KGF Chapter 2: కేజీఎఫ్‌లో చూపించిన వీర ప్రతిమకు ఇంత చరిత్ర ఉందా?

రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ వారి చరిత్ర మాత్రం తర్వాత తరాలు చెప్పుకుంటూనే ఉన్నాయి. ఇలా చెప్పుకోవడానికి ఆనాటి ఆధారాలే కీలకం. అలాంటి ఆధారాల్లో ముఖ్యమైనవే వీరప్రతిమలు.

FOLLOW US: 

కేజీఎఫ్‌ సినిమా చూసిన వారందరికీ వీర ప్రతిమ గురించి తెలిసే ఉంటుంది. అందులో హీరో రాకీ.. వీర ప్రతిమను భూమిలో నుంచి తవ్వించి తీయడంతోనే సినిమా మొదలవుతుంది. చివరిలో ఆ వీర ప్రతిమను భూమిలో పాతిపెట్టడంతో సినిమా ముగుస్తుంది. ఇంతకీ ఈ వీర ప్రతిమ ఏంటీ? దానికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు.? వీర ప్రతిమలు నిజంగానే ఉండేవని మీకు తెలుసా.. ?

వీర ప్రతిమల వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. మనకు అర్థమవ్వాలని సినిమాలో దాన్ని వీర ప్రతిమ అని డైలాగుల్లో చెప్పించారు గానీ వీటి
అసలు పేరు వీరకల్లు. KGF సినిమా తమిళ, కన్నడ వెర్షన్‌లలో దానిపేరు అలానే ఉంటుంది. వీర అంటే వీరుడు.. కల్లు అంటే రాయి.

అసలేంటి ఈ వీర ప్రతిమ అంటే ?.

ప్రాచీన కాలంలో యుద్దాల్లో వీరోచితంగా పోరాడి చనిపోయిన యోధుల జ్ఞాపకార్ధం చెక్కించిన రాతి ప్రతిమలనే వీర కల్లు అని పిలిచేవారు. ఇప్పటి వరకూ దొరికిన ఈ వీర ప్రతిమల్లో అన్నింటికన్నా ప్రాచీనమైనది ఏకంగా క్రీ. పూ. 4వ శతాబ్దంలో తమిళనాడులో దొరికింది. అలా దొరికిన వాటిలో అతి పెద్దది కర్నాటకలో క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందినది. ఒక్క కర్ణాటకలోనే ఇలాంటి వీర ప్రతిమలు ఏకంగా 2650ఉన్నాయి. దక్షిణాదిలో ఈ సంప్రదాయం 18 వ శతాబ్దం వరకూ కొనసాగింది. వీటిని సాధారణంగా గుళ్ల లోనో.. లేక ఆ వీరుణ్ణి పాతి పెట్టిన ప్రదేశంలోనో లేక అతను చనిపోయిన చోటనో ఏర్పాటు చేసేవారు .
 
ఈ వీర ప్రతిమలు ఎలా ఉండేవి

సాధారణంగా ఈ వీర ప్రతిమలు మూడు భాగాలుగా ఉండేవి. పైభాగంలో ఆ వీరుడు కొలిచిన దేవత లేక దైవం పేరు మధ్య భాగంలో వీరుడి బొమ్మ మూడో భాగంలో ఆయన వీర మరణం పొందిన యుద్ధ సంఘటనలు. ఆ వీరుడు ఎవరి కోసం యుద్ధం చేసాడో ఆ రాజు పేరు చెక్కేవారు. ఈ వీరగళ్ళు సాధారణంగా మూడు నుంచి 5 అడుగుల మధ్య ఉంటాయి. కానీ కర్నాటకలోని బేతగిరిలో దొరికిన ఒక వీరకల్లు ఏకంగా 12 అడుగుల ఎత్తు ఉంది. 12 వ శతాబ్దానికి చెందిన రెండు వీర ప్రతిమలు 2017లో దొరికాయి. అవి చాలా అరుదైనవి. ఎందుకంటే అవి యుద్ధంలో పోరాడి చనిపోయిన ఇద్దరు స్త్రీ యోధులకు చెందినవి. అంటే ఆ రోజుల్లో యుద్ధ క్షేత్రంలో స్త్రీ సైనికులు సైతం పోరాడేవారని తెలుస్తుంది .

వీర కల్లు ను బట్టి వీరుడు ఎలా చనిపోయాడో కూడా చెప్పొచ్చు :.

తవ్వకాల్లో దొరుకుతున్న వీర ప్రతిమల ఆధారంగా వీరుడు ఎలా చనిపోయాడో కూడా చెప్పొచ్చు అంటారు చరిత్రకారులు. ఉదాహరణకు వీర ప్రతిమలో వీరుడు గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు ఉంటే అతనితోపాటు గుర్రం కూడా యుద్ధంలో చనిపోయినట్టు అర్థం. అలానే రాజస్థాన్‌కు చెందిన కొన్ని వీర ప్రతిమల్లో వీరుడు ఒంటిపై స్వారీ చేస్తున్నట్టు ఉంటుంది. దానర్ధం అతనితోపాటు ఆ ఒంటె కూడా యుద్ధంలో చనిపోయిందని. అలాగే వీరుడు చేతిలో ఆయుధం ఉంటే ఆ వీరుడు యుద్ధక్షేత్రంలోనే చనిపోయినట్టనీ ఆయుధం లేకుండా ఉంటే యుద్ధంలో గాయపడి తర్వాత చనిపోయినట్టనీ చరిత్రకారులు గుర్తిస్తారు. సాధారణంగా ఈ వీర ప్రతిమలు రాజులు, దళపతులూ, ముఖ్యమైన వీరుల మరణాలకు చెంది ఉంటాయి.

బాహుబలి మూడు బాణాల వీర ప్రతిమ

ఇలా దొరికిన వీర ప్రతిమల్లో కొన్ని బాహుబలి సినిమాలో చూపించిన మూడు బాణాలను ఒకేసారి వాడుతున్నట్టు ఉంటుంది. దీనినిబట్టి ఆరోజుల్లో ఇలాంటి యుద్ధ కళ కూడా ఉండేదని అర్ధం అవుతుంది. ఇలా దొరికిన వాటిలో ఎక్కువగా పల్లవ సామ్రాజ్యం కాలం నాటివి. కేవలం మనుష్యులకే కాదు అత్యంత అరుదుగా జంతువుల పేరు మీద కూడా వీరకల్లు  చెక్కించేవారు. వాటిలో ఒకటి  క్రీ.శ. 939 నాటిది. గంగ సామ్రాజ్య రాజు రెండో బుతుగకు చెందిన శునకం ఒక అడవి పందిని వేటాడుతూ చనిపోవడంతో దానిపేరు మీద కూడా వీర ప్రతిమను చెక్కించారు.

గతంలో వీటికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కేజీఎఫ్‌ లాంటి పాన్ ఇండియా సినిమాతో ఇప్పుడు మళ్లీ ఈ వీర ప్రతిమలు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 

Published at : 23 Apr 2022 02:58 PM (IST) Tags: ANDHRA PRADESH KGF 2 kgf Veera Kallu Veera Pratimalu

సంబంధిత కథనాలు

Tammineni Seetharam : కుళ్లి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు, స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

Tammineni Seetharam : కుళ్లి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు, స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

Jupudi Prabhakar Rao : శెట్టిబలిజలను క్షమాపణలు కోరిన జూపూడి ప్రభాకర్, 'మత్తులో ఉండి చేశారా' కామెంట్స్ పై వివరణ

Jupudi Prabhakar Rao : శెట్టిబలిజలను క్షమాపణలు కోరిన జూపూడి ప్రభాకర్, 'మత్తులో ఉండి చేశారా' కామెంట్స్ పై వివరణ

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్‌

YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా  వైసీపీ స్కెచ్‌

AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర

AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర

టాప్ స్టోరీస్

Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !

KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !

AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !

AP In Davos :   దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !

US Monkeypox Cases : అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన

US Monkeypox Cases  :   అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన