అన్వేషించండి

విశాఖలోని ఖాళీ భవనాలపై ఐఏఎస్ ల కమిటీ ఆరా 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ నాటికి వైజాగ్ నుంచి పాలన సాగుతుందని ప్రకటించారు. అన్ని అనుకూలిస్తే డిసెంబరులోనే మకాం మార్చేయనున్నట్లు ప్రకటించారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ నాటికి వైజాగ్ నుంచి పాలన సాగుతుందని ప్రకటించారు. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్న జగన్, మూడు నెలల తర్వాత అమరావతి నుంచి షిఫ్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంచి ప్రాంతం వెతకమని ఇప్పటికే అధికారులకు సూచించినట్లు, మధురవాడలోని ఐటీ హిల్స్‌-2పై ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో ఇటీవలే జగన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రావాలంటే పెద్ద సెటప్‌ అవసరం ఉంటుందని, భద్రతాపరమైన ఏర్పాట్లతో పాటు ఉన్నతాధికారులు ఉండటానికి భవనాలు కావాలన్నారు. అన్ని అనుకూలిస్తే డిసెంబరులోనే మకాం మార్చేయనున్నట్లు ప్రకటించారు. 

పర్యాటక శాఖ స్థలం ఆరా
జగన్‌మోహన్‌రెడ్డి వైజగ్ కు మకాం మార్చేస్తానని ప్రకటించడంతో అధికారులు అవసరమైన ఏర్పాట్ల నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి, సీఎంవోలో కీలక అధికారుల నివాసాలకు అవసరమైన భవనాలను గుర్తించేందుకు ఐఏఎస్‌లతో ప్రభుత్వం కమిటీ నియమించింది. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ, విశాఖ నగరంలో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు సేకరించే పనిలో బిజీ అయ్యారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్‌ విభాగం కార్యదర్శి పోలా భాస్కర్‌ ఇప్పటికే జిల్లా అధికారులతో పలు సార్లు సమావేశం అయ్యారు. ఏ యే ప్రాంతంలో  ఏ యే భవనాలు ఖాళీగా ఉన్నాయి ? ఆ భవనాల విస్తీర్ణం ఎంత ? ఏ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంది ? భద్రతాపరంగా లోపాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలపై  ఐఏఎస్ ల కమిటీ వివరాలు రాబడుతోంది. రుషికొండ వద్ద రాడిసన్‌ బ్లూ హోటల్‌ ఎదురుగా ఉన్న పర్యాటకశాఖకు చెందిన మూన్‌ ల్యాండ్‌ ప్రాజెక్టు స్థలంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

ఏయూలో ఖాళీ భవనాలపై నివేదిక
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్లాటినం జూబ్లీ అతిథిగృహంతో పాటు లోపల కొన్ని బంగ్లాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా పూర్తయిన ఖాళీ భవనాలు కొన్ని ఉన్నట్లు తెలిసింది. విమ్స్‌, ఆంధ్ర వైద్య కళాశాలలో కొత్తగా నిర్మిస్తున్న వాటి వివరాలు అధికారులు కలెక్టరుకు అందజేశారు. ఆ వివరాలన్నీ కమిటీకి అందజేసినట్లు సమాచారం. అంతకుముందు కమిటీలోని కీలక అధికారి రుషికొండ మార్గంలో పర్యటించినట్లు తెలిసింది. వీఎంఆర్‌డీఏ కీలక ప్రాజెక్టుల మీద మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సమీక్షించారు. ప్రతి శాఖకు సంబంధించిన భవనాల విస్తీర్ణం, ప్రస్తుత వినియోగం, ఖాళీ వంటి అంశాలపై ఆరా తీశారు. ఇదే సమయంలో కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, వాటికి సంబంధించిన పనులు ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకున్నారు. ఇప్పటికిప్పుడు పునరుద్ధరించి అప్పగించడం కష్టమన్నట్లు తెలిసింది. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాల ఏర్పాటు కోసం వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీకు చెందిన ఖాళీ భవనాలు, వాణిజ్య సముదాయాల పైనా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. 

దసరా తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ పాలనను విశాఖ నుంచే అందించాలని భావించారు.  అది కాస్త డిసెంబర్ కు పోస్ట్ పోన్ అయింది. డిసెంబరు 21న జగన్‌ పుట్టినరోజు నేపథ్యంలో ఆ రోజన లేదా కొద్దిగా అటూ ఇటుగా విశాఖకు వెళతారని తెలుస్తోంది. మూడు రాజధానుల అంశానికి సంబంధించిన కేసుపై విచారణను సుప్రీంకోర్టు డిసెంబరుకు వాయిదా వేసింది. కోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందో చూసిన తర్వాతే సీఎం విశాఖకు వెళ్తారన్న వార్తలూ వస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget