By: ABP Desam | Updated at : 09 Apr 2023 12:33 PM (IST)
వినోద్ కుమార్‌ను కలిసిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించి కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని విజ్ఙప్తి చేశారు ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు. సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వారంతా మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ని కలిశారు. ఈ భేటీలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, కో కన్వీనర్ నీరుకొండ రామచందర్రావు, ప్రతినిధి మంత్రి మురళీకృష్ణ రావు ఉన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్‌తో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తమ పోరాటానికి భారత రాష్ట్ర సమితి మద్దతు ఇవ్వాలని, సీఎం కేసీఆర్ స్వయంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించేలా చూడాలని ఆ ప్రతినిధులు వినోద్ కుమార్‌ని కుమారమాద దను కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమానికి బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ ఆహ్వానాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ వారికి హామీ ఇచ్చారు.
వైజాగ్ లో BRS భారీ బైక్ ర్యాలీ
ఇదిలావుంటే, అంతకుముందు వైజాగ్ లో BRS భారీ బైక్ ర్యాలీ తీసింది. ర్యాలీలో వేలాది మంది యువత పాల్గొన్నారు. ఏపీ BRS అధినేత తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. తెలుగు ప్రజలకు బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణని అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉందని ఆ పార్టీ ఏపీ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మూడు రోజుల విశాఖ పట్నం పర్యటన కోసం వెళ్లిన ఆయనకు వైజాగ్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకులు తోట చంద్రశేఖర్ కి స్వాగతం పలికారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వచ్చారు . విశాఖ ఎయిర్ పోర్టు నుంచి వుడా పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో తోట చంద్రశేఖర్ ని సత్కరించారు. దారిపొడవునా గులాబి జెండాలు కనిపించాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంటుని దొడ్డిదారిన లాక్కోవాలని ప్లాన్- తోట
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకోవడంలో తెలుగు ప్రజలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందని, ఈ పరిరక్షణ ఉద్యమాన్ని కూడా ఆస్థాయిలో నిలబెడతామని తోట చంద్రశేఖర్ అన్నారు. ఏపీ ఆస్తుల్ని యధేచ్ఛగా కొల్లగొడుతుంటే రాష్ట్రంలోని పార్టీ నోరు మెదపడం లేదని, ఒకరితో తప్పుడు లెక్కలతో దొరికిపోయిన అదానీ గ్రూప్ కూడా గంగవరం పోర్టుకి అనుబంధంగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంటుని దొడ్డిదారిన లాక్కోవాలని చూస్తోందని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. స్పష్టమైన సమాచారంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నామని, నిర్ధిష్టమైన ప్రణాళిక ద్వారా ఈ అరాచకానికి అడ్డుకట్ట వేస్తామని వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు తోట చంద్రశేఖర్ విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులతో తోట చంద్రశేఖర్ భేటీ కానున్నారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తామని తద్వారా బలమైన ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని నిర్మిస్తామని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు
AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్ టూర్‌లో కేటీఆర్
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు
AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!
AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!
YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్