Srikakulam Latest News: పెరుడు ఒడిశాలో గుమ్మం ఆంధ్రాలో, ఒకే ఊరు రెండు రాష్ట్రాల్లో, విభేదాల్లేకుండా సాగుతున్న బోర్డర్‌లోని పల్లెలు
Srikakulam Latest News: ఒకే ఊరు రెండు రాష్ట్రాలు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దు మెలియాపుట్టిలోని గ్రామ ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Andhra Odissa Border Villages : ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో విచిత్రమైన పరిస్థితిలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ సరిహద్దు ప్రజల రెండు రాష్ట్రాల సంప్రదాయాలు పాటిస్తారు. అయితే ఓ రెండు గ్రామాల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఒకే గ్రామం రెండు రాష్ట్రాల్లో భాగమై ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో వేర్వేరు మండలాల్లో రెండు గ్రామాలు అటు ఒడిశా, ఇటు ఏపీలో ఉన్నాయి. పాతపట్నం నియోజకవర్గంలోని మెళియాపుట్టి మండలం రట్టిణి, కొత్తూరు మండలంలోని కౌసల్యపురం రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు 5 దశాబ్దాలకుపైగా రెండు రాష్ట్రాల్లో ఈ ఊళ్లు ఉన్నాయి.
రాష్ట్రాలు వేరు కావచ్చు కానీ గ్రామం మొత్తం కలిసే ఉంటారు. ఒకేమాట.. ఒకేబాటగా కలిసి సాగుతున్నారు. ఇరు రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. రట్టిణి, కౌసల్యపురం గ్రామాలలో అగండు ఆంధ్రలో పెరడు ఒడిశాలో ఉంటుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుగా ఒక బావి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి తాగు నీటిని తెచ్చుకుంటున్నారు.
రాష్ట్రాలు వేరైనా వారంతా సుమారు 50 ఏళ్ల నుంచి ఐక్యమత్యంతో కలిసిమెలసి జీవనం సాగిస్తున్నారు. రట్టిణిలో 336 కుటుంబాలు ఉండగా.. దాదాపు వెయ్యి మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామానికి ఎడమ వైపు ఆంధ్రా పాఠశాల, కుడివైపు ఒడిశా పాఠశాల ఉన్నాయి. విద్యార్థులు నచ్చిన భాషలో చదువుకునేందుకు అవకాశం ఉంది. ఆంధ్రా పాఠశాలలో ఒడియా ఉపాధ్యాయులను నియమించారు. పేరుకు ఆంధ్రా పాఠశాల అయినా అక్కడ ఒడియా భాషలోనే విద్యాబోధన సాగుతుంది.
ఆంధ్రాలో సంక్షేమపథకాలు బాగుంటాయని ఒడిశా వాసులు అంటున్నారు. మీ సంప్రదాయాలు బాగుంటాయని కితాబు ఇస్తున్నారు. ఒకే ఊరు రెండు రాష్ట్రాలు అయినప్పటికీ తమకు మాత్రం ఎవరి నుంచి ఎవరికీ ఇబ్బందులు అయితే లేవు. ప్రభుత్వాలు వేరు రాష్ట్రాల వేరు వాళ్ళు ఎలా పడినా మీ మాత్రం కలిసిమెలిసి ఐక్యమత్యంగానే ఉంటామంటున్నారు. ఏ కార్యక్రమం అయినా ఏ పండగైన అందరం సరదాగా సందడిగానే చేసుకుంటామంటారు. రెండు రాష్ట్రాలు వేరు అని ఏ రోజు కూడా సమస్యలు లేకుండానే ఉంటామన్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలకు ఎప్పుడైనా వెళ్లారా? ఈసారి ట్రిప్‌కి ప్లాన్ చేసేసుకోండిలా
రాష్ట్రాలు వేరై ఆంధ్రాలో చదువులు కొంత బాగున్నాయి అయినప్పటికీ ఒడిశాలో చదివితే ఆంధ్రాలో పని చేయని పరిస్థితి ఏర్పడింది. ఒడిశాలో చదివితే ఆంధ్రాలో పని చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాము. గ్రామంలో తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇది ఏపీ గ్రామం అనుకొని ఒడిశా వాళ్లు నీళ్లను విడిచి పెట్టడం లేదు. ఈ నీటి కోసం ఎప్పటినుంచో వివాదాలు ఉన్నప్పటికీ కలిసే ఉంటున్నారు.
సరిహద్దు గ్రామాల్లో చెక్ పోస్టులతో సమస్య వస్తోంది. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. వాటిని కూడా ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ రెండు గ్రామాల్లోనే కాదు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతాల్లో కొన్ని విభేదాలు ఉన్నాయని తమకు ఎలాంటి సమస్య లేదన్నారు.
ఎన్నికల టైంలో నేతలు ఈ బోర్డర్‌లోకి వచ్చి వెళ్తూ ఉంటారుని చెబుతున్నారు. ఒడిశా నేతలు ఏపీ వాళ్లను, ఏపీ నేతలు వచ్చినప్పుడు ఒడిశా ప్రజలను పలకరిస్తారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. ప్రభుత్వాలు ఆలోచించి చిన్న చిన్న సమస్యలు తీరిస్తే తమకు ఎలాంటి సమస్య లేదని అంటున్నారు ఇక్కడ ప్రజలు.
Also Read:పెద్ద పండగకు మోగిన నెలగంట- పల్లెల్లో సందడి చేస్తున్న హరిదాసులు, బుడజంగాలు