అన్వేషించండి

India Census 2027: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే

Digital Census 2027 in India | భారత్‌లో జనగణన ప్రక్రియ బుధవారం (ఏప్రిల్ 1న) ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనగణన షెడ్యూల్ వివరాలను అధికారులు ప్రకటించారు.

India Census 2027 | న్యూఢిల్లీ: భారత చరిత్రలో మైలురాయిగా నిలిచే 16వ జనగణన (స్వతంత్ర భారతంలో 8వది) ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జనగణన ప్రక్రియ 2 దశల్లో జరుగుతుందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తొలి దశ అయిన గృహగణన (Houselisting) ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభం కానుంది. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ రూపంలో జరగనుండటం విశేషం. పౌరులు అందించే వ్యక్తిగత డేటా అత్యంత గోప్యంగా ఉంటుందని, దీనిని ఆర్టీఐ పరిధిలోకి రానీయకుండా, న్యాయస్థానాల్లో సాక్ష్యంగా వాడకుండా చట్టపరమైన రక్షణ కల్పించారు.

33 ప్రశ్నలతో గృహగణన.. ఏపీ, తెలంగాణ షెడ్యూల్ ఇదే!

తొలిదశలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు గృహగణన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో మొత్తం 33 ప్రశ్నల ద్వారా ప్రజల నివాస స్థితిగతులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వారి చరాస్తుల వివరాలను సేకరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఏపీలో ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు వివనాలు మనమే సొంతంగా నమోదు చేసుకోవాలి.  మే 1 నుంచి 30 వరకు నెన్సన్ ఎన్యూమరేటర్ ద్వారా ప్రక్రియ జరుగుతుంది. తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయవచ్చు. ఆపై  మే 11 నుంచి జూన్ 9 వరకు అధికారులు ప్రక్రియ చేపడతారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు సేకరించడమే కాకుండా, ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

సెల్ఫ్ ఎన్యూమరేషన్.. మీ వివరాలు మీరే నమోదు చేసుకోవచ్చు

పౌరులు తమ వివరాలను https://se.census.gov.in వెబ్‌సైట్‌లో లేదా మొబైల్ యాప్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఇంటి యజమాని పేరు, మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ పొంది లాగిన్ అవ్వాలి. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత 'H' అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ఐడీ జనరేట్ అవుతుంది. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని వారికి చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే ఆ సమయంలోనే సరిచేసుకోవచ్చు. అయితే, ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ఎన్‌ఆర్‌ఐ (NRI)లకు వర్తించదు.

కీలక నిర్ణయాలు, మినహాయింపులు

తొలిదశలో కులగణన ఉండదని, కేవలం రెండో దశలో మాత్రమే కులం, మతం వివరాలు సేకరిస్తారని స్పష్టం చేశారు. అలాగే, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) అప్‌డేషన్‌ను ప్రస్తుతానికి చేపట్టడం లేదు. జనగణన వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి కోతలు ఉండవని అధికారులు హామీ ఇచ్చారు. సామాజిక మార్పులకు అనుగుణంగా, స్థిరమైన బంధంలో ఉన్న సహజీవన జంటలను కూడా వివాహిత జంటగా పరిగణించి వివరాలు నమోదు చేయనున్నారు. ఇంటర్నెట్, వాహనాలు, గృహోపకరణాల వాడకం వంటి అంశాలను కూడా ఈ ప్రశ్నావళిలో చేర్చారు.

సహజీవన జంటలకు కుటుంబ గుర్తింపు.. 
 జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, చాలా కాలం నుండి సహజీవనం (Live in Relationship) చేస్తున్న జంటలను ఇకపై ఒకే యూనిట్‌గా గుర్తించి, వారికి 'కుటుంబ హోదా' కల్పించాలని నిర్ణయించింది. స్థిరమైన బంధంలో ఉంటూ కలిసి జీవిస్తున్న వారిని ఒకే ఫ్యామిలీగా పరిగణించి జనగణన రికార్డుల్లో నమోదు చేయనున్నారు. ఆధునిక సంబంధాలకు అధికారిక గుర్తింపునిచ్చే దిశగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

2011 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న ఈ ప్రక్రియలో డేటా సేకరణ కోసం అత్యాధునిక మొబైల్ యాప్‌లను వినియోగిస్తున్నారు. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా నిర్వహించలేదు. పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే (Self-enumeration) సౌకర్యాన్ని కూడా ఈసారి అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget