అన్వేషించండి

YS Jagan on Sharmila: షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఉండకూడదు, ఫ్యామిలీ పొలిటికల్ వారసత్వం నాదే- జగన్

AP Latest News: సోదరి షర్మిల గురించి ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కుటుంబ రాజకీయానికి నేతృత్వం వహిస్తున్నప్పుడు.. తమ కుటుంబం నుంచి షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఉండకూడదన్నారు.

CM Jagan Comments on YS Sharmila: వైఎస్ రాజకీయ వారసుడిగా తనకు మాత్రమే గుర్తింపు ఉందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒక తరంలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయాల్లోకి వస్తే.. అది అనివార్యంగా కుటుంబంలో చీలికకు దారితీస్తుందని తన సోదరి షర్మిలను ఉద్దేశించి అన్నారు.   ఆయన ఓ జాతీయ చానెల్ ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు.  ఏపీ రాజకీయాల్లో జగన్ ఓ వైపు- మిగతా వాళ్లంతా మరోవైపు అన్నట్లుగా ఎన్నికలు జరుగుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. తాను సింగిల్ అంటూ ఆయన కూడా చెప్పుకుంటున్నారు. టీడీపీ-బీజేపీ-జనసేనతో కూడిన మిత్రపక్షాలు ఓ వైపు- జగన్ ఓ వైపు ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఇంకో ముఖ్య విషయం కూడా ఉంది. జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి తన అన్నకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 

మొదట తెలంగాణలో సొంత పార్టీ స్థాపించి ఎన్నికల ముందు వరకూ పోరాడిన షర్మిల అనూహ్యంగా ఆంధ్రలో అడుగుపెట్టారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఈ పార్టీ పగ్గాలు చేపట్టారు. జగనన్న వదిలిన బాణం అని చెప్పుకున్న ఆమె.. ఆయన వైపే దూసుకు వెళుతున్నారు. జగన్ పాలనతో పాటు.. తమ కుటుంబంలో జరిగిన చిన్నాన్న హత్య కేసు విషయంలో జగన్ ను టార్గెట్ చేశారు. అయితే దీనిపై పెద్దగా స్పందించని జగన్ ... ఓ చానెల్ ఇంటర్వూలో మాత్రం వివరంగానే స్పందించారు. 

రేవంత్ ద్వారా చంద్రబాబు ప్రయోగించారు
షర్మిల కాంగ్రెస్ పార్టీ ద్వారా తనను టార్గెట్ చేయడంలో చంద్రబాబు రేవంత్ పాత్ర ఉందని జగన్ ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ద్వారా షర్మిలను తనకు వ్యతిరేకంగా మలిచారని చెప్పారు. తన సోదరిలిద్దరూ చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారు అని ఆరోపించారు. తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన,  తన అన్నను జైలులో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం కన్నా దారుణం ఏముంటుందన్నారు. 

వైఎస్ వారసుడిని నేనే- షర్మిల  వ్యాపారం చేసుకోవాలి
ఇదే ఇంటర్వూలో జగన్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ కుటుంబంలో ఒక తరానికి ఒకరే నాయకత్వం వహిస్తారని .. ప్రస్తుతం వైఎస్  వారసుడిగా తాను ఉన్నందున షర్మిల రాజకీయాల్లోకి రాకుండా వ్యాపారాలు చూసుకుంటే బాగుండేదన్నారు. ఒకరు పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మరొకరు  ఒకే కుటుంబం నుంచి వస్తే.. అది రాజకీయ పార్టీగా ఉండదని.. కుటుంబ ట్రస్ట్ట్‌గా మారిపోతుందన్నారు. కుటుంబంలో మరొకరు పోటీగా వచ్చినప్పుడు అది కుటుంబ బంధాలను నాశనం చేస్తుందని.. మా విషయంలో ఇది రుజువైందన్నారు. ఈ విషయాన్ని షర్మిల కు చెప్పడానికి ఎప్పుడైనా ట్రై చేశారా అని ప్రశ్నించగా.. “ఆవిడ చంద్రబాబు మాట వింటుంటే తాను ఎలా చెప్పగలను” అన్నారు. ప్రతీ విషయం చంద్రబాబుతో సంబంధం ఉందని ఎలా చెప్పగలరు అంటే.. “తాను నా  చెల్లెలు.. నాకు తెలుసు కదా..” అని బదులిచ్చారు 

షర్మిల వల్ల నష్టం ఏముండదు 
షర్మిల ప్రచారం, కాంగ్రెస్ పార్టీ వల్ల తనకు ఎలాంటి నష్టం ఉండదని జగన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదని ..ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలంటూ సూటిగా చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలోనూ.. చంద్రబాబు మాటలు నమ్మి చెల్లెల్లు రాజకీయం చేస్తున్నారని.. 2019 ఎన్నికల్లో వీళ్లు అవినాష్ తరపున ప్రచారం చేశారని.. 2024 వచ్చే సరికే ఏమైందని ప్రశ్నించారు. 
ఈ ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిసి వెళ్లడంపై జగన్ ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఓ రాజకీయ పార్టీగా అది వాళ్లిష్టం అని.. తమను మాత్రం పొత్తులోకి రావాలని బీజేపీ కోరలేదన్నారు. వ్యక్తిగతంగా తాను రాహుల్ గాంధీ కన్నా.. మోదీ వైపే మొగ్గు చూపుతానని.. రాహుల్ తన పట్ల వ్యవహరించిన తీరుకు తాను ఆయన కన్నా ఏ నాయకుడినైనా ఉన్నతంగానే భావిస్తా అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sai Dharam Tej : నా హక్కులు వదులుకునేందుకు సిద్ధం- ఆ ముసుగు తీసేయండీ- నెటిజన్‌పై సాయిధరమ్‌ తేజ్‌ ఫైర్
నా హక్కులు వదులుకునేందుకు సిద్ధం- ఆ ముసుగు తీసేయండీ- నెటిజన్‌పై సాయిధరమ్‌ తేజ్‌ ఫైర్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
Rath Yatra 2024: పూరీ జగన్నాథుని రథయాత్రలో అపశ్రుతి, భక్తుడి మృతితో విషాదం, ఆస్పత్రిలో వందలాది భక్తులు
పూరీ జగన్నాథుని రథయాత్రలో అపశ్రుతి, భక్తుడి మృతితో విషాదం, ఆస్పత్రిలో వందలాది భక్తులు
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sai Dharam Tej : నా హక్కులు వదులుకునేందుకు సిద్ధం- ఆ ముసుగు తీసేయండీ- నెటిజన్‌పై సాయిధరమ్‌ తేజ్‌ ఫైర్
నా హక్కులు వదులుకునేందుకు సిద్ధం- ఆ ముసుగు తీసేయండీ- నెటిజన్‌పై సాయిధరమ్‌ తేజ్‌ ఫైర్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
Rath Yatra 2024: పూరీ జగన్నాథుని రథయాత్రలో అపశ్రుతి, భక్తుడి మృతితో విషాదం, ఆస్పత్రిలో వందలాది భక్తులు
పూరీ జగన్నాథుని రథయాత్రలో అపశ్రుతి, భక్తుడి మృతితో విషాదం, ఆస్పత్రిలో వందలాది భక్తులు
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Shankar: రామ్ చరణ్ నటనపై శంకర్ ప్రశంసలు - Game Changer అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
రామ్ చరణ్ నటనపై శంకర్ ప్రశంసలు - Game Changer అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
Uttarakhand Earthquake: ఉత్తరాఖండ్‌లో భూకంపం, భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు
ఉత్తరాఖండ్‌లో భూకంపం, భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు
SJ Suryah - Pawan Kalyan: పవన్‌ను సీఎం చేయాలి - భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో ఎస్‌జే సూర్య
పవన్‌ను సీఎం చేయాలి - భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో ఎస్‌జే సూర్య
Embed widget