Srikakulam News: సినిమా చూసి థియేటర్‌లోనే చోరీకి ప్లాన్ చేసే ముఠా- 3 రాష్ట్రాల్లో తప్పించుకొని తిరిగే కేటుగాళ్లను పట్టుకున్న శ్రీకాకుళం పోలీసులు
Srikakulam Crime News: నాలుగు రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడే ముఠాను శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వాళ్లు చోరీ చేసే ప్లానింగ్ వేరే లెవల్. అది విన్న పోలీసులే ఆశ్చర్యపోయారు.

Srikakulam Police News: అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. ఇద్దరు కూలీలు జైల్లో పరియమై గజదొంగలుగా మారి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. వీళ్లు దొంగతనం చసే ముందు ఆ ప్రాంతంలోని సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తారు. అక్కడే చోరీకి స్కెచ్ వేస్తారు. ఆ స్కెచ్ ప్రకారం దొంగతనం చేసి ఉడాయిస్తారు.
సుజిత్ కుమార్ పాడి ఒడిశాలో కూలి పనులు చేసుకుంటూ ఉండే వాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వచ్చిన డబ్బులు చాలకపోవడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. సుజిత్ కుమార్ పాడి ఇలా దొంగతనాలు చేస్తూ ఒకసారి పట్టుబడ్డాడు. భర్త జైలుకు వెళ్లడంతో భార్య వదిలేసింది. తన పిల్లలను తీసుకొని వెళ్లిపోయింది. భార్య వదిలి వెళ్లిపోవడంతో పాండే గజదొంగగా మారాడు. మరోసారి పశ్చిమబెంగాల్ పోలీసులకు చిక్కాడు. జైలుకు వెళ్లాడు. పశ్చిమ బెంగాల్‌లో చిక్కి జైలుకు వెళ్లిన పాండేకు బాలకృష్ణ సాహూ అనే వ్యక్తి పరిచయమట్టాడు. ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఎవరికీ కనిపించకుండా రెండేళ్లు తిరిగారు. ఎక్కడెక్కడో చోరీలు చేస్తూ బతికారు.

ఎక్కడా చిన్న క్లూ లేకుండా దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తూ తిరిగిన బాలకృష్ణ, పాడి కొన్నిరోజుల పాటు దారి దోపిడీలకు పాల్పడ్డారు. వీళ్లు చోరీ చేసే ముందు సినిమాకు వెళ్తారు. అక్కడ కూర్చొని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ప్రకారమే చోరీలు చేస్తూ ఎవరికీ చిక్కకుండా తిరిగారు. చివరకు శ్రీకాకుళం జిల్లా పోలీసులకు చిక్కారు. 2016లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారి దొంగతనాల్ని వృత్తిగా పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కోసం ఒడిశా, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్‌లో చోరీలు చేశారు. వీళ్ల కోసం నాలుగు రాష్ట్రాల పోలీసులు వెతకసాగారు. మొత్తానికి శ్రీకాకుళం పోలీసులకు చిక్కారు.
Also Read: పెళ్లి చేసుకుని బిడ్డను కని భార్యను వదిలేశాడు - 2 రోజులుగా భర్త ఇంటి ముందే బాధితురాలి మౌన పోరాటం
ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 4.90 లక్షల విలువ గల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన చైన్‌స్నాచింగ్ కేసులో ఒడిశాలోని బరంపురానికి చెందిన సుజిత్ కుమార్ పాడి, బాలకృష్ణ సాహును అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు విచారిస్తే... సదరు నిందితులకు కొత్తూరు, మందస, ఎచ్చెర్ల, కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరం చేసినట్టు గుర్తించినట్టు తెలిపారు. వీరిద్దరూ అనేక కేసుల్లో శిక్షలు పడడం, జిల్లాలో జరిగిన చోరీ కేసుల్లో నిందితులుగా ఉండడం వల్ల వీరిపై రౌడీషీట్ తెరవబోతున్నట్టు తెలిపారు.

నిందితుడు సుజిత్ పదో తరగతి వరకు చదివి మానేశాడు. బరంపురంలో జరిగిన గొడవల్లో అరెస్టయి జైలులో ఉండగా బాలకృష్ణ సాహుతో పరిచయమైంది. ఇద్దరూ ఒడిశాలోని బరంపురం, పర్లాకిమిడి, కాశీనగర్, గురండి తదితర ఏరియాల్లో ఒంటరి మహిళలే టార్గెట్‌గా దారి దోపిడీలు చేశారు. కొన్నాళ్లు అరెస్టయి జైల్లో ఉన్నారు. శ్రీకాకుళంజిల్లాలో వీరిపై 2016 నుంచి 2024 వరకు మొత్తం 32 కేసులు నమోదయ్యాయి. కంచిలి, మందస, బారువ, నందిగాంలో కేసులు ఉన్నాయి. మధ్యలో అరెస్టైనై జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్తూరు, మందస, ఎచ్చెర్ల, కోటబొమ్మాళిలో నేరాలు చేసినట్టు తెలిపారు. గురువారం సాయంత్రం మెట్టూరు జంక్షన్ వద్ద కొత్తూరు పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్‌తో వచ్చి పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు.





















