అన్వేషించండి

AP DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!

Nara Lokesh Resignation: డీఎస్సీ నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు చేపట్టింది. లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

DSC Scam CBI Probe: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల  నిర్వహణలో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో మాజీ మంత్రి ఆర్‌.కే. రోజా పాల్గొని విద్యాశాఖకు నేతృత్వం వహిస్తున్న మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల నుండి ఫలితాలు, మెరిట్ జాబితాల ప్రకటన వరకు ప్రతి దశలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటన్నింటికీ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.

తిరుపతి ర్యాలీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి రోజా మాట్లాడారు. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. పారదర్శకంగా జరగాల్సిన డీఎస్సీ ప్రక్రియలో కట్ ఆఫ్ మార్కులు, మెరిట్ జాబితాల విడుదలపై తీవ్ర గందరగోళం సృష్టించారని, అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేవలం ప్రకటనలకే పరిమితమైన  మెగా డీఎస్సీ వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని, దీనిపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ   విచారణ జరిపిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని రోజా స్పష్టం చేశారు.

ఇదే అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం ర్యాలీ నిర్వహించారు.  విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై నేరుగా సవాళ్లు విసిరారు. డీఎస్సీ మెరిట్ జాబితాను బహిరంగంగా ప్రచురించకుండా, అభ్యర్థుల ఫోన్లకు మాత్రమే మార్కుల మెసేజ్‌లు పంపడం వెనుక ఉన్న రహస్యమేమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద నిబంధనలకు విరుద్ధంగా టెట్, డీఎస్సీ అర్హత కూడా లేని వందలాది మందికి దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించిన ఆయన, స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 421 మంది వ్యాయామ ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు, మెరిట్ లిస్ట్‌ను బహిరంగంగా విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు.

కేంద్రంలో నీట్ వివాదంపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేస్తున్న తరుణంలో, ఏపీలో 3.5 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్న లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విజయవాడ, అనంతపురం, రాజమండ్రి, అనకాపల్లి, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన రంగాలు చేపట్టిన ర్యాలీల్లో పాల్గొన్న పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు లోకేష్‌ వైఖరిని ఎండగట్టారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం వంటి సంస్కరణలను రద్దు చేసి విద్యా వ్యవస్థను నాశనం చేశారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.  

డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోయినా, నారా లోకేష్ రాజీనామా చేయకపోయినా తమ పోరాటాన్ని వీధుల్లోకి తీసుకెళ్తామని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు, ఈ నియామకాల అక్రమాలపై నిష్పాక్షికమైన సీబీఐ విచారణకు ఆదేశించే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, కలెక్టరేట్ల ముట్టడులు కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget