Kurupam: ప్రభుత్వ ఆసుపత్రికి కరెంట్ కట్, సెల్ టార్చ్ లైట్ వెలుతురులో చికిత్స అందిస్తున్న డాక్టర్లు
Kurupam Govt Hospital : ఏపీలో కరెంట్ కష్టాలు కొనసాగుతున్నాయి. మన్యంలో విద్యుత్ సరఫరా లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
![Kurupam: ప్రభుత్వ ఆసుపత్రికి కరెంట్ కట్, సెల్ టార్చ్ లైట్ వెలుతురులో చికిత్స అందిస్తున్న డాక్టర్లు Treatment in Mobile torch light at kurupam govt hospital in Parvathipuram Manyam District Kurupam: ప్రభుత్వ ఆసుపత్రికి కరెంట్ కట్, సెల్ టార్చ్ లైట్ వెలుతురులో చికిత్స అందిస్తున్న డాక్టర్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/30c2c5ef78765e657c2fb267060fcd271693676120312233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kurupam Govt Hospital In Parvathipuram Manyam District:
ఏపీలో కరెంట్ కష్టాలు కొనసాగుతున్నాయి. మన్యంలో విద్యుత్ సరఫరా లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ కోతల వల్ల కురుపాం ప్రభుత్వ వైద్యశాలలలో సెల్ టార్చ్ లైట్ వెలుతురులో చికిత్స అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలేం జరిగిందంటే..
పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం గొయిపాక గ్రామ సమీపంలో బ్రేక్ ఫైల్ అయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108లో హుటాహుటిన కురుపాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విశ్వనాధపురం నుండి ఇందిరానగర్ లో జరుగుతున్న పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరికి కాలికి, తలకి తీవ్రగాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందించి వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి నిరంతాయంగా కరెంట్ కట్ అవుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలో చికిత్స కోసం వచ్చిన వారికి కురుపాం ప్రభుత్వ వైద్యశాలలలో మొబైల్ టార్చ్ లైట్ వెలుతురులోనే చికిత్స అందించారు. విద్యుత్ కోతల వల్ల సెల్ టార్చ్ లైట్ వెలుతురులో పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరెంట్ చార్జీల బాదుడుపై చంద్రబాబు సెటైర్లు
సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక సభలో చెప్పిన డైలాగ్ ను ప్రస్తావిస్తూ కరెంట్ బాదుడుపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ రోజు చెపుతున్నా... కరెంట్ కోతలు లేని చోటు లేదు.. కరెంట్ బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు.. ఈ రెండు జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్ రెడ్డీ! అంటూ తనదైన శైలిలో సీఎం జగన్ పై సెటైర్లు వేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)