అన్వేషించండి

YSRCP Bus Yatra: ఈ 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర - ఇచ్చాపురం టు అనకాపల్లి పూర్తి షెడ్యూల్ ఇలా

YSRCP Bus Yatra News: ఈనెల 26వ తేదీ నుంచి సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి తెలిపారు.

YSRCP Bus Yatra Ichchapuram to Anakapalle

విశాఖపట్నం: ఈనెల 26వ తేదీ నుంచి సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ యాత్రలో గత నాలుగున్నర సంవత్సరాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామన్నారు. విశాఖపట్నంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ తన పాలనతో సామాజిక న్యాయం అంటే ఏమిటో ప్రజలకు చేసి చూపించారని చెప్పారు. గత ప్రభుత్వాలు పేద, బడుగు, బలహీన వర్గాల వారిని పూర్తిగా విస్మరించాయని, వైసీపీ ప్రభుత్వం మాత్రమే అన్ని వర్గాల వారిని ఆదరించిందని, సంక్షేమ పథకాలు అందించి వారి జీవన స్థితిగతులను మార్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరికం తగ్గుముఖం పట్టడానికి జగన్ తెచ్చిన నవరత్న పథకాలే కారణమని చెప్పారు. 

రాష్ట్ర వ్యాప్తంగా చట్ట సభల్లో సీట్లు నుంచి స్థానిక ఎన్నికలు, నామినేటెడ్‌ పోస్టుల వరకూ అన్నింటిలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్‌ జగన్ అందించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేయడంతో పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని సుబ్బారెడ్డి వెల్లడించారు. జగనన్న సురక్షలో అన్ని రకాల ధృవీకరణ పత్రాలు అందజేసినట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షతో గ్రామాల్లో ఉచితంగా మెడికల్‌ క్యాంపులు నిర్వహించి వారికి వైద్యసేవలలు అందిస్తున్నట్లు చెప్పారు.

బస్సు యాత్ర వివరాలు
అక్టోబర్ 26న ఇచ్చాపురంలో యాత్ర ప్రారంభం అవుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. 27న విజయనగరం జిల్లా గణపతినగరంలో, 28న భీమిలిలో, 30న పాడేరులో, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న పలాస, 4న ఎస్‌.కోట, 6న గాజువాక, 7న ఆముదాల వలస, 8న సాలూరు, 9న అనకాపల్లిలో జరగనున్నట్లు వెల్లడించారు. ఈ ఈ యాత్రకు ఉత్తరాంధ్ర మంత్రులతో పాటు పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో  మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో నిర్వహించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమలు, సంక్షేమంపై ప్రజలకు వివరించనున్నారు.

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు జరిపి ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. 175 నియోజకవర్గాల్లో  అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి బస్‌ యాత్ర ద్వారా ప్రజలకు తెలియచేస్తామన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా జగన్ సంక్షేమాభివృద్ధి చేశారన్నారు. అర్బికే, వెల్నెస్‌ సెంటర్లు, నాడు నేడు ద్వారా విద్యా, ఆసుపత్రుల ఆధునీకీకరణ, నూతన భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యతో 8వ తరగతి పిల్లలకు ఉచితంగా ట్యాబ్‌లు అందిస్తున్నామని చెప్పారు. కానీ పవన్‌ కళ్యాణ్‌కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.  పవన్ విషయం తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బొత్స సూచించారు. టీడీపీ, జనసేనలు కలిపి అధికారం వస్తుందని కలలు కనడం తప్ప అది జరగదన్నారు. 

డిసెంబర్‌ నాటికి విశాఖకు వస్తామని ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు మద్దతుగా మా ప్రభుత్వం బీజేపీ చెప్పింది. 'విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కావాలని పదేపదే కేంద్రాన్ని కోరామని, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని మీరే అడగండి అంటూ మంత్రి బొత్స మీడియాను కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Citadel Honey Bunny First Review: 'సిటాడెల్: హనీ బన్నీ' ఫస్ట్ రివ్యూ... సమంత లేటెస్ట్‌ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
'సిటాడెల్: హనీ బన్నీ' ఫస్ట్ రివ్యూ... సమంత లేటెస్ట్‌ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Imane Khelif: ఆమె కాదు అతడే, ఇమాన్‌ ఖలీఫ్‌ మెడికల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఆమె కాదు అతడే, ఇమాన్‌ ఖలీఫ్‌ మెడికల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Embed widget