అన్వేషించండి

Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు- చిన్న నిర్లక్ష్యంతో పోతున్నాయి ప్రాణాలు

Srikakulam Latest News: ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. కళ్ళ ముందే ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. చిన్న చిన్న నిర్లక్ష్యాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి.

Road Accidents In Srikakulam: మొన్న కంచిలి మండలం జక్కర సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురుకి గాయాలయ్యాయి. నిద్రలో విద్యుత్ స్తంభానికి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

మొన్నటికి మొన్న నరసన్నపేట మండలం సత్యవరం -గొట్టిపల్లి రోడ్డులో పశువైద్యశాఖకి చెందిన వాహనాన్ని వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు.

అంతకుముందు కోటబొమ్మాళి సమీపంలో అతివేగంగా దూసుకువచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మహిళా ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే చనిపోయారు. ఎల్ బోర్డు పెట్టుకున్న ఓ వ్యక్తి కారును మితిమీరిన వేగంతో నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు.

ఇలా జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనకి గురి చేస్తున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారితోపాటు వాటిని అనుబంధంగా ఉండే సర్వీసు రోడ్లు, రాష్ట్ర రహదారుల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరి ప్రాణాలు స్పాట్‌లోనే గాలిలో కలసిపోతున్నాయి. పెద్ద సంఖ్యలో గాయాలపాలవుతున్నారు. ఈ ప్రమాదాలు వాటి కారణంగా జరుగుతున్న మరణాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. 

వాహనాలతోరోడ్డెక్కితే తిరిగి ఇంటికి వస్తామో రామోనన్నంతగా భయపడుతున్నారు. నిబంధనల ప్రకారం వాహనాలు నడుపుకుని వెళ్లే వారు సైతం ఎదురుగా వచ్చే వాహనాల వల్ల ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల తప్పు చేయని వారు కూడా దుర్మరణం పాలవుతున్నారు. తప్పు చేయకపోయినా తెలియకుండా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. 

రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి కలిగిన జిల్లాలలో శ్రీకాకుళం ఒక్కటి. అటు పైడిభీమవరం నుంచి ఇటు ఇచ్చాపురం వరకూ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిలో ఎక్కడికక్కడ బ్లాక్ స్పాట్ లు ఉన్నాయి. వాటి వద్దనే కాకుండా ఇప్పుడు ఇతర ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్‌లు అవుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే హైవేకి ఆనుకుని ఉన్న సర్వీసురోడ్లలో కూడా ఇటీవల ప్రమాదాలు పెరిగిపోయాయి. రాష్ట్ర రహదారులలో కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. 

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ఒక వైపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. బ్లాక్ స్పాట్‌లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, అతి వేగం ప్రమాదకరమంటూ పోలీసులు సూచిస్తునే ఉన్నారు. అయినా వాటిని జనం పాటించకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

ప్రమాదాలకి కారణాలెన్నో ...
రోడ్డు ప్రమాదాలకి ఎక్కువగా అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణాలవుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుభవరాహిత్యం, నిబంధనలు పాటించకపోవడం మరో రీజన్. మలుపుల వద్ద సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, గుంతల రోడ్లు, ఎదురుగా వచ్చే వాహనాల హైభీమ్ లైట్లు కారణంగా ఇలా అనేకం ఈ ప్రమాదాలు తెచ్చిపెడుతున్నాయి. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, హెల్మెట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు జరుగుతున్నాయి. కారణం ఏదైనా ప్రమాదాల వల్ల ప్రాణాలో గాలిలో కలసిపోతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.

తనిఖీలు చేస్తున్నా ఆగని ప్రమాదాలు
పోలీసులతోపాటు రవాణా శాఖ అధికారులు రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. జరిమానాలు విధిస్తునే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌కి పాల్పడే వారిని గుర్తించి ఫైన్ వేస్తున్నారు. హెల్మెట్లు ధరించని వారికి, సీటు బెల్ట్ పెట్టుకోని వారికి కూడా ఫైన్‌లు విధిస్తున్నారు. ఇంత చేస్తున్న ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.
అధికారులు ఫోకస్ పెట్టాల్సిందే

జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్న వేళ కట్టడిపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర రహదారులలో విరివిగా తనిఖీలు నిర్వహించి అతివేగానికి కళ్లెం వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లాక్ స్పాట్‌లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలంటున్నారు. కొత్త సంవత్సరంలోనైనా ప్రమాదాలను నివారించేందుకు అటు పోలీసులు ఇటు రవాణా శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు.

Also Read: అధికారుల తప్పిదంతో జీతాలు రాని దుస్థితి - పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలోని ఉద్యోగుల వెతలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Embed widget