అన్వేషించండి

Janasena Trishul Vyuham: దసరా నుంచి జనసేన ‘త్రిశూల వ్యూహం’, ఇంతకీ Pawan Kalyan ఏం చేయబోతున్నారు

Pawan kalyan In Visakhapatnam | దసరా నుంచి జనసేన ‘త్రిశూల వ్యూహం’ వ్యూహం అమలు చేస్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

Janasena Meeting In Vizag | విశాఖపట్నం: నిస్వార్ధంగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు, భవిష్యత్తులో బలమైన నాయకత్వం అందించడానికి, నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారికి భద్రత అందించడానికి ‘త్రిశూల్ వ్యూహం’ రూపొందిస్తున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యూహం దసరా నుంచి అమలు చేయబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యూహం ద్వారా జనసేన పార్టీకి ఒక కొత్త అధ్యాయం మొదలు అవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మూడు రోజుల పార్టీ కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాయంత్రం జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. శక్తి, ధర్మం, రహస్యాలకు ప్రతీకగా ఉండే సంకేతం పరమశివుడి త్రిశూలం. అదే తీరుగా ఈ వ్యూహంతో ప్రతి క్రియాశీలక కార్యకర్తకు జనసేన పార్టీ గుర్తింపు, నాయకత్వం, భద్రత ఇవ్వనున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికలకు మరింత సన్నద్ధత చెందేందుకు, పార్టీ పటిష్టత కోసం ఒక నూతన శక్తిని, నియమాలను అనుసరించి నాయకత్వం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలిపారు.

పార్టీ క్రియాశీల కార్యకర్తల కోసం ప్రత్యేక వ్యూహం
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు, "సర్వ స్ధాయిల నుండి, గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలన్నది నా లక్ష్యం. ప్రతి క్రియాశీల కార్యకర్త ప్రత్యేక మెంబర్‌షిప్ ఐడీతో పటిష్టమైన వ్యవస్థలో భాగస్వామ్యమవుతారు. నాయకత్వం పదవి కాదు, అది సేవ ద్వారా, పోరాటంతో సంపాదించే గౌరవం." క్రియాశీల కార్యకర్తలను, సరిగా శిక్షణ ఇచ్చి సేవా భావంతో ముందుకు వచ్చినవారే నాయకులు అవుతారు" అని అన్నారు.


Janasena Trishul Vyuham: దసరా నుంచి జనసేన ‘త్రిశూల వ్యూహం’, ఇంతకీ Pawan Kalyan ఏం చేయబోతున్నారు

దేశ రాజకీయ చరిత్రలో ఎవరికీ సాధ్యపడని విధంగా, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో అఖండ విజయాన్ని సాధించాం. 2014లో కేవలం 150 మంది కార్యకర్తలతో ప్రారంభమైన జనసేన యాత్ర, ఇవాళ 12 లక్షల పైచిలుకు క్రియాశీల కార్యకర్తల బలానికి చేరింది. పార్టీ ఆలోచనలపై నమ్మకం ఉంచి దశాబ్దకాలం పాటు నడిచిన జన సైనికులు, వీర మహిళలే నిజమైన హీరోలు. వాళ్ల నిబద్ధత, పోరాటం వలనే 21 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో అపూర్వ విజయాన్ని అందుకోగలిగాం - పవన్ కళ్యాణ్

నమ్మకంతో పాటు మార్పు అవసరం
ప్రజల ఆకాంక్షలకు సమాధానం ఇచ్చే విధంగా కొత్త నాయకులను తయారు చేసేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సైద్ధాంతిక శిబిరాలు ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాల్లో కులం, మతం, ప్రాంతం లేదా రంగు వంటి అంశాల ఆధారంగా లబ్ధి పొందే పరిస్థితులు ఉండకూడదు. కులం కోసం ప్రయాణం సాగిస్తే కుల నాయకుడిగా మాత్రమే పరిమితమవుతాను. నేను జాషువా విశ్వనరుడు స్ఫూర్తితో, సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు.

మహిళా కార్యకర్తలు, యువ నాయకత్వం
సమాజంలో మహిళా కార్యకర్తలకు మరింత శక్తి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ఆడపడుచులకు 33 శాతం రిజర్వేషన్, సామర్థ్యం ఉన్న మహిళలను స్వతంత్రంగా ఆలోచించే నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.


Janasena Trishul Vyuham: దసరా నుంచి జనసేన ‘త్రిశూల వ్యూహం’, ఇంతకీ Pawan Kalyan ఏం చేయబోతున్నారు

ప్రజల సంక్షేమం, రోడ్లు, నీటి సరఫరా
2024 నాటికి జనసేన పార్టీ ప్రభావం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందాలని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని, అలాగే 2024 ఎన్నికలలో 100 శాతం విజయాన్ని సాధించడానికి పార్టీలో ఉన్న అందరి సహకారం అవసరం అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను నిరసించి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన నిధులు, ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకురావడంలో జనసేన పార్టీ ప్రతిష్టాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పారు. భవిష్యత్తు మార్పును, చైతన్యాన్ని ప్రజల్లో నింపాలని, దసరా నుంచి ఒక నూతన సేనను నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

"జనసేన పార్టీ, ప్రజల సమసమాజ ప్రయోజనాలు కోసమే పయనిస్తున్నది. జాతీయ స్థాయికి చేరుకునేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు, మహిళా కార్యకర్త అందరూ తమ విధిలో శక్తివంతంగా పని చేస్తే, ఈ ఉద్యమం విజయం సాధించవచ్చు" అని పవన్ కళ్యాణ్ అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget