అన్వేషించండి

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP:  నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడ్డ "మాండౌస్"  తుఫాను గత 6 గంటల్లో 11 కి.మీ వేగంతో వేగంగా పయనిస్తూ రేపు రాత్రి తీరం దాటి ఏపీలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ కేంద్రం చెబుతోంది.

Weather Updates AP: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడ్డ "మాండౌస్"  తుఫాను గత 6 గంటల్లో 11 కి.మీ వేగంతో వేగంగా పయనిస్తోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈరోజు డిసెంబర్ రాత్రి 8, 9 గంటల సమయంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా, అక్షాంశం 9.5°N, రేఖాంశం 83.8°E దగ్గర కలిసంది. ట్రింకోమలీ (శ్రీలంక) కి తూర్పు ఈశాన్యంగా 300 కి.మీ. జాఫ్నా (శ్రీలంక)కి తూర్పు ఆగ్నేయంగా 420 కి.మీ., కారైకాల్కు తూర్పు ఆగ్నేయంగా 460 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 550 కి.మీ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి  మధ్య 9 డిసెంబర్ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. అలగే పుదుచ్చేరి మరియు శ్రీహరికోట దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను ఆనుకుని 65 నుండి 75 కి మీ గరిష్టముగా  85 కి.మీల వేగంతోగాలి వీచే అవకాశం ఉంది. 

రాబోవు మూడు రోజుల్లో వర్ష సూచన..

డిసెంబర్ 8న కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉంటుంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 09న తమిళనాడు పుదుచ్చేరి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పక్కనే ఉన్న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 10వ తేదీన ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షపాతంతో నమోదు కానుంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయి. 

గాలి హెచ్చరిక:

గంటకు 40-45 కి.మీ వేగంతో 55 కి.మీల వేగంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో డిసెంబర్ 8వ తేదీన గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ ఉదయం నుంచి 80-90 కేఎంపీహెచ్ వేగంతో గాలులు మొదలవుతాయి. రాత్రి 100 కేఎంపీహెచ్ వరకు పెరుగుతాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి. ప్రచండ గాలులు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఈ ఉదయం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు ప్రారంభమవుతాయి. రేపు(శుక్రవారం) సాయంత్రం నుంచి డిసెంబర్ 10 ఉదయం వరకు 70-80 కేఎంపీహెచ్ నుంచి 90 కేఎంపీహెచ్ వరకు ఈదురుగాలులు వీస్తాయి. ఇది డిసెంబర్ 10 మధ్యాహ్నం నాటికి 50-60 కి.మీ వేగంతో 70 కి.మీ.కి, ఆపై డిసెంబర్ 10 రాత్రికి గంటకు 40-50 కి.మీ.కి 60 కి.మీకి తగ్గే అవకాశం ఉంది.

సముద్ర పరిస్థితి

10వ తేదీ ఉదయం వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నైరుతి మరియు పరిసర ప్రాంతాలలో సముద్ర పరిస్థితి చాలా ఉధృతంగా ఉండి, ఆ తర్వాత క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి సముద్ర పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. రేపు(శుక్రవారం) పరిస్థితి మరింత ఉద్ధృతంగా ఉంటుంది. అందుకే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే వెళ్లిన వాళ్లు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని సూచిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Raptadu Girl Attack Case: రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు! అసలేం జరిగింది.. 
రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు! అసలేం జరిగింది.. 
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అత్యధికంగా గూడురులో 83.6 శాతం నమోదు
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అత్యధికంగా గూడురులో 83.6 శాతం నమోదు
AP Local Body Elections Live updates: ఏపీలో ముగిసిన పట్టణ స్థానిక ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో ముగిసిన పట్టణ స్థానిక ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget