అన్వేషించండి

వీల్ చైర్ డ్రైవింగ్‌తో 27 వేల కిలోమీటర్లు- విశాఖ యువకుడి సంచలనం

యాక్సిడెంట్‌లో పోయింది కాళ్లే లక్ష్యం కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనిస్కో సైట్లను చుట్టి వచ్చిన రవి వర్మ. 4 నెలలపాటు కారులోనే ప్రయాణం.

20 ఏళ్లు దాటని వయస్సులో సెలవులకు అమ్మానాన్నను చూద్దామని కాలేజీ నుంచి విశాఖ వచ్చిన రవి వర్మ కథ సినిమాటిక్‌గా మారిపోయింది. ఊళ్ళోకి వెళ్లి వద్దామని బైక్‌పై వెళుతున్న రవి వర్మ బండి స్కిడ్ అయ్యి రోడ్డుపై పడిపోయాడు. ఆ సమయంలో వెన్నెముకకు బలమైన దెబ్బ తగింది. అంతే రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి. చాలా ఏళ్ల పాటు మంచానికే పరిమితమైన రవి వర్మ తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు . జీవితం అక్కడితో అయిపోలేదు అని నిరూపించాలనుకున్నాడు.
 
తన అభిరుచి అయిన ట్రావెలింగ్‌ను మళ్లీ మొదలుపెట్టాడు. దేశం మొత్తం ఓ రౌండ్ వెయ్యలనుకున్నాడు. దానికంటే ముందు తనలాంటి వాళ్లకు స్ఫూర్తిని ఇవ్వడానికి RAMP( రెగ్యులర్ యాక్సిస్ ఫర్ మొబిలిటీ పీపుల్) సంస్థను స్థాపించాడు. శరీరం దెబ్బ తిన్నంత మాత్రాన ఆత్మ స్థైర్యం కూడా దెబ్బ తినాల్సిన అవసరం లేదని నిరూపించదలిచాడు.
 
దాని కోసం విశాఖ నుంచి బయల్దేరి దేశం మొత్తం కారులో చుట్టి రావాలని అనుకున్నాడు. దానికి తల్లిదండ్రులు నరసింహ రాజు, రాజేశ్వరి, సోదరి పూజిత సపోర్ట్ ఇవ్వడంతో ఈ ఏడాది ఏప్రిల్ 28న విశాఖలోని RK బీచ్ నుంచి బయల్దేరి వెళ్ళాడు. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా మార్పులు చేసిన కారును ఏర్పాటు చేసుకుని.. ఒక సహాయకుణ్ణి వెంట బెట్టుకుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ దేశం మొత్తం చుట్టి వచ్చాడు.
 
ఇండియాలోని 27 వేల కిలోమీటర్ల దూరం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తిరిగి వచ్చాడు. అన్ని ప్రాంతాలలోనూ తన లాంటి వారిని కలుసుకుంటూ వారికి ధైర్యం చెబుతూ వారి నుంచి తాను స్ఫూర్తి పొందుతూ నాలుగు నెలల పాటు దేశ యాత్రలోనే గడిపాడు. ఇటీవలే తిరిగి వచ్చిన రవి వర్మకు విశాఖ ప్రజలు బ్రాహ్మరథం పట్టడంతోపాటు సన్మానాలు..సత్కారాలు చేశారు. ఈ స్పూర్తితో రానున్న రోజుల్లో కారులోనే ఇతర దేశాల సైతం చుట్టి వస్తానని అంటున్నాడు రవి వర్మ
 
రెండేళ్ళు నరకం చూసాం: రవి వర్మ తండ్రి రాజు
 
రవి వర్మకు యాక్సిడెంట్ అయిన తర్వాత రెండేళ్లపాటు నరకం చూశామని తన తండ్రి రాజు తెలిపారు. విశాఖలోని సీతమ్మధారలో ఉండే తాము కలవని డాక్టర్...చెయ్యని ప్రయత్నం లేదని అన్నారు. అయితే తాము కుంగిపోయినా  రవి వర్మ మాత్రం తనకు తానే ధైర్యం చెప్పుకోవడమే కాక..తమకు సైతం ధైర్యం చెప్పేవాడని చెప్పారు. ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తున్న తమ కొడుకును చూస్తుంటే ఎంతో గర్వగా ఉంటుందని అంటున్నారు ఆయన.
 
సీయం జగన్ అభినందన
 
రెండు కాళ్ళు లేని  పరిస్థితుల్లో దేశం మొత్తం ఏకంగా 27 వేల కిలోమీటర్ల దూరం డ్రైవింగ్ చేసుకుంటూ తిరిగివచ్చిన రవి వర్మ ను ఏపీ సీఎం జగన్ సైతం అభినందించారు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget