By: ABP Desam | Updated at : 12 May 2023 04:14 PM (IST)
అమరావతిలో ఉద్రిక్తత
Amaravati Lands Issue : రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని సెంటు స్థలాలుగా పంపిణీ చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొండపాడు నెక్కల్లులో రైతుల పనులు చేయడానికి వచ్చిన అధికారులపై తిరుగుబాటు చేశారు. దొండపాడు, నెక్కల్లు ఎస్-3 జోన్లలో రైతుల నిరసనకు దిగారు. దొండపాడులో రాజధాని రైతులు పనులను అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాలు పనుల కోసం సీఆర్డీఏ సిబ్బంది వచ్చారు. జేసీబీ, ప్రొక్లయినర్లతో పనులు చేయటానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే పనులను అడ్డుకుని వాహనాలను రైతులు వెనక్కి పంపారు.
రాజధాని భూముల్ని సెంటు స్థలాలుగా ఇవ్వడం ఒప్పందానికి విరుద్దమంటున్న రైతులు
అధికారుల తీరును నిరసిస్తూ పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని మహిళా రైతుల నిరసనగా దిగారు. పెట్రోల్ బాటిళ్లను లాక్కునేందుకు పోలీసుల యత్నించారు. పోలీసులు, రైతులు మధ్య పెనుగులాటలో మహిళా రైతులపై పెట్రోల్ పడింది. పెట్రోల్ మీద పడటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడతో పాటు గుంటూరు జిల్లా పెదకాకాని, మంగళగిరి తాడేపల్లి నగరపాలకసంస్థ, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 40 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అంతర్గత రోడ్లు, హద్దు రాళ్లు, అప్రోచ్ రోడ్లు వేసేందుకు పనులు చేస్తున్నారు.
రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో సెంట్ స్థలాలు
అమరావతిలో గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో కీలక నిర్మాణాలు ప్రతిపాదించిన చోట విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఇందు కోసం సీఆర్‌డీఏ చట్ట సవరణ చేసింది ప్రభుత్ం. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 1134 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇవ్వగా.. దీనిపై రైతులు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేయడంతో ఆర్-5 జోన్‌తో రాజధాని భూములను ఇతరులకు కేటాయించేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమం అయినట్లయింది.
అమరావతిని నిర్వీర్యం చేసే కుట్రంటూ ఆరోపణలు
ప్రభుత్వం సెంటు స్థలాలుగా పంపిణీ చేయాలనుకుంటన్నది యాభై వేల కుటుంబాలకు. అంత పెద్ద మొత్తంలో రాజధాని ప్రాంతాల్లోకి ఇతరులను తీసుకొచ్చి పెట్టి.. మాస్టర్ ప్లాన్ నిర్వీర్యం చేయడానికే ప్రభుత్వం, సీఎం జగన్ కుట్ర పూరితంగా ఇలా చేస్తున్నారని రైతులు అంటున్నారు. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం.. రైతులకు ప్లాట్లు అప్పగించకపోగా.. కౌలు కూడా ఇవ్వడం లేదని.. కానీ వారి భూముల్ని రాజకీయ కుట్రలకు ఉపయోగించుకుంటన్నరాని రైతులు మండి పడుతున్నారు. ప్రస్తుతం ఈ కేటాయింపులపై పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం వేగంగా మార్కింగ్ చేస్తోంది.
Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి
Botsa Satyanarayana: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?
NMMS RESULTS: ఏపీ ఎన్ఎంఎంఎస్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Top 10 Headlines Today: చంద్రబాబు - అమిత్ భేటీ వివరాలు; నేడు నిర్మల్‌కు కేసీఆర్ - ఇవాల్టి టాప్ 10 న్యూస్
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ
Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!