News
News
వీడియోలు ఆటలు
X

YS Viveka Case : అరెస్ట్ - బెయిల్ మధ్య ఊగిసలాడుతున్న అవినాష్ రెడ్డి - వివేకా కేసుతో రాజకీయంగా వైఎస్ఆర్‌సీపీకి సమస్యేనా?

వైఎస్ వివేకా కేసు తో వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందేనా ?

బాధితులు, నిందితులు వైఎస్ కుటుంబసభ్యులే!

ఒకరిపై ఒకరు ఆరోపణలతో సమస్య జఠిలం !

రాజకీయంగా కార్నర్ అవుతున్న వైఎస్ఆర్‌సీపీ

FOLLOW US: 
Share:

YS Viveka Case :  వైఎస్ వివేకానందరెడ్డి కేసు ప్రతీ రోజూ హాట్ టాపిక్ అవవుతోంది. పూర్తి స్థాయిలో ఆ కేసు గురించి ప్రజల్లో చర్చ  జరుగుతోంది. అసలేమి జరిగిందో ఓ రోజు అవినాష్ రెడ్డి వీడియో విడుదల చేస్తారు. మరో రోజు బెయిల్ పిటిషన్లపై వాదనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరో రోజు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. అసలు కోర్టు రూమ్‌లో జరిగే విచారణల కన్నా బయట జరిగే విచారణలు.. చర్చలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటి వల్ల వైఎస్‌ఆర్‌సీపీనే ప్రధానంగా ఇబ్బంది పడుతోంది. ఈ ఘటనపై చర్చ ఎంత ఎక్కువ జరిగినా ఆ పార్టీకే సమస్య అవుతోంది. ఎందుకంటే బాధితులు, నిందితులు రెండు వర్గాలూ ఆ పార్టీవారే. ఇదే వైఎస్ఆర్‌సీపీకి కత్తి మీద  సాములా మారింది. 

అరెస్ట్ కాకుండా చేసుకునే ప్రయత్నాలతో హాట్ టాపిక్ అవుతున్న అవినాష్ రెడ్డి 

రెండు వారాల కిందట ఆదివారం ఉదయమే హఠాత్తుగా పులివెందులలో దిగిన సీబీఐ అధికారులు నేరుగా  వైఎస్ అవినాష్ రెడ్డికి ఇంటికి వెళ్లి రెండు గంటల్లో ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లిపోయారు. అవినాష్ రెడ్డి అప్పుడు ఇంట్లో లేరు. ఆయన ఉంటే ఆయననూ అరెస్ట్ చేసేవారేమో తెలియదు కానీ అప్పటికి  భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు. అదే రోజు అవినాష్ రెడ్డికి తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రారంభమైన  హైటెన్షన్ డెలవప్‌మెంట్స్.. తెలంగాణ హైకోర్టు టు సుప్రీంకోర్టు.. అక్కడి నుంచి  మళ్లీ  హైకోర్టు కు చేరింది. ఇక్కడా పరిష్కారం కాలేదు. జూన్‌కు వాయిదా పడింది. 

ఇక నుంచి సీబీఐ అరెస్ట్ చేస్తుందా లేదా అన్నదానిపైనే విస్తృత చర్చ 

ఇప్పుడు సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందా లేదా అన్న టాపిక్‌పై చర్చ  ప్రారంభమవుతుంది. మరో వైపు అవినాష్ రెడ్డి సీబీఐకి చెప్పుకునేది చెబుతున్నారు.. అంత కంటే ఎక్కువగా బయట మాట్లాడుతున్నారు. మీడియాతో రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. హత్యకు గల కారణాలు చెబుతున్నారు. తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేసి వివేకానందరెడ్డి రాసిన లేఖే కీలకమని ఆ లేఖ కేంద్రంగానే విచారణ చేయాలంటున్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు అటు అవినాష్ రెడ్డి సృష్టించుకుంటున్నారు. మరో వైపు ఆయనకు మద్దతుగా వైఎస్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతల్ని తప్పు పడుతూ హు కిల్డ్ బాబాయ్ - అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 

వివేకా  హత్య కేసు ప్రజల్లో ఎంత నానితే వైఎస్ఆర్‌సీపీకి అంత ఇబ్బంది !

వివేకా హత్య కేసులో అటు   బాధితులు, ఇటు నిందితులు కూడా వైఎస్ కుటుంబానికి చెందిన వారే. వారిలో వారే ఆరోపణలు చేసుకుంటూండటం.. చనిపోయిన వివేకా మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. వాటిని షర్మిల ఖండించారు. మీడియాలోనూ ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ జగన్ ... అవినాష్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం కూడా ఇది రాజకీయంగా ప్రాధాన్యతాంశం కావడానికి కారణం అవుతోంది. ఇప్పుడు వివేకా  హత్య కేసు కొలిక్కి వస్తే తప్ప ఈ అంశంపై రాజకీయ ఆరోపణలు విమర్శలకు పులిస్టాప్ పడే చాన్స్ లేదు. ఇప్పుడు జరుగుతున్న విచారణ సరిగ్గా లేదని వైసీపీ వాదిస్తోంది. వైఎస్ వివేకా కుమార్తె, అల్లుడు పైనే ఆరోపణలు చేస్తున్నారు. ఇదో అంతు లేని కథలా సాగిపోతోంది. 

Published at : 29 Apr 2023 07:50 AM (IST) Tags: YS Jagan YSRCP YS Sunitha YS Avinash Reddy YS Viveka Murder Case

సంబంధిత కథనాలు

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Screen Recording: విండోస్ 11లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా? - కేవలం మూడు క్లిక్‌లతోనే!

Screen Recording: విండోస్ 11లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా? - కేవలం మూడు క్లిక్‌లతోనే!