అన్వేషించండి

YS Jagan Mohan Reddy Vizag Visit : వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!

Vizag Steel Plant Accident Compensation YSRCP: ఎస్ జగన్ శాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు

Jagan Demands 1 Crore Ex Gratia: విశాఖపట్నం  స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రత్యక్షంగా పరామర్శించారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన ఆయన.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.

ప్రమాదంపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు.  ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటూ నెపం నెట్టేసి చేతులు దులుపుకోవాలని చూడటం సమంజసం కాదు. ఏ సంస్థలో ప్రమాదం జరిగినా, నష్టపోయింది మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలే అనే మానవతా దృక్పథం ప్రభుత్వానికి ఉండాలి  అని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రమాదాలు జరిగినా గంటల వ్యవధిలోనే స్పందించి రూ. కోటి వరకు ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తుచేశారు.

బాధిత కుటుంబాలకు శాశ్వత ప్రాతిపదికన న్యాయం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున తక్షణమే రూ. కోటి నష్టపరిహారం  చెల్లించాలని స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, ఆయా కుటుంబాల్లోని అర్హులైన ఒక వ్యక్తికి స్టీల్ ప్లాంట్‌లో ,  ప్రభుత్వ పరంగా శాశ్వత ఉద్యోగ అవకాశం కల్పించాలని, వారి పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందించడంతో పాటు, వారు పూర్తిగా కోలుకునే వరకు నెలకు రూ. 50 వేల జీవన భృతి కల్పించాలన్నారు.  

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి మేము కృషి చేశాం .ఆ రోజు 28000 మంది పనిచేస్తుంటే ఈ రోజు 16000 మందే ఉన్నారు. కరెంటు బిల్లులు పెంచేశారు, బోనస్ లు, ఇన్సెంటివ్ లు ఆపేశారని ఆరోపించారు. ఇంత దారుణంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టారు..ఉక్కు కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాలన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది..కూటమి హయాంలో ఎలా ఉందో అందరూ గమనించాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ అడ్డుకుందని జగన్ తెలిపారు. 2021 మార్చి 9న ప్రధాని మోదీకి లేఖ కూడా రాశామని గుర్తు చేశారు.  
 
ప్రభుత్వం స్పందించే వరకు వైఎస్సార్‌సీపీ తరపున బాధితుల పక్షాన పోరాటం ఆపేది లేదని జగన్ స్పష్టం చేశారు. తమ పార్టీ ఎల్లప్పుడూ కార్మికులకు, పేదలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాజకీయాలు పక్కనబెట్టి బాధితుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలన్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా జరిగిన వివాదంపై స్పందించారు. లోకేష్ లాంటి మనుషులు కూడా ఉంటారా అని జగన్ ఆశ్చర్యపోయారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget