అన్వేషించండి

IMD Temperature Alert: ఈ ఏడాది సైతం రికార్డు ఉష్ణోగ్రతలు, భానుడి ప్రతాపానికి మార్చి నుంచే వడగాల్పులు: ఐఎండీ

Weather Updates Today | ఇది చలికాలమా లేక వేసవికాలమా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని భారత వాతావరణ సంస్థ తెలిపింది.

IMD Temperature Alert | అమరావతి: గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎండలతో ఉక్కపోత పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జనవరి చివరి వారం నుంచే మార్చి నెలాఖరులో ఉండే ఎండలను చూసి అప్పుడే వేసవి కాలం వచ్చేసిందా అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఫిబ్రవరి తొలి వారంలోనూ అధిక ఉష్ణోగ్రతలు చూసి.. ఇప్పుడే ఇలా ఉండే వేసవిలో తమ పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్చి నెల నుంచి వడగాల్పులు మొదలయ్యే అవకాశం ఉంది.

అటు తెలంగాణలోనూ కొన్ని రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అప్పుడే 34 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ లో 37 డిగ్రీలు, భద్రాచలంలో 36.8, ఖమ్మం, మహబూబ్ నగర్ లలో 36.4 డిగ్రీలు, నిజామాబాద్ లో 36 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలికాలంలోనూ ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత సగటున ఒక డిగ్రీ మేర పెరిగితే మరణాలు 0.2 శాతం నుంచి 5.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
అత్యంత వేడి సంవత్సరంగా 2024
భూతాపం కారణంగా గత దశాబ్దం, 15 ఏళ్లలో పలుమార్లు ఎండలు రికార్డు సృష్టించాయి. 2010 నుంచి 2024 మధ్యకాలంలో అత్యంత వేడి సంవత్సరాలుగా పదేళ్లు రికార్డు నెలకొల్పాయంటే ఎండల తీవ్రత ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అత్యంత వేడి దశాబ్దంగా 2015- 2024  నిలిచింది. అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డు సృష్టించిందని తెలిసిందే. ఈ ఏడాది సైతం భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ సంస్థ తెలపడంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయి,  అసాధారణ వేడి ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. రానున్న రోజుల్లో వేడిని తట్టుకోలేని పరిస్థితి నెలకొంటుందని, కనుక ప్రజలకు చెట్ల పెంపకాన్ని సూచిస్తోంది. 
ఏపీ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు
కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో అసాధారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించారు. చిరు జల్లులు కురిసే అవకాశం ఉండటంతో ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అసలే ఢిల్లీలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నుంచి బయటకు రానున్నారు. బాపట్ల, నందిగామ, కావలి, కర్నూలులో మంగళవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితో పాటు కాకినాడ, మచిలీపట్నం, తుని, నరసాపురం తదితర ప్రాంతాల్లో నిన్న ఒకేరోజు ఏకంగా 3 నుంచి 6 డిగ్రీలు మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలవరపెడుతోంది. అసలే ఏపీలో పలు జిల్లాలకు తీర ప్రాంతం ఉండటంతో ఎండ వేడి కంటే, హ్యుమిడిటీ సమస్య అధికంగా ఉంటుందని తెలిసిందే. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోనూ ఫిబ్రవరి రెండో వారంలో 2 నుంచి 4 డిగ్రీలు మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలను ఐఎండీ అలర్ట్ చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget