Social Media: సోషల్ మీడియాను మంచికే వాడదామని ఉద్యమం - చేస్తున్నదెవరు ?
Social Posts: సోషల్ మీడియా మంచికే వాడదామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. సినిమా తారలతోనూ విస్తృత ప్రచారం చేయిస్తున్నారు.
Andhra Pradesh: ప్రపంచంలో ప్రతి ఆవిష్కరణకు మంచి, చెడూ రెండూ ఉంటాయి. అయితే మంచి కన్నా చెడుకే ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో అదే జరుగుతోంది. సోషల్ మీడియా వల్ల ఎన్ని అనర్థాలు ఈ ప్రపంచంలో జరిగాయో .. జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఫేస్ బుక్ వచ్చిన మొదట్లో ఎన్నో కాపురాలు కూలిపోయాయని చెప్పుకున్నారు. ఇప్పుడు వాట్సాప్ , ట్విట్టర్, ఇన్ స్టా వంటివి వచ్చి పడ్డాయి. అయితే కల్లోలం అందరికీ అలవాటైపోయింది. వీటిని రాజకీయ నేతలు వాడుకోవడం ప్రారంభించిన తర్వాత పూర్తిగా ప్రపంచం మారిపోయింది.
ఏపీలో పలు చోట్ల సోషల్ మీడియాపై పోస్టర్లు
సోషల్ అందర్నీ దూషిస్తూ అదే భావ ప్రకటనా స్వేచ్చ అంటురు. ఇతరుల్ని తిట్టడం భావ ప్రకటనా స్వేచ్చ కాదని పోలీసులు జైళ్లకు పంపుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పలు చోట్ల ప్రత్యేకమైన ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చెడు ప్రచారం వద్దంటూ… అమరావతితో పాటు తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఏపీలోని ప్రధాన నగరాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అసత్య ప్రచారాలకు, దూషణలకు చెక్ పెడదామని నినాదాలను ఈ ఫ్లెక్సీల్లో పెట్టారు. చెడు విషయాలు పోస్ట్ చేయవద్దు.. నైతికంగా పతనం కావొద్దు అని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిస్తున్నారు.
భారీ ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు
అందరికీ అర్థమయ్యేలా ఆంగ్లం, తెలుగు భాషల్లో వీటిని ఏర్పాటు చేశారు.సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ద్వారా చైతన్యం తెచ్చేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న చిన్న పోస్టర్లు కాదు ఏకంగాపెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశం అవుతున్నాయి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న అనర్థాలు.. మంచి కోసం ఎలా ఉపయోగించుకోవాలన్న చర్చ కూడా వస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. వీటిని ఎవరు ఏర్పాటు చేశారనేదానిపై మాత్రం స్పష్టత లేదు. సినిమా తారలతోనూ ప్రచారం చేయిస్తున్నారు.
ఉచిత సలహాలు ఇస్తే తీసుకుంటారా ?
సలహాలు, నీతులు ఉరకనే చెబుతారు. భారీ హోర్డింగ్‌లకు వేలల్లో వసూలు చేస్తారు ఇలా అన్ని సిటీల్లో వేయాలంటే లక్షలు ఖర్చవుతుంది. అయినా ఎవరూ ఖర్చు పెట్టి చెప్పరు. కానీ ఏపీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఎవరి పేర్లు లేవు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే జారీ చేసిన వారు సమాచార, ప్రచార సంబంధాల శాఖ అని వేసుకునేవారు. కానీ అలా వేయలేదు. ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసి ఉంటే అంత ఖర్చుపెట్టి పబ్లిసిటీ చేసుకోవడం లేదు.