికి వదిలేసిందన్న విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, గతంలో తాము చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. సజ్జల వంటి నేతలు అమరావతికి వ్యతిరేకం కాదంటూనే, మరోవైపు కేంద్రాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించేలా మాట్లాడకపోవడం ఒక రకమైన  అటూ ఇటూ కాని పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఈ గందరగోళం ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని తగ్గించడమే కాకుండా, పార్టీ విధానపరమైన అస్పష్టతను వేలెత్తి చూపుతోంది.

పార్లమెంట్‌లో అయినా తమ వాదన వినిపిస్తారా?

పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఎంపీలు ఏ స్టాండ్ తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బిల్లును వ్యతిరేకిస్తే  అమరావతి ద్రోహి' గా ముద్ర పడుతుందన్న భయం, అనుకూలిస్తే గత ఐదేళ్ల తమ వాదన తప్పని ఒప్పుకున్నట్లు అవుతుందన్న సంకోచం ఆ పార్టీని పీడిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తే, ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత జగన్ మోహన్ రెడ్డిపై ఉంది. లేనిపక్షంలో, ఈ ద్వంద్వ వైఖరి వైసీపీని ప్రజలకు మరింత దూరం చేసే ప్రమాదం ఉంది. 

ప్రజలు ఆశించేది ఒక్కటే.. రాజధాని విషయంలో రాజకీయ ముసుగులు తీసివేసి, వైసీపీ తన అధికారిక పాలసీని ధైర్యంగా ప్రకటించాలి. పార్లమెంట్ సాక్షిగా ఆ పార్టీ ఇచ్చే వివరణే ఆ పార్టీ భవిష్యత్తు రాజకీయ గమనాన్ని నిర్దేశించనుంది. అస్పష్టమైన మాటలతో కాలం వెళ్లదీయడం కంటే, ప్రజలకు క్లారిటీ ఇవ్వడమే సరైన రాజకీయ వ్యూహం అవుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం
అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం
Jal Jeevan Mission 2.0: కడపలో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 3.27 కోట్ల మందికి ప్రయోజనం
కడపలో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 3.27 కోట్ల మందికి ప్రయోజనం
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget