అన్వేషించండి
Advertisement
Vizag Public Library: చిన్నారులను ఆకట్టుకుంటున్న జంగిల్ లైబ్రరీ - వైజాగ్‌లో ప్రయోగం సక్సెస్
Visakha Public Library: విశాఖలో కొత్తగా ఏర్పాటైన మియావాకి లైబ్రరీ పిల్లలను, విద్యార్థులను భలే ఆకట్టుకుంటోంది. పిల్లలను బుక్ రీడింగ్ వైపు మరల్చడానికి చేసిన ప్రయత్నం ఫలితాలనిస్తోంది.
Vizag Public Library: విశాఖలో కొత్తగా ఏర్పాటైన మియావాకి లైబ్రరీ పిల్లలను, విద్యార్థులను భలే ఆకట్టుకుంటోంది. ఈ పద్దతిలో ఒక హాల్ ను మొత్తం అడవిని ప్రతిబించేలా రూపొందించారు వైజాగ్‌లోని పబ్లిక్ లైబ్రరీ అధికారులు. దాంతో స్మార్ట్‌ఫోన్లనూ, ఆన్‌లైన్ గేమ్స్‌ను పక్కన పడేసి పుస్తక పఠనం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. టెక్నాలజీ తెచ్చే సౌకర్యాలతో పాటు కొన్ని అవలక్షణాలు కూడా పిల్లల్లో పెరుగుతున్నాయి అంటారు చైల్డ్ సైకాలజిస్ట్‌లు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్స్ లాంటివి వాళ్లను అడిక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. దానితో చిన్న వయస్సులోనే పెద్దలు చెప్పినమాట వినకపోవడం, మొండిగా తయారవడం లాంటి అలవాట్లు దరిచేరుతున్నాయి. అలాకాకుండా వాళ్లను ఆరోగ్యకరమైన బుక్ రీడింగ్ వైపు మరల్చడానికి వైజాగ్ లైబ్రరీ సిబ్బంది చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తున్నాయని వారు చెబుతున్నారు.
మియావాకి అంటే ఏమిటి ?
జపాన్ భాషలో మియావాకి (Akira Miyawaki) అంటే అర్బన్ ఫారెస్ట్ అని అర్ధం. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను లేదా వృక్షాలను పెంచడం అనే కాన్సెప్ట్‌ను జపాన్ దేశానికి చెందిన అకిరా మియావాకి అనే వృక్ష శాస్త్రవేత్త ప్రతిపాదించారు. రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, పట్టణీకరణకు ఇదే సరైన పరిష్కారం అనేది ఆయన సిద్ధాంతం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాయి. IT కంపెనీలు, వ్యాపార సంస్థలు,పెద్దపెద్ద అపార్ట్ మెంట్లలో కొంత భాగంలో మొక్కలను పెంచడానికి కేటాయించడం లేదా కనీసం అలాంటి వాతావరణాన్ని కృత్రిమంగానైనా చెయ్యడం మొదలుపెట్టాయి. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా వైజాగ్‌లోని పబ్లిక్ లైబ్రరీలో ఈ మియావాకి లైబ్రరీ ని ఏర్పాటు చేసి పిల్లల మనసులు ఆకట్టుకున్నారు అధికారులు.
అడవిలాంటి వాతావరణం -రెండువేల బుక్స్ :
ఈ మియావాకి హాల్‌లో ఒకేసారి 25 నుండి 30 మంది పిల్లలు కూర్చుని చదువుకోవచ్చు. దానికోసం 2000 వరకూ పుస్తకాలను ఏర్పాటు చేశారు. వీటిలో పిల్లలకు నచ్చే చిల్డ్రన్ బుక్స్‌తోపాటు పెద్దబాలశిక్ష, మన ఇతిహాసాల వంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. లైబ్రరీలోని ర్యాక్స్‌లో ఉండే ఈ పిల్లల పుస్తకాలను తెచ్చుకుని అడవిని తలపించే మియావాకి హాల్‌లో కూర్చుని చదువుకోవచ్చు. సడన్ గా చూస్తే, ఇదో గది అన్న విషయమే మర్చిపోయేలా ఉంటుంది ఇక్కడి వాతావరణం.
కింద చక్కని గడ్డిని తలపించే గ్రీన్ మ్యాట్, చుట్టూ గోడలమీద జంతువులు, చెట్లు కూడిన వాల్ పేపర్స్, పార్కును తలపించే కుర్చీలు, బెంచ్ ల సెటప్, ఊగుతూ చదువుకోవడానికి ఒక ఉయ్యాలా, చల్లటి గాలిని ఇచ్చే ఏసీ.. ఇవన్నీ ఒక్కసారి అక్కడ అడుగుపెడితే పిల్లలకు వేరే అంశాల మీదకు ధ్యాస పోకుండా ఎట్రాక్ట్ చేసేలా తీర్చి దిద్దారు. పైగా చుట్టుపక్కల పిల్లలు పుస్తకాలు చదువుతుంటే, మిగిలిన పిల్లలకూ ఆటోమేటిక్ గా పుస్తకం మీదకు ఫోకస్ వెళుతుందని, దానివల్ల వా ళ్లు బుక్ రీడింగ్‌కు అలవాటు పడిపోతారని వైజాగ్ పబ్లిక్ లైబ్రరీలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న దుర్గారాణి తెలిపారు.
త్వరలో మరిన్ని కార్యక్రమాలు: లైబ్రరీ అధికారులు
మియావాకి లైబ్రరీ ఇచ్చిన సక్సెస్‌తో ఇకపై లైబ్రరీలోనే క్విజ్ పోటీలు, పబ్లిక్ స్పీకింగ్‌లతో పాటు మెంటల్ ఎబిలిటీని పెంచే కార్యక్రమాలను కూడా త్వరలో ప్రవేశ పెడతామంటున్నారు వైజాగ్ లైబ్రరీ అధికారులు. విశాఖ పట్నంలోని ప్రధాన బస్ స్టేషన్ ద్వారకా బస్‌స్టాండ్ నుంచి గురుద్వారా వెళ్లే దారిలో ఉన్న ఈ మియావాకి లైబ్రరీకి చేరుకోవడం ఎంతో సులభం. మీరు వైజాగ్ వాసులైతే.. ఓసారి మీ పిల్లలను అక్కడికి తప్పకుండా తీసుకెళ్లండి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement