అన్వేషించండి
Advertisement
Tamil Martial Art: వైజాగ్‌లో తమిళ మార్షల్ ఆర్ట్స్ సిలంబం ట్రైనింగ్, కర్రసామును పోలి ఉండే యుద్ధ విద్య
తమిళ యుద్ధ విద్య సిలంబం లో రాణిస్తున్న తెలుగు యువకుడు. తెలుగు కర్రసామును పోలివుండే ఈ ఆర్ట్ ను తాను ఆర్మీలో ఉండగా ఒక తమిళ అధికారి వద్ద నేర్చుకున్నాడు.
Tamil Martial Art Silambam Teaching in Vizag: వైజాగ్ కు చెందిన దూది మహేశ్వర రావు తమిళ మార్షల్ ఆర్ట్ సిలంబంలో ఆరితేరాడు . తెలుగు కర్రసామును పోలివుండే ఈ ఆర్ట్ ను తాను ఆర్మీలో ఉండగా ఒక తమిళ అధికారి వద్ద నేర్చుకున్నాడు. 19 ఏళ్లకే ఆర్మీ కి వెళ్లడంతో తొందరగానే రిటైర్ అయి తిరిగి వచ్చేశాడు. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తూనే మరోవైపు ఏయూ గ్రౌండ్స్ లో ప్రతీ రోజూ ఉదయం 5:30 నుండి ఆశక్తి కలవారికి సిలంబం నేర్పుతున్నాడు.
ఆర్మీ లో నేర్చుకున్న విద్యను అందరికీ నేర్పుతున్న మహేష్
ఆర్మీ లో నేర్చుకున్న విద్యను ప్రతీరోజూ ప్రాక్టీస్ చేస్తుండగా గమనించిన ఆంధ్ర యూనివర్సిటీ అధ్యాపకులు మహేశ్వర రావును ప్రోత్సహించడంతో సిలంబం లో జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుపొందాడు . అంతర్జాతీయ స్థాయిలో సిలంబం లో గుర్తింపు పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరూ మరీ ముఖ్యంగా అమ్మాయిలకు సిలంబం లాంటి మార్షల్ ఆర్ట్ వచ్చి ఉండాలని మహేశ్వర రావు చెబుతున్నారు. దీనివల్ల కేవలం ఒక యుద్ధ విద్య వచ్చిందనే భావన తోపాటు శరీరానికి సరైన వ్యయామం దానివల్ల ఆరోగ్యం లభిస్తాయని అంటున్నారు మహేష్. తన ఎదుగుదలలో ఆంధ్రా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఎంతైనా ఉందని మహేష్ చెబుతున్నాడు. ఇక ఈ సిలంబం నేర్చుకోవడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదనీ .. కాస్త కష్టపడితే ఎలాంటి వారికైనా సులువుగా అబ్బే విద్య ఇదని చెబుతున్నారు మహేశ్వర రావు వద్ద సిలంబం నేర్చుకుంటున్న విద్యార్థులు. అలాగే, దీనిని ఒక మార్షల్ ఆర్ట్ గా మాత్రమే కాకుండా శరీరానికి సరైన ఎక్సర్ సైజ్ గా పరిగణిస్తే ఎన్నో లాభాలు చేకూరతాయనీ... మహేశ్వరరావు లాంటి ఎక్స్‌పర్ట్ దగ్గర ఈ విద్యను నేర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మరో స్టూడెంట్ నవీన్ చెబుతున్నారు.
సిలంబం లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తేవడమే లక్ష్యం : మహేశ్వర రావు
ఇప్పటికే 2021లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ లో స్టిక్ ఫైట్ సింగిల్స్, డబుల్స్ లో గోల్డ్ మెడల్స్, 2001లోనే జరిగిన సౌత్ ఇండియా యూనివర్సిటీ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ లో సింగిల్స్, డబుల్స్ లో గోల్డ్ మెడల్స్, 2021 లో వరల్డ్ యూనియన్ సిలంబం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో వాల్ వీచు లో గోల్డ్ మెడల్ సాధించాడు మహేష్. ఇటీవల కన్యాకుమారిలో జరిగిన నేషనల్ లెవెల్ సిలంబం ఓపెన్ ఛాంపియన్ షిప్ లో మూడు వెండి ,ఒక కాంస్య పథకాన్ని కూడా సాధించాడు. సిలంబం లో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తేవాలన్నదే తన లక్ష్యం అని మహేశ్వర రావు చెబుతున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement