అన్వేషించండి

AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం

Handloom weavers: నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది.

Free electricity for handloom weavers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది నేతన్నలకు  చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని  నెరవేరుస్తూ,  ఏప్రిల్ 1, 2026  నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయం ద్వారా మగ్గాలకు  నెలకు 200 యూనిట్లు , మరమగ్గాలకు  నెలకు  500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత , జౌళి శాఖ మంత్రి సవిత అధికారిక ప్రకటన విడుదల చేశారు.                      

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,04,488 కుటుంబాలు  నేరుగా లబ్ధి పొందనున్నాయి. ఇందులో 93,000 చేనేత మగ్గాలున్న కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి. ఈ రాయితీ వల్ల ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ.8,640 , అలాగే పవర్ లూమ్ యూనిట్లకు రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వం ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.150 కోట్లు  వెచ్చించనుంది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ భారంతో సతమతమైన నేతన్నలకు ఈ నిర్ణయం ఒక గొప్ప ఊరటగా మారింది.
 
కేవలం విద్యుత్ రాయితీకే పరిమితం కాకుండా, చేనేత రంగాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3,000 నుండి  రూ. 4,000లకు  పెంచింది. కొత్త యంత్రాల కొనుగోలుపై  90 శాతం రాయితీ అందిస్తోంది.  నూలు, రసాయనాలపై 15 శాతం  రాయితీ ఇస్తూ, నాణ్యమైన ముడిసరుకును సరఫరా చేస్తోంది. చేనేత కార్మికులను యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పరిధిలోకి తెచ్చి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించింది.                                              
 
నేతన్నలు తయారు చేసిన వస్త్రాలకు సరైన ధర కల్పించేందుకు ప్రభుత్వం సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా తనేరా, బిర్లా ఆదిత్య వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా నేరుగా వినియోగదారులకే అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంది. విశాఖపట్నంలో 172 కోట్లతో యూనిటీ మాల్  ఏర్పాటుతో పాటు మంగళగిరి, ఎమ్మిగనూరు, ధర్మవరం వంటి ప్రాంతాల్లో టెక్స్‌టైల్ పార్కులు,  మెగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొస్తోంది.                                  
 
ఎన్నికల హామీని ఇంత త్వరగా అమలు చేస్తూ, విద్యుత్ కష్టాల నుంచి విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి సవితకు చేనేత సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ఈ పథకం కేవలం రాయితీ మాత్రమే కాదని, చేనేత కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక గొప్ప సామాజిక భద్రతా కవచమని రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.          

టాప్ హెడ్ లైన్స్

Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం..
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget