అన్వేషించండి

YS Sharmila : ఆస్తుల వివాదంలో అసలేం జరిగిందో చెప్పిన షర్మిల - యలహంక ప్యాలెస్‌ కూడా !

Andhra pradesh: ఆస్తుల వివాదంలో అసలేం జరిగిందో వైఎస్ అభిమానులకు లేఖ రాసిన వైఎస్ షర్మిల అందులో కీలక విషాయలను ప్రస్తావించారు. జగన్ తనకు ఇస్తామన్న ఆస్తులను కూడా ఎగ్గొట్టారని తెలిపారు..

S Sharmila wrote a letter to YS fans about what actually happened in the property dispute : వైఎస్ జగన్‌తో ఉన్న ఆస్తుల వివాదంలో అసలేం జరిగిందో వైఎస్ షర్మిల ఓ లేఖ ద్వారా వైఎస్ అభిమానులుకు తెలిపారు. అందులో అత్యంత కీలకమైన విషయాలు ఉన్నాయి.  
 
ఆస్తులు వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమే !  

అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్  "గార్డియన్ " మాత్రమేనని  ..  అన్నీ వ్యాపారాలు నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు  సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి  భాధ్యత అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం అన్నరు.  వైఎస్ఆర్ ఉద్దేశ్యాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికి,స్పష్టంగా తెలియచేశారని..  కేవీపీ రామచందరరావు  , వైవి సుబ్బారెడ్డి  , విజయసాయి రెడ్డి కి కూడా తెలుసని షర్మిల స్పష్టం చేశారు.  నాన్న బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో, సరస్వతి అయినా...భారతి సిమెంట్స్ అయినా... సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా... నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది వైఎస్ఆర్ మాండేట్. ( ఒక్క సండూరు మినహాయించి ). రాజశేఖర్ రెడ్డి  బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదు. వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా  చేతుల్లో లేదని షర్మిల లేఖలో తెలిపారు. 

జగన్ స్వార్జితం కాదు కుటుంబ ఆస్తులే ! 

స్వార్జితం అని జగన్ మోహన్ రెడ్డి   చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే. రాజశేఖర్ రెడ్డి  బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం.  సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన, అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు..  ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. ఆస్తి పంచడం అంటే .. ఇవిగో ఈ ఆస్తులు నీకు, ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే అని ష్రమిల స్పష్టం చేశారు  
నేను జగన్ మోహన్ రెడ్డి  ఆస్తుల్లో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర్ రెడ్డి నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలి అనుకున్నారు. కాబట్టే..ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం. నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు. వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి  అభిమతం గనుక,ఈ రోజు వరకు కూడా అమ్మైనా, నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్ళను అడిగి ఉంటుంది. వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు.  రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత..10 ఏళ్లు జగన్  ఇబ్బందులు పడితే, అవి నా ఇబ్బందులు అనుకొని..నా శక్తికి మించిన సహాయం చేశాను. తోడబుట్టిన వాడికోసం నా బిడ్డలను సైతం పక్కనపెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్ధం లేకుండా నా భుజాల మీద మోశాను. ఆ 10 ఏళ్లు నా అవసరం ఉంది అనుకున్నారో, ఏమో.. నన్ను బాగానే చూశారు. పెద్ద కూతురు అన్నారు. ఆ 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి  ఊహించినట్లుగానే.. గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానం అన్నట్లుగానే వ్యవహరించారు. ఆ 10 ఏళ్లలో 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానేనని షర్మిల స్పష్టం చేశారు.   ఆ 10 ఏళ్లు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ.. కంపెనీల్లోనీ డివిడెండ్ లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ 200 కోట్లు. వాళ్ళు చేసింది ఉపకారం కాదని షర్మిల స్పష్టం చేశారు.   ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు. నాకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్ లో  సగం వాటా ఇవ్వడం జరిగింది. అది కూడా అప్పుగా చూపించమన్నారని ఆరోపించారు.  

సీఎం అయ్యాక గుర్తు పట్టలేనంతగా మరిాపోయిన జగన్ 

2019లో జగన్ మోహన్ రెడ్  ముఖ్యమంత్రి అయ్యారు. సిఎం అయిన వెంటనే జగన్  గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చిన్నచూపు చూడటమే కాకుండా సిఎం అయిన నెలరోజులకే విడిపోదాం అని ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు. ఇందుకు అమ్మా, నేను వద్దు అని చెప్పాం. లేదు ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టాడు. తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారు. విజయవాడకు వచ్చాక, భారతి సిమెంట్స్, సాక్షిలో నాకు ఎక్కువ వాటా కావాలని అడిగాడు. నేను 60 తీసుకుంటా, నీకు 40 ఇస్తా అని చెప్పాడు. అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదు. సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే .. 5 శాతం ఎక్కువ తీసుకో.. లేదా 10 శాతం ఎక్కువ తీసుకో.. కానీ 20 శాతం ఎక్కువ కావాలని అడగడమంటే అన్యాయం అనిపిస్తుంది అని అమ్మ చెప్పింది. అయినా ఇంతే అని బుల్డోజ్ చేశారు.  తర్వాత అర్ధగంటలో ఈ ఆస్తులు నీకు, ఈ ఆస్తులు నాకు అని తేలిపోయింది. దీని ప్రకారం సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్ లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్ లో 100 శాతం, యలహంక  ప్రాపర్టీలో 100 శాతం,  వైఎస్ఆర్ నివాసమున్న ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి రావడం జరిగింది.ఆ కొద్దీ వారాల్లోనే MOU తయారయ్యింది.

వెంటనె రాసిస్తామన్న ఆస్తులు కూడా రాసివ్వలేదు ! 

అంతకు ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్స్ షేర్స్, యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి... అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం పూర్తి అయిన తర్వాత బదిలీ చేస్తామని, ఒప్పందం జరిగి సంతకాలు పెట్టాం. నా వాటా నాకు ఇస్తున్నాడు తప్పితే ప్రేమ అభిమానాలతో కాదనేది వాస్తవమైనా, జగన్ మోహన్ రెడ్డి ది పైచేయిగా ఉన్నది కాబట్టి.. వాళ్ళు రాసినదానిపై అమ్మ నన్ను సంతకం పెట్టమని కోరింది. కేసుల్లో లేని సరస్వతి, యలహంక ప్రాపర్టీలను, MOU మీద సంతకం పెట్టిన 2019 లోనే ఇవ్వాల్సి ఉండగా.. ఈ రోజు వరకు ఇవ్వాలన్న ఉద్దేశ్యం వాళ్లకు లేదు. అమ్మ గట్టి ఒత్తిడి మేరకు, క్లాసిక్, సండూరు హోల్డ్ చేస్తున్న 52 శాతం సరస్వతి షేర్స్ నీ 2021 లో కొనుక్కోవడానికి అంగీకరించారు. ఇక తర్వాత రోజుల్లో వాళ్ళ ఇండివిడ్యువల్ షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది.  2021లో, నేను రాజకీయాల్లో అడుగుపెట్టడం, మొదట తెలంగాణలో, ఆ తర్వాత కాలంలో ఆంధ్రకు రావడం జరిగింది. తనకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, నన్ను తొక్కడానికి జగన్ మోహన్ రెడ్డి  చెయ్యని ప్రయత్నం లేదు.  మాకు విరోధం వద్దు అంటూనే.. సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక కండీషన్ పెట్టారు. నేను జగన్ మోహన్ రెడ్డి మీద, భారతి రెడ్డి  మీద, అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకంగా పబ్లిక్ ఫ్లాట్ ఫాంలో మాట్లాడకూడదనేది ఆ కండిషన్ సారాంశం. ఆ కండిషన్ నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి నాకు సమ్మతం అనిపించలేదు. బంధువులు ఎంత ఒత్తిడి చేసినా నేను ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోలేదు కాబట్టే సెటిల్ మెంట్ జరగలేదు.  సెటిల్ మెంట్ కి ఒప్పుకోలేదని మళ్ళీ కక్ష్య కట్టి, నా మీద, అమ్మ మీద NCLT లో మేము మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారు. పబ్లిక్ లో గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి ఇప్పుడు వస్తుందని గమనించి.. నా బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారు. నిజానికి బెయిల్ రద్దు అయ్యే సీన్ లేదు. ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ అవ్వలేదు. కంపెనీల్లో ED అటాచ్ చేసింది షేర్లు కాదు. 32 కోట్లు విలువ జేసే భూములు మాత్రమే. షేర్స్ ట్రాన్స్ఫర్ కి, ఆయన బెయిల్ రద్దు కి ఎటువంటి సంబంధం లేదన్నారు.  

ప్రజలు గమనిస్తున్నారు ! 

నిజానికి NCLT లో జగన్ మోహన్ రెడ్డి  వేసిన కేసు అమ్మ మీద కాబట్టి, ఈ విషయం బయటకు వస్తే, YSR కుటుంబం అప్రతిష్టపాలయితే, యావత్ ప్రపంచం నాలుగు రకాలుగా మాట్లాడితే, అమ్మ ఎంతగానో క్షోభపడుతుందని, ఇది మాలో మేమే విషాన్ని గొంతులో దాచుకున్నట్టు దాచుకున్నాము. ఒక కుమారుడు తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితి ఇది. విలువలు, కుటుంబం కోసం పాటుపడే రాజశేఖర రెడ్డి కుమారుడే సొంత తల్లిని కోర్టుకి ఈడ్చడం, ఆ తల్లికి ఎంత అవమానం.? అందుకే స్వర్గంలో క్షోభిస్తున్న నాన్న కోసం, నా పక్కనే నిలబడి మాటల్లేని వేదన నిండిన మా అమ్మను మరింత బాధపెట్టకూడదని, అన్యాయంగా మాపై కేసు వేసిన సంగతి మేము ఎక్కడా బయట పెట్టలేదు. బయట పడకుండా ఉండటానికి ప్రయత్నం చేశాం. కానీ కేసు వేసిన నెల రోజులకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక జగన్ మోహన్ రెడ్డి  కారణం అని ఎందుకు అనుకోకూడదు? దుర్మార్గంగా తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ మోహన్ రెడ్డి కి, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళుగా చిత్రీకరించడంలోనే ప్రయోజనం ఉంది కదా? నేను జగన్ కి ఒక లెటర్ రాస్తే.. అది టీడీపీ హ్యాండిల్ లో పోస్ట్ అయితే… నాకు ఏం సంబంధం? నేనైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా వరకు నేను గాని, నా మనుషులు గాని బయట పెట్టలేదని ప్రమాణం చేయగలం. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం YSR బిడ్డకు లేదు. జగన్ మోహన్ రెడ్డి  ఎవరి కొంగు చాటున ఉండి, ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అమ్మ, నేను మోసం చేస్తున్నామని గాని, లేక ఆస్తికోసం అత్యాశ పడుతున్నామని గాని, YSR అభిమానులు భావించకూడదని.. పైనున్న వాస్తవాలు అన్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుచేస్తున్నా.. MOU నా చేతుల్లో 5 ఏళ్లు ఉన్నా...దాంట్లో నాకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వకపోయినా... ఏ ఒక్క మీడియా కి కానీ, కోర్టుకి కానీ, ఈ MOU నాకు నేనుగా బయటపెట్టలేదు. అవకాశం, అవసరం ఉన్నా...ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా.. కుటుంబ గౌరవం, YSR పరువు కోసం నేను ఎక్కడా 5 ఏళ్ళు MOU బయట పెట్టలేదు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన MOU ఈరోజు బయటకు వచ్చిందన్నా.. పరస్పరం రాసుకున్న లెటర్లు బయటకు వచ్చాయన్నా.. NCLT లో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బ్రతుకు మీద అసహ్యం కలిగించి, YSR అభిమానులను ఎనలేని మానసిక క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు.  కుటుంబ బంధం, స్నేహ బంధంతో మనుషులు ఒక్కటవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో "YSR బంధం" ఏర్పరుచుకున్న ప్రతి YSR బంధువుకి ఈ వివరణ ఇస్తున్నానని షర్మిల తెలిపారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Embed widget