By: ABP Desam | Updated at : 31 Mar 2022 05:21 PM (IST)
టీటీడీలో నేర చరితులపై హైకోర్టు ఆగ్రహం
తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD Board ) బోర్డులో నేరచరితుల్ని నియమించడంపై హైకోర్టు ( High Court ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరచరితుల్ని ఎలా నియమిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నాయని భావిస్తున్నామని కోర్టు పేర్కొంది. కనీసం కొంత మందినైనా తొలగించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. టీటీడీ భవనం కలెక్టరేట్ అవసరాలకు వాడుకుంటే విధానపరమైన నిర్ణయం కాబట్టే సమర్థించామని పేర్కొంది. కానీ నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండకూడదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 19న వాదనలు వింటామని అదే రోజు నిర్ణయం తీసుకుంటామిన హైకోర్టు పేర్కొంది.
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, నేటి నుంచి ఆర్జిత సేవ, అంగ ప్రదక్షిణ టికెట్లు అందుబాటులోకి!
నేర చరితులకు ( Criminals ) టీటీడీలో పదవులపై ( TTD Board Members ) హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి పిటిషన్ వేశారు. అయితే విచారణ ముందుకు సాగడం లేదు. వివిధ కారణాలతో ప్రభుత్వం తరపు లాయర్ వాయిదా కోరుతున్నారు. దీంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపులు ఉండబోవని హైకోర్టు తెలిపింది. భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన టీటీడీ బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్తులు, కళంకితులు చేరారన్న విమర్శలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన టీటీడీకి ముందెన్నడూ లేని విధంగా 81 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేశారు.అయితే వారిలో యాభై మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ( Special Invitees ) నియమించారు. వారి నియామకాన్ని కోర్టు కొట్టి వేసినా ప్రభుత్వం ఇటీవల చట్టం తీసుకు వచ్చింది.
శ్రీశైలంలో కన్నడ భక్తుల వీరంగం, తాత్కాలిక షాపులకు నిప్పు పెట్టిన యువకులు
ధర్మకర్తల మండలి ఏర్పాటులో భక్తుల మనోభావాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి మనోభావాలను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆచార సాంప్రదాయాలతో పాటు, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న సలహాలు, సూచనలు ప్రభుత్వానికి వస్తున్నాయి. తిరుమల ప్రతిష్టను కాపాడాలి. తిరుమల తిరుపతి సాంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి ఆలోచనతో ఉందోకానీ నేరచరితుల్నితొలగించడానికి మాత్రం అంగీకరించడం లేదు. జాతీయ స్కాముల్లో చిక్కుకున్న వారు టీటీడీ బోర్డు మెంబర్లు ఉన్నారు. అందుకే వివాదాస్పదమవుతోంది.
Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు
Breaking News Live Updates: నల్గొండలో రథోత్సవంలో అపశ్రుతి, విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు మృతి
Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !
Anam Daughter Meets Lokesh: టీడీపీలోకి ఆనం కుమార్తె.? పోటీ బద్వేల్ నుంచా? ఆత్మకూరు నుంచా?
NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Minister Sabitha Indrareddy అనుచరుల వీరంగం.. అధికారుల అంతు చూస్తామని బెదిరింపులు | ABP Desam
RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్ మియా! హైదరాబాదీ పేస్ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు