YS Viveka murder case: ప్రముఖులను విచారించాలి - సీబీఐ దర్యాప్తు కొనసాగాలి - వివేక్ హత్యకేసులో ఏ2 సునీల్ యాదవ్ కౌంటర్
YS Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగాలని ఏ2 నిందితుడు సునీల్ కౌంటర్ దాఖలు చేశారు. ప్రముఖుల్ని విచారించాల్సి ఉందన్నారు.

YS Vivekananda Reddy murder case A2 accused Sunil: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 2 సునీల్ యాదవ్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తన తండ్రి హత్యకు మరింత లోతైన దర్యాప్తు కోరిన సునీతా రెడ్డి పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతుండగా, ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ తన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశాడు. సునీతా పిటిషన్‌కు పూర్తి మద్దతు తెలిపిన సునీల్, సీబీఐ దర్యాప్తును కొనసాగించాలని, అనేక ప్రముఖులను విచారించాలని డిమాండ్ చేశాడు. కేసులో దాగి ఉన్న రహస్యాలు, కుట్రలు బయటపడాలని పేర్కొన్నాడు. సునీతా పిటిషన్‌కు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు.
వివేకా కూతురు సునీతా రెడ్డి, తండ్రి హత్యకు న్యాయం జరగకపోవడంపై నిరంతరం పోరాడుతున్నారు. 2025లో సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, మరింత లోతైన దర్యాప్తు చేయాలని, కొత్త సాక్ష్యాలు సేకరించాలని కోరారు. సీబీఐ దర్యాప్తు ఎక్కువ కాలం కొనసాగాలని, రాజకీయ కుట్రలు పూర్తిగా బయటపడాలని వాదించారు. కోర్టు నిందితులకు కౌంటర్లు దాఖలు చేయమని ఆదేశించింది. అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ముఖ్య అనుచరుడు శివశంకర్ రెడ్డి వంటి వారంతా సీబీఐ విచారణ కొనసాగించవద్దని కౌంటర్ వేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ) మాజీ ఎంపీ, 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లో భయంకరంగా హత్యకు గురయ్యారు. పోస్ట్‌మార్టం రిపోర్టుల ప్రకారం గొడ్డలితో నరికినట్లుగా గుర్తించారు. ఈ హత్య 2019 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు వారాల ముందు జరిగింది. కేసు మొదట ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారమణ జరిపారు. కానీ కోర్టు సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ దర్యాప్తులో 8 మంది నిందితులు (ఏ1 నుండి ఏ8 వరకు) గుర్తించారు. వీరిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (ఏ8), అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి (ఏ7), దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (ఏ5) మొదలైనవారు ఉన్నారు. ఏ2 సునీల్ యాదవ్ (యడతి సునీల్ కుమార్ యాదవ్) మరియు ఏ1 షేక్ దస్తగిరి (అప్రూవర్‌గా మారాడు) కీలక పాత్రలు పోషించారని సీబీఐ తేల్చింది.
సీబీఐ ప్రకారం, హత్యకు రూ.40 కోట్ల 'సుపారి' ఇచ్చారని తేలింది. 2021లో దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. 2023లో అవినాష్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ లభించింది, కానీ సునీతా సుప్రీంకోర్టులో దాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వేశారు. 2025 సెప్టెంబరులో సుప్రీంకోర్టు కేసు బదిలీ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లమని సూచించింది. ఆప్రూవర్ దస్తగిరికి జైల్లో బెదిరింపులు, ప్రలోభాలు ఇచ్చిన వ్యవహరంపై దర్యాప్తు జరుగుతోంది.





















