By: ABP Desam | Updated at : 01 Jan 2023 05:14 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి బొత్స సత్యనారాయణ
Minister Botsa Satyanarayana : త్వరలోని విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రెండు, మూడు నెలల్లోనే విశాఖ రాజధాని అవుతుందని ఆకాంక్షించారు. "గత సంవత్సరం కన్నా ఈ ఏడాది మరింత వృద్ధి సాధించాలని అమ్మవారి కోరుకున్నాను. విద్య, వైద్య, సంక్షేమం, సీఎం జగన్ ఆశయం నెరవేరాలని కోరుకున్నాను. వచ్చే రెండు మూడు నెలల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వాలన్నది మా కోరిక. అది అవుతుంది కూడా. రాష్ట్ర ప్రజలు కూడా సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఇదంతా జరుగుతుంది. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన త్వరలోనే ఉంటుంది" అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఏప్రిల్ నుంచి పాలన
విశాఖ రాజధానిగా పాలనపై ఇప్పటికే మంత్రులు స్పష్టత ఇచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏప్రిల్ నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారని గతంలోనే తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వ భవనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రిషికొండపై నిర్మిస్తున్న భవనాలు సిద్ధం అయ్యాక ప్రభుత్వ శాఖల షిఫ్టింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కొందరు. ఇటీవల విశాఖలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆ పార్టీ నేతలు శంకుస్థాపన చేశారు. మంత్రుల కామెంట్స్, ప్రభుత్వ పర చర్యలు చూస్తుంటే మరో రెండు, మూడు నెలల్లో విశాఖ రాజధానిగా పాలన ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు మాటెలా ఉన్నా సీఎం జగన్ మాత్రం విశాఖలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చెయ్యడం ఖాయమని వైసిపీ మంత్రులు పదేపదే చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టే పరిణామాలు అన్నీ వేగంగా జరిగిపోతున్నాయి . ఫిబ్రవరి తరువాత ఏ క్షణమైనా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్నట్టు పార్టీ సంకేతాలు ఇస్తుంది.
విశాఖ కేంద్రంగా
2023 ఏప్రిల్ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ కేంద్రంగా పరిపాలన చేస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే ప్రకటించారు. అలా అయితే విశాఖ రాజధాని అయినట్లేనా అంటే మాత్రం చట్ట పరంగా కాదని చెప్పాలి. అయితే సీఎం ఎక్కడ నుంచి అయినా పరిపాలించవచ్చని.. ఫలానా చోటే ఉండాలన్న రూలేం లేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు కొంత కాలంగా వాదిస్తున్నాయి. అదే సమయంలో రాజ్యాంగంలో రాజధాని అనేదే లేదని అంటున్నారు. ఈ వాదనలతో.. సుప్రీంకోర్టులో అమరావతి అంశం తేలకపోయినా విశాఖ నుంచి జగన్ పాలన చేయాలని నిర్ణయించుకున్నారు. మరి జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని అవుతుందా ? వ్యవహారం కోర్టుల్లో ఉన్నప్పుడు ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేత అలా చేయవచ్చా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చు!
వైఎస్ఆర్‌సీపీ మంత్రులు వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నారు. విశాఖలో ఏప్రిల్ నుంచి రాజధాని అని చెప్పడం లేదు. జగన్ పాలన చేస్తారని చెబుతున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మార్చుకుని పాలన సాగిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో తాము వాదించినట్లుగా..సీఎం పాలన ఎక్కడి నుంచైనా చేయవచ్చని.. ఎవరూ అడ్డుకోలేరని వారు వాదించవచ్చు. వైఎస్ఆర్‌సీపీ నేతల వాదన కరెక్టే. సీఎం జగన్ రాజధాని నుంచే పరిపాలించాలని లేదు. అలాగని సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని కాదు. సీఎం జగన్ కర్నూలు లేదా విశాఖ నుంచి పరిపాలన చేస్తే ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. ఈ కోణంలోనే విశాఖ నుంచి ఆయన పరిపాలన చేయవచ్చు.
Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి
Weather Latest Update: రేపు తీరం దాటనున్న వాయుగుండం, ఏపీలో ఈ ఏరియాల్లో వర్షాలు పడే ఛాన్స్!
AP PM Kisan : ఏపీలో సగం మంది రైతులకు పీఎం కిసాన్ తొలగింపు - ఇంత మందిని ఎందుకు తగ్గించారంటే ?
Nara Lokesh Padayatra: నారా లోకేష్ యువగళం 5వ రోజు పాదయాత్ర షెడ్యూల్
Jagan Flight : సాయంత్రం సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ! రాత్రి ఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
Warner as Pathaan: 'పఠాన్' గా అదరగొట్టిన డేవిడ్ వార్నర్- ఆస్కార్ కమింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్