అన్వేషించండి

Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా ? ఖరారు చేసిన సీఎం జగన్! ఈయనకి మళ్లీ ఛాన్స్

AP Rajyasabha Candidates: ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు సీట్లకు వచ్చే జూన్ లో ఎన్నిక జరగనుంది.

YSRCP News: వైఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మళ్లీ అవకాశం దక్కనుంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావుకు కూడా  వైఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభకు ఛాన్స్ ఇవ్వనుందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్‌ ప్రభుల పదవీకాలం జూన్‌ 21తో ముగుస్తుంది. దాంతో ఈ నాలుగు సీట్లకు జూన్ లో ఎన్నిక జరగనుంది. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో అభ్యర్థులు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకోనుంది. 

ప్రస్తుతం వైసీపీకి పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి కొనసాగుతున్నారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఈయనకు మరోసారి అవకాశం దక్కనుండగా.. ఒక సీనియర్  న్యాయవాది నిరంజన్ రెడ్డికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని జగన్ ఇవ్వనున్నారని పార్టీలో వినిపిస్తోంది.

Also Read: Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు

క్రిష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతుండగా, ఆయన ఏకంగా మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ కర్నూలు పర్యటన ఉన్న నేపథ్యంలో అది ముగిసే వరకూ వేచి ఉంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈయన టీడీపీ తరపున ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేకుండా, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.

రాజ్యసభ ఎన్నికల కోసం మే 24న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31గా ఈసీ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు చెప్తారు.

Also Read: AP PCC New Chief Kiran : వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Embed widget