News
News
వీడియోలు ఆటలు
X

YS Avinash Reddy : వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట - ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే ?

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. మంగళవారం సాయంత్రం వరకూ సీబీఐ విచారణకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.

FOLLOW US: 
Share:

YS Avinash Reddy :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ  హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌పై మంగళవారం ఉదయం విచారణ చేపట్టనున్నారు. అందుకే పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత అవినాష్ రెడ్డిని ప్రశ్నించవచ్చని తెలిపింది. ఇప్పటికే ఉదయం పదిన్నరకు రావాలని సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కానీ హైకోర్టు ఆదేశంతో  ఆ నోటీసులు క్యాన్సిల్ చేసి మరోసారి సాయంత్రం నాలుగు గంటలకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. 

వైఎస్ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.. హైకోర్టులో భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే సీబీఐ అరెస్ట్ చేసిందని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎంపీ తరఫు న్యాయవాది వాదించారు.  భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడానికి దస్తగిరి కాంఫెషన్ తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని సీబీఐ బెదిరించినట్టు, చిత్రహింసలకు గురిచేసినట్టు ఎర్ర గంగిరెడ్డి చెప్పారు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి సహ నిందితుడు అంటూ ప్రచారం జరుగుతోంది.. దస్తగిరికి బెయిల్ వచ్చిన తర్వాతి రోజే సీబీఐ వాళ్ళు 306 పిటిషన్ వేశారన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆయన్ను అప్రూవర్‌గా మార్చారు. హత్యకు సంబంధించిన ఆధారాలు లేవని అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదించారు.   హత్య తర్వాత సాక్షాలు తుడిచివేయడంపై చెబుతున్నారు. సాక్షాలు రూపుమాపడం ఆరోపణ అయితే ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని... ఎందుకు అంటే దానికి 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షలు లేవని అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదించారు.  అన్ని కోణాల్లో విచారించి హత్య ఎవరో చేశారో తేల్చే కోణంలో విచారణ జరగట్లేదు. రాజకీయ కోణంలోనే విచారణ జరుగుతోంది. రాజకీయ కోణంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇరికించే కుట్ర జరుగుతోందని  అవినాష్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

సీబీఐ తరపు లాయర్ ఎన్ని సార్లు విచారణకు పిలుస్తున్నా.. ప్రతీ సారి పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  అవినాష్ రెడ్డి నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు. మూడోసారి విచారణకు రమ్మనప్పుడు 5 రోజులు సమయం తీసుకుని హాజరయ్యారు. ఇప్పుడు విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే మళ్ళీ పిటిషన్ వేశారు. మా తరఫు దర్యాప్తు పూర్తి చేయడానికే నోటీసులు ఇచ్చాం. వివేకా హత్య జరిగిన తర్వాత అవినాష్ పోలీసులకు ఫోన్ చేశారు. ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుల్స్ పంపండి చాలు అని చెప్పారు. అంతేకాదు.. గుండెపోటుతోనే వివేకా చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యను కప్పిపుచ్చుకునేందుకు సహజ మరణం కింద చిత్రీకరించారు. సాక్షాలు తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు’ అని సీబీఐ తరఫు లాయర్ తన వాదనలు వినిపించారు.

మరో వైపు వైఎస్ సునీత కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి అంగీకరించారు. సునీత తరపు లాయర్ కూడా కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. 
 
Published at : 17 Apr 2023 04:59 PM (IST) Tags: Telangana High Court YS Avinash Reddy YS Viveka Murder Case

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Mini Jamili Elections : మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?

Mini Jamili Elections :  మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !

Lokesh Rayalaseema Declaration :  రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే  రత్నాల సీమే !

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!