YSRCP : మాజీలయ్యే బీసీ మంత్రుల చైతన్య యాత్ర - రూట్ మ్యాప్ ఖరారు చేసిన సజ్జల !

మంత్రి పదవులకు రాజీనామా చేయబోతున్న బీసీ నేతలతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ చైతన్య యాత్ర నిర్వహింప చేయాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయించింది. సజ్జలతో జరిగిన సమావేశంలో రూట్ మ్యాప్ ఖరారు చేశారు.

FOLLOW US: 

మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత బీసీ మాజీ మంత్రులంతా ఏం చేయాలో వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ( YSRCP High Commend ) దిశానిర్దేశం చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో బీసీ మంత్రులు సమావేశం నిర్వహించారు.  రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య పర్యటనలు, సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ( CM Jagan ) ఆదేశాల మేరకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. బీసీలకు  సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) ఇచ్చిన హామీలు, జరిగిన మేళ్లను  బీసీ మంత్రులమంతా కలసి చర్చించామని మంత్రులు తెలిపారు.  139 బీసీ కులాలు  ఉంటే  56 కార్పోరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసిందన్నారు. బీసీల ఆత్మగౌరవం కోసం తీసుకున్న చర్యలను వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు చేపట్టాలని నిర్ణయించామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రకటించారు. 

లబ్ది పొంది టీటీడీలో సభ్యులుగా నియమించారా ? ప్రభుత్వంపై హైకోర్టు అసహనం !

బీసీల  ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని .. తొలుత అన్ని కొత్త జిల్లాల్లో బీసీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు.  అనంతరం రాష్ట్ర స్థాయిలో బీసీ  సదస్సు  నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ.  31వేల కోట్ల రూపాయలను బీసీ సబ్ ప్లాన్   ( BC Sub Plan ) కోసం ప్రభుత్వం కేటాయించిందని  .. బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారనే  విషయాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళతామని వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి  ( MLC Janga ) సహా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ  నేతలు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. 

శాశ్వత భూసర్వేపై సీఎం రివ్యూ, లంచాలకు వీల్లేకుండా జరగాలని జగన్ ఆదేశాలు - ఈ స్కీమ్ ఎలా చేస్తారంటే

ఏప్రిల్ నెల 15 తర్వాత నెల పాటు పర్యటనలు చేయాలని నిర్ణయించామని.. బీసీల సమస్యలను గుర్తించి నెరవేర్చేలా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తామన్నారు.  తెలుగుదేశం ( TDP )  గత పాలనలో  విద్యుత్ చార్జీలు  పెంచారని ఇప్పుడు స్వల్పంగా పెంచితే  ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసివేశారని మంత్రులు గుర్తు చేశారు. గతంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసింది తెలుగుదేశం పార్టీనేనన్నారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే  టీడీపీ లక్ష్యమని..ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ..ఆదుకుంటుందో అనే విషయం  ప్రజలకు వాస్తవాలు తెలుసని వేణుగోపాల కృష్ణ తెలిపారు.  

Published at : 31 Mar 2022 06:23 PM (IST) Tags: YSRCP YSRCP politics BC Ministers BC Former Ministers BC Chaitanya Yatra

సంబంధిత కథనాలు

Bharat Bandh : సీపీఎస్‌ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్

Bharat Bandh : సీపీఎస్‌ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్

Konaseema Curfew : బుధవవారం నుంచి కోనసీమలో కర్ఫ్యూ - కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు

Konaseema Curfew :  బుధవవారం నుంచి కోనసీమలో కర్ఫ్యూ - కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు

Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త

Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త

Anantapur TDP Kalva : ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !

Anantapur TDP Kalva :  ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్