Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో 24 గంటలు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణను కమ్మేసిన మేఘాలు
బంగాళాఖాతం తీరం వెంట వీచే బలమైన గాలుల ప్రభావంతో మరో 24 గంటలు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో కొన్ని చోట్ల వాతావరణం పొడిగా మారనుంది.
AP Weather Updates: బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం తీరం వెంట వీచే బలమైన గాలుల ప్రభావంతో ఏపీలో మరో 24 గంటలు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అయితే ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు స్వల్ప ఊరట లభించింది. ఈ ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉండనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో మూడు రోజులు ఇక్కడ వాతావరణం ఇలాగే ఉండనుందని అంచనా వేశారు. దక్షిణ కోస్తాంధ్రంలో మాత్రం మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తరువాత మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. తీరం వెంట గాలులు వీస్తున్నా చేపల వేటకు ఇబ్బందులు తలెత్తవని తెలుస్తోంది. నెల్లూరు లాంటి ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. లేనిపక్షంలో చల్లని గాలులు వీచడంతో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
కొన్ని రోజుల కిందట కురసిన భారీ వర్షాల నుంచి రాయలసీమ ఇంకా కోలుకోలేదు. వరద ప్రవాహంతో కొన్నిచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రోడ్డు ప్రమాదాలు దెబ్బతిన్నాయి. కొన్ని మార్గాల్లో నీటి ప్రవాహం కారణంగా మరమ్మతులు చేపట్టడానికి వీలు కావడం లేదు. రాయలసీమలోనూ మరో 24 గంటలపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాలు కురిసే అవకాశమే లేదని క్లారిటీ ఇచ్చారు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో కొన్ని చోట్ల వాతావరణం పొడిగా మారనుంది.
Also Read: Nellore: వెనుదిరిగిన ఎన్డీఆర్ఎఫ్.. ఆలస్యమవుతున్న గాలింపు..
View this post on Instagram
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
నైరుతి, ఈశాన్య దిశ నుంచి వీచే చలిగాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రత సైతం భారీగా తగ్గుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రజలు కోవిడ్19 నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.
Also Read: Revant Reddy : సొంత పార్టీకే భవిష్యత్ లేదు..ఇక జాతీయ రాజకీయాలా ? .. కేసీఆర్ తమిళనాడు టూర్‌పై రేవంత్ రెడ్డి విసుర్లు